Thursday, October 8, 2009

నవరాత్రోత్సవము(దసరా), Navaratrotsavam (Dasara)

dr

  • దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక పేరు వచ్చింది. కొందరు పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతిమూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలనుఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులునవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒకఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. రోజుప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.


  • దసరాపండుగవిజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులుజరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో తొమ్మిది రోజులు అమావాస్య నుంచినవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటంఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులువనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. సందర్భమున రావణ వధ, జమ్మి ఆకులపూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసిఅతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10 రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదేవిజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.

నవరాత్రి విశేషాలు :

పూర్వం దేనదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే "విజయదశమి"గా పేర్కొంటున్నారు. శ్రవణానక్షత్రంలోకలిసిన ఆశ్వీయుజ దశమికి విజయా సంకేతమున్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చినది.

ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణాలో ఈ పండుగ దినాలలో "బతుకమ్మ పండుగ"ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

అట్టి మహిమాన్వితమైన ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.

ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. "రామలీల ఉత్సవాలు". పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు.

అందుచేత విజయదశమినాడు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి శుచిగా తలస్నానము చేసుకోవాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.

ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.

ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే... "శ్రీ మాత్రే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి.

ఇకపోతే.. విజయదశమి నాడు శ్రీశైలం, దుర్గాదేవీ ఆలయాలను సందర్శించడం మంచిది. అలాగే ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామము, కోటికుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.

అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవిభక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

మరోవైపు విజయదశమి నాడు ముఖ్యంగా చేయాల్సింది.. "శమీపూజ". శమీవృక్షమంటే.. జమ్మిచెట్టు.. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు.

తిరిగి అజ్ఞాతవాసము పూర్తికాగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున "అపరాజితా" దేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు పేర్కొంటున్నాయి.

అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున ఈ "అపరాజితాదేవి"ని పూజించి రావణుని సంహరించి విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం "పాలపిట్ట"ను చూసే ఆచారం కూడా ఉంది.

"శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శిని ||"

అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ.. పై శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మిచెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

అందుచేత.. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేందుకు, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందడానికి.. విజయదశమినాడు అమ్మవారిని ప్రార్థిద్ధాం..! అందరికీ దసరా శుభాకాంక్షలు..!.
----------------------------- ఇంకా కొన్ని విశేషాలు :
దేవీ నవరాత్రి పూజలు రామాయణ కాలంనాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే ధన్-హరా అని, అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురిని పదితలలు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు.

ఇక నవరాత్రి వ్రతాన్ని తొమ్మిదిరోజులు దేవినవరాత్రి వ్రతంగా ఆచరించి విజయదశమి రోజున వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

"ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కుష్మాండేతి చతుర్థికీ
పంచమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా."

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే.. అలంకారాలు వేరైనా అమ్మ దయ అందరిపట్ల ఒక్కటే. అట్టి మహిమాన్వితమైన ఆ దేవదేవి ఆవిర్భావ విశేషమేమిటంటే..? పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభులతో పదివేల సంవత్సరాలు పోరాడినా, వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహాదేవి.. ఆ మధుకైటభులను మోసపూరితుల్ని చేస్తుంది.

దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందులకు శ్రీ మహావిష్ణవును మెచ్చుకుని నీకు ఏం వరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా కోరుకుంటాడు. దానితో వారు తమకు ఇక మరణము తప్పదని నిర్ణయించుకుని, తమను నీరులేనిచోట చంపమని కోరతారు. అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాళంతో సంహరించు సమయాన.. మహామాయ పదితలతో, పదికాళ్లతో, నల్లనిరూపుతో "మహాకాళి"గా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణవునకు సహాయపడుతుంది.

అనంతరం "సింహవాహినిగా" మహిషాసురుని, మహామాయ సరస్వతి రూపిణిగా, శుంభ, నిశుంభలను వధించింది. చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీ కృష్ణునికి సహాయపడింది.

తర్వాత ఐదో అవతారంసో ఒక రాక్షస సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడం వల్ల "రక్తదంతి" అయినది. లోకాలన్నింటిని కరువుకాటకముల నుంచి తప్పించి "శాకంబరి"గా పేరు సంపాదించింది. ఇలా దుర్గుడను రాక్షసుడిని సంహరించి "దుర్గ"గా, మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తోన్న అమ్మవారిని, పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్టతో పూజించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేనీ శుభకార్యాలకు శ్రీకారం చుడితే విజయవంతమవుతాయని వారు చెబుతున్నారు. అందుచేత విజయదశమి నాడు అందరూ అమ్మవారిని నిష్టతో పూజించి.. శుభకార్యానికి శ్రీకారం చుట్టండి. మరి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..!
పూర్తీ వ్యాసము కోసం ఇక్కడ క్లిక్ చేయండి -> దసరా /విజయదసమి / నవరాత్రోత్సవము

No comments: