Monday, August 3, 2009

పండుగ , Festival




పండుగ : కుటుంబ సభ్యులు ,బంధువులు ,స్నేహితులు , ఇరుగు పొరుగు వాళ్ల తో కలిసి ఆనందము గా జరుపుకునే ... సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయిక రోజే .. పండుగ (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. మన భారత దేశములో ఎన్నో మతాలు , జాతులు , రక రకాల భాషలు వారు నివసిస్తున్నారు . ముఖ్యము గా పండగలు మతపరం గాను , భాషా పరంగాను జరుపుకుంటారు .
ముఖ్యమైన రకాలు :
  • హిందువుల పండగలు
  • ముస్లిం ల పండగలు ,
  • క్రైస్తవుల పండగలు ,
  • సిక్కుల పండగలు ,

కొన్ని హిందువుల పండుగలు-పర్వములు :

  1. వినాయక చవితి
  2. ఉగాది
  3. శ్రీరామనవమి
  4. అట్లతదియ
  5. అక్షయతృతీయ
  6. ఏరువాక పున్నమి ,
  7. నాగపంచమి
  8. కృష్ణజయంతి
  9. చాతుర్మాస్యము
  10. ఏకాదశి
  11. ముక్కోటి ఏకాదశి ,
  12. భీష్మైకాదశి - భీష్మాష్టమి
  13. శ్రావణపూర్ణిమ - -
  14. రాఖీపూర్నిమ (రాఖీ పండగ),
  15. మహాలయ పక్షము
  16. మహాలయ అమావాస్య ,
  17. విజయదశమి
  18. నవరాత్రోత్సవం (దసరా) ,
  19. దీపావళి
  20. మకరసంక్రాంతి
  21. రథసప్తమి
  22. మహాశివరాత్రి
  23. హోలీ
  24. వసంతపంచమి
  25. సుబ్రహ్మణ్య షష్టి(సుబ్బరాయషష్టి)
  26. పరశురామజయంతి
  27. హనుమజ్జయంతి
  28. వామనజయంతి
  29. నృసింహజయంతి
  30. తులసీపూజ
  31. అనంత పద్మనాభ చతుర్దశి
  32. వరలక్ష్మీ వ్రతము
  33. సత్యనారాయణ వ్రతము
  34. బతుకమ్మ పండుగ
  35. చంద్రోదయ ఉమావ్రతం
  36. చుక్కలమావాస్య నోము ,
  37. కోజగారీ వ్రతము ,
  38. పోలేరమ్మ వ్రతం ,

ముస్లింల పండుగలు :

ప్రపంచంలోని ముస్లింల సమూహం, సాంవత్సరిక కాలంలో జరుపుకునే సాంప్రదాయిక పండుగలు. ఇవి దాదాపు ధార్మిక విశ్వాసాలు గలవే.
ముస్లింల సాంప్రదాయాలు అనగానే అరబ్బుల, తురుష్కుల, మొఘలుల సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి. ముస్లింల సాంప్రదాయాలు అనే అంశమే చర్చనీయాంశంగా అనిపిస్తుంది. ఇస్లాం మతం 7వ శతాబ్దం అరేబియాలో స్థాపింపబడిన మతము. ఇస్లాం అనునది ఆధ్యాత్మిక ధార్మిక జీవనవిధానం. ప్రారంభదశలో అరబ్బుల సాంప్రదాయాలే ముస్లిం సాంప్రదాయాలనే భ్రమ వుండేది. కానీ ఇస్లాం అనునది కేవలం అధ్యాత్మిక ధార్మిక జీవనవిధానాలనేకాకుండా విశ్వజనీయత, విశ్వసోదరభావం, వసుదైకకుటుంబం, మానవకళ్యాణం, సామాజికన్యాయం, సర్వమానవసౌభ్రాతృత్వం మొదలగు విశ్వౌదారగుణాలనుగల్గిన సంపూర్ణ జీవనవిధానమని మరువగూడదు.

ఇస్లాం అరేబియానుండి, టర్కీ, పర్షియా, మంగోలియా, భారతదేశం, ఉత్తర తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియా, జావా (ప్రాంతం), మలయా, సుమిత్రా మరియు బోర్నియో ప్రాంతాలలో శరవేగంగా విస్తరించింది.

ముస్లిం సాంప్రద్రాయం అనే పదం సాధారణంగా ఒక మతరహితమైన ఒక సామాజిక సంస్కృతిగా చారిత్రక ఇస్లామీయ సభ్యతగా పరిగణించేవారు. ముస్లింలు ప్రపంచంలోని పలు దేశాలలో విస్తరించారు. పర్షియన్లుగా, తురుష్కులుగా, భారతీయులుగా, మలయీలు (మలేషియన్లు) గా, బెర్బర్లు (ఇండోనేషియన్లు) గా స్థిరపడి ముస్లింల సాంప్రదాయాన్ని ప్రాపంచీకరించారు

పూర్తీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి : -> ముస్లింల పండుగలు
:


కొన్ని పండుగల జాబితా
  1. మొహర్రం నెల : ఇస్లామీయ సంవత్సరాది, ఆషూరా
  2. జమాది-ఉల్-అవ్వల్ : మీలాద్-ఉన్-నబి
  3. రజబ్ నెల : షబ్-ఎ-మేరాజ్ (లైలతుల్-మేరాజ్, లైలతుల్-ఇస్రా)
  4. షాబాన్ నెల : షబ్-ఎ-బరాత్ (లైలతుల్-బారాహ్)
  5. రంజాన్ నెల : జుమతుల్-విదా, షబ్-ఎ-ఖద్ర్ (లైలతుల్ ఖద్ర్),
  6. షవ్వాల్ నెల : ఈదుల్ ఫిత్ర్ (రంజాన్ పండుగ)
  7. జుల్-హిజ్జా నెల : ఈదుల్-అజ్ హా (బక్రీదు)


క్రైస్తవుల పండుగలు:
  • పండుగలు , సంబరాలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మనుష్యుల మధ్య స్నేహ సౌమనస్యాల్నిపెంపొందిస్తాయి . ఇలాంటి పండుగలలో క్రైస్తవ పండుగలు ముందుంటాయి .

క్రైస్తవుల ముఖ్యపండుగలు మూడు:

  1. క్రిస్టమస్
  2. ఈస్టర్
  3. గుడ్ ఫ్రైడే


సిక్కు పండగలు :
  1. బల్సాఖి (వల్సఖి)-Balsakhi,
  2. దీవాలి -Diwali ,
  3. హల మొహల్లా -Hola Mohalla ,

పండుగ గురించి మరిన్ని విషయాలు :కోసము ఇక్కడ క్లిక్ చేయండి .

No comments: