దసరాపండుగవిజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులుజరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచినవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటంఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులువనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకులపూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసిఅతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదేవిజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
పూర్తీ వ్యాసము కోసం ఇక్కడ క్లిక్ చేయండి -> దసరా /విజయదసమి / నవరాత్రోత్సవము
Showing posts with label dasara. Show all posts
Showing posts with label dasara. Show all posts
Saturday, October 10, 2009
దసరా, dasara
దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈపండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతిమూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలనుఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులునవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒకఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజుప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
ఈ దసరా పండుగ ఎప్పటినుండి ప్రారంభవయినదో ఖచ్చితముగా చెప్పలేము . ఋషులు , మునులు వారి వారి ఊహాగానకు అందుబాటులో ఉన్న రీతిలో ఒక్కక్కరు ఒక్కోరీతిలో చెప్తూవస్తూఉన్నారు . ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ..ప్రతి రోజూ ఒక కొత్తదనం.. అలాంటి మన పండుగలలో దసరా ఒకటి.. మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో శరన్నవరాత్రులు విభిన్న రీతుల్లో జరుగుతాయి. చివరి రోజైన దసరా మరింత సంబరంగా జరుగుతుంది.. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత.. అలాంటి కొన్ని ప్రత్యేకతలను మనం తెలుసుకుందాం..
1.ఆంధ్రప్రదేశ్‌లో...
పచ్చనిపైర్లకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్.. మూడు సంస్కృతులను మిలితం చేసుకుని ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారిక్కడ.. ఆశ్వీయుజ శుక్లపాడ్యమితో మొదలైన ఈ ఉత్సవం దశమినాడు వ్రతోద్యాపనతో ముగుస్తుంది.. తొమ్మిది రోజులపాటు జాతరలు, ఉపవాసాలు జరుగుతాయి.. దుర్గమ్మను ప్రతిరోజూ ఓ అలంకారంతో అర్చిస్తారిక్కడ.. మరో విశేషం ఏమిటంటే రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతంలో దుర్గమ్మను 'బతుకమ్మ'గా ఆరాధిస్తారు.. బతుకమ్మ పండగ మన రాష్ట్రంలో తప్ప దేశంలోని మరే ప్రాంతంలోనూ కానరాదు.. ఇది మనకో విశిష్టత..
2 తమిళనాడులో
'భరతనాట్యం'కి పుట్టిల్లు తమిళనాడు. అంతేకాదు శక్తిపీఠమై వెలసింది కామాక్షి ఇక్కడ. తమిళనాడు నవరాత్రులలోని తొమ్మిది రోజులు ప్రతి ఇంటా బొమ్మలకొలువులు దర్శనమిస్తాయి. సర్వాంగ సుందరంగా రంగవల్లులతో తీర్చిదిద్ది బొమ్మల కొలువును పెడతారు. దసరా రోజు గంగ నృత్యాలతో వీధులు కళకళలాడుతాయి.
3 కర్నాటకలో
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన చాముండేశ్వరీ. కర్నాటకలోని నేటి 'మైసూరు' నాటి 'మహిమ్మతి పురం' లో ఉంది. మైసూరు దసరా ఉత్సవాలు జగత్ప్రసిద్ధి గాంచినది. వీటిని 'వడయార్' రాజవంశీయులు నేటికీ ఘనంగా నిర్వహిస్తున్నారు. వీరు తమ కులదేవతయైన శ్రీచాముండేశ్వరీ దేవిని పూజించి అర్చిస్తారు. పండుగ నాటి తొమ్మిది రోజులు 'దర్బార్' నిర్వహించడం వీరి ప్రత్యేకత. దసరానాడు మల్ల-యుద్ధ ప్రదర్శన, అంచారి ఉత్సవం చూడడానికి రెండు కన్నులు చాలవు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం దసరాను తమ రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించుకుంది.
4 మహారాష్ట్రలో..
మహారాష్ట్రుల ఆరాధ్యదేవత 'తుల్జాభవాని' వీరు గణశ నవరాత్రుల లాగానే దేవీ నవరాత్రులను కూడా విశేషంగా నిర్వహిస్తారు. వీరు అంబాబాయిగా కీర్తించి పూజిస్తారు. 'గోంథళ్' పేరిట జరిపే జాగరణ ఎంతో చిత్రంగా ఉంటుంది. అమ్మముందు దివిటీ వెలిగించి ఆమెను భజిస్తారు. పూజ ముగిసేవరకు దివిటీ ఆరకుండా జాగ్రత్తపడతారు.
5 మధ్యప్రదేశ్‌లో..
మహాకాలుడు వేంచేసియున్న నగరి ఉజ్జయిని. ఇది భారతదేశములోని మధ్యభాగంలో ఉన్నది. ఇక్కడ ఉత్సవాలు దేవి పేరిట జరిగినప్పటికీ ఇది 'రామలీల' ఉత్సవంగానే ప్రసిద్ధి పొందింది. రాముడు రావణుని మీద విజయం సాధించినందుకు సంకేతంగా ఇచ్చటి వారు దసరా నిర్వహిస్తారు. పండుగ నాటి రాత్రి రావణ, కుంభకర్ణ, మేఘనాథ విగ్రహాలను బాణాసంచా అమర్చి కాలుస్తారు. అవి పేలిన తర్వాత రావణ పరిహరం రావణుడు విధించబడినందుకు ఆనందంతో ఒకరినొకరు అభినందించుకుంటారు.
6 గుజరాత్‌లో..
సుందర నృత్యాలకు ఆలవాలమైన గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రి నిర్వహిస్తారు. అంబేమాను ఒక కుండలో ప్రతిష్టించి ఆరాధిస్తారు. ఒక కుండను అందంగా అలంకరించి దానిలో జ్యోతిని వెలిగిస్తారు. అలా ఉన్న కుండను 'గర్బ' అని పిలుస్తారు. ఆ కుండను అమ్మ ప్రతిరూపంగా భావించి అర్చిస్తారు. దేవిముందు ఆడవారు ఒక వృత్తంగా ఏర్పడి 'గార్బా' నృత్యాన్ని ప్రదర్శిస్తారు. మేళతాళాల మధ్య జరిగే ఈ నృత్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వాయిద్యాల హోరు పెరిగే కొద్దీ నాట్యం జోరు పెరుగుతుంది. వీరు మాతను ఆశాపురా, దశాయా, ఖోఢియార్‌యాగా ఆరాధించి తరిస్తారు.
7 పంజాబ్‌లో..
ఔత్తరాహులైన పంజాబు వాసులు వైష్ణోదేవిగా, మాతారాణీగా కొలుస్తారు. ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసాలతో ఏడు రోజుల వరకు ఉంటారు. అష్టమి తిథినాడు తొమ్మండుగురు కన్యలను ఆహ్వానించి వారిని దేవి ప్రతిరూంగా భావించి పూజిస్తారు. వారికి పూరి, హల్వా మొదలగు భక్ష్యాలతో ఎర్రని చునరీ సమర్పించి వ్రతోద్యావపన చేస్తారు.
8 పశ్చిమబెంగాల్‌లో..
శక్త్యోపాసనలో పశ్చిమబెంగాల్ మొట్టమొదటి స్థానంలో ఉంది. బెంగాల్‌లో జరిగే పూజ విలక్షణమైనది. అమ్మ వారు వీరి ఇంటి ఆడపడుచు. శ్మశానవాసియైన శివుడు తన భార్య అయిన గిరిజను మూడు రోజుల కొరకు పంపిస్తాడని అలా దుర్గమ్మ తన బిడ్డలైన గణశ్, కార్తీకేయ, లక్ష్మీ, సరస్వతులతో వేంచేస్తుందని ప్రతీతి. వీరు దుర్గాపూజను మూడు రోజులుగా జరుపుకుంటారు. దేవిని ఆహ్వానించే వేళ 'ఆగమని గీతికల'ను ఆలపిస్తారు. ఆమెతో కష్టసుఖాలను పంచుకుంటారు. అష్టమి నవమి తిథుల మధ్య వేళ మహిషుని సంహరించిన దేవికి సంధి పూజ చేసి దశమి నాటి వేళ మళ్ళీ మెట్టినింటికి సాగనంపుతారు. పంపే వేళ వీడ్కోలుగా 'నిగమనీ గీతికలు' పాడతారు.
9 రాజస్థాన్‌లో..
రాజపుత్రుల జన్మస్థానమైన రాజస్థాన్ విజయ దశమి నాడు శక్తిదేవతయైన జగన్మాతను పూజీస్తారు. నేటి వేళ వీరులు తమ విజయం కొరకు తమ ఆయుధాలను అమ్మ వారికి సమర్పిస్తారు. విలక్షణలు ఎన్నైనా... ప్రత్యేకతలు ఎన్నున్నా... ఆరాధన ఒకటే... ఎలాగైతే అన్ని నదులూ చివరికి సముద్రంతో సంగమిస్తాయో అలాగే పూజావిధి యేదైనా ఆ జగదంబకే చెందుతుంది. నవహంగులతో నవరాత్రిని జరిపి ఆనందిద్దాం..

Thursday, October 8, 2009
నవరాత్రోత్సవము(దసరా), Navaratrotsavam (Dasara)

- దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈపండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతిమూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలనుఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులునవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒకఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజుప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
- దసరాపండుగవిజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులుజరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచినవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటంఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులువనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకులపూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసిఅతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదేవిజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
నవరాత్రి విశేషాలు :
పూర్వం దేనదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే "విజయదశమి"గా పేర్కొంటున్నారు. శ్రవణానక్షత్రంలోకలిసిన ఆశ్వీయుజ దశమికి విజయా సంకేతమున్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చినది.
ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణాలో ఈ పండుగ దినాలలో "బతుకమ్మ పండుగ"ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
అట్టి మహిమాన్వితమైన ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.
ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. "రామలీల ఉత్సవాలు". పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు.
అందుచేత విజయదశమినాడు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి శుచిగా తలస్నానము చేసుకోవాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.
ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే... "శ్రీ మాత్రే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
ఇకపోతే.. విజయదశమి నాడు శ్రీశైలం, దుర్గాదేవీ ఆలయాలను సందర్శించడం మంచిది. అలాగే ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామము, కోటికుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.
అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవిభక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
మరోవైపు విజయదశమి నాడు ముఖ్యంగా చేయాల్సింది.. "శమీపూజ". శమీవృక్షమంటే.. జమ్మిచెట్టు.. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు.
తిరిగి అజ్ఞాతవాసము పూర్తికాగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున "అపరాజితా" దేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు పేర్కొంటున్నాయి.
అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున ఈ "అపరాజితాదేవి"ని పూజించి రావణుని సంహరించి విజయం సాధించాడు. తెలంగాణలో శమీపూజ అనంతరం "పాలపిట్ట"ను చూసే ఆచారం కూడా ఉంది.
"శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శిని ||"
అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ.. పై శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మిచెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
అందుచేత.. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేందుకు, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందడానికి.. విజయదశమినాడు అమ్మవారిని ప్రార్థిద్ధాం..! అందరికీ దసరా శుభాకాంక్షలు..!.
----------------------------- ఇంకా కొన్ని విశేషాలు :
దేవీ నవరాత్రి పూజలు రామాయణ కాలంనాటికే జరుపుకోవడం ఆచారంగా ఉంది. దసరా అంటే ధన్-హరా అని, అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురిని పదితలలు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు.
ఇక నవరాత్రి వ్రతాన్ని తొమ్మిదిరోజులు దేవినవరాత్రి వ్రతంగా ఆచరించి విజయదశమి రోజున వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.
"ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కుష్మాండేతి చతుర్థికీ
పంచమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా."
మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే.. అలంకారాలు వేరైనా అమ్మ దయ అందరిపట్ల ఒక్కటే. అట్టి మహిమాన్వితమైన ఆ దేవదేవి ఆవిర్భావ విశేషమేమిటంటే..? పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభులతో పదివేల సంవత్సరాలు పోరాడినా, వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహాదేవి.. ఆ మధుకైటభులను మోసపూరితుల్ని చేస్తుంది.
దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందులకు శ్రీ మహావిష్ణవును మెచ్చుకుని నీకు ఏం వరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా కోరుకుంటాడు. దానితో వారు తమకు ఇక మరణము తప్పదని నిర్ణయించుకుని, తమను నీరులేనిచోట చంపమని కోరతారు. అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాళంతో సంహరించు సమయాన.. మహామాయ పదితలతో, పదికాళ్లతో, నల్లనిరూపుతో "మహాకాళి"గా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణవునకు సహాయపడుతుంది.
అనంతరం "సింహవాహినిగా" మహిషాసురుని, మహామాయ సరస్వతి రూపిణిగా, శుంభ, నిశుంభలను వధించింది. చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీ కృష్ణునికి సహాయపడింది.
తర్వాత ఐదో అవతారంసో ఒక రాక్షస సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడం వల్ల "రక్తదంతి" అయినది. లోకాలన్నింటిని కరువుకాటకముల నుంచి తప్పించి "శాకంబరి"గా పేరు సంపాదించింది. ఇలా దుర్గుడను రాక్షసుడిని సంహరించి "దుర్గ"గా, మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తోన్న అమ్మవారిని, పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్టతో పూజించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
అలాగే విజయదశమి నాడు విద్యాభ్యాసంతో పాటు ఏదేనీ శుభకార్యాలకు శ్రీకారం చుడితే విజయవంతమవుతాయని వారు చెబుతున్నారు. అందుచేత విజయదశమి నాడు అందరూ అమ్మవారిని నిష్టతో పూజించి.. శుభకార్యానికి శ్రీకారం చుట్టండి. మరి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..!
పూర్తీ వ్యాసము కోసం ఇక్కడ క్లిక్ చేయండి -> దసరా /విజయదసమి / నవరాత్రోత్సవము
Labels:
dasara,
Navaratrotsavam,
దసరా,
నవరాత్రోత్సవము
Subscribe to:
Posts (Atom)