Tuesday, August 4, 2009

దేవుడు, 2.God


హిందూ - క్రిస్టియన్ -ముస్లిం ---------- జైన్ మతము -----------గోల్డెన్ టెంపుల్ -------సిక్ మతము
  • ****************************************************************************************

పర్షియన్ మతము ----------------------------బుద్ధ (బౌద్ధ మతము)
  • **************************************************************************************

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...

దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలి వానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా వాన లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .
దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడ ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మనవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున .

  • దేవుని గురించి మరిన్ని విషయాలు కోసము ఇక్కడ క్లిక్ చేయండి ->దేవుడు
1 comment:

Nrahamthulla said...

దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు;పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ;డనాదిమధ్యలయుడెవ్వడు;సర్వము దానయైన వా
డెవ్వడువాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".[పోతన భాగవతం: గజేంద్ర మోక్షం]
వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం

* రాయైతేనేమిరా దేవుడు - హాయిగా ఉంటాడు జీవుడు - ఉన్నచోటే గోపురం ఉసురు లేని కాపురం - అన్నీఉన్న మహానుభావుడు-- వేటూరి
* మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు - ఆత్రేయ
* దేవుడికేం హాయిగ ఉన్నాడు-ఈ మానవుడే బాధలుపడుతున్నాడు - శ్రీశ్రీ
* పిల్లలూ దేవుడూ చల్లనివారే
* రాయిరా దేవుడు - తాగితే ఊగడు - మైలవరపు గోపి
* ఎంతో రసికుడు దేవుడు
* మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు - దాశరధి
వివిధ తెగల, మరియు జానపద నిర్వచనాలు
దేవుడు ఆడా?మగా?

* అల్లాహ్ లింగరహితుడు
* ఆదిశక్తి స్త్రీ.
* యెహోవా పురుషుడు
* ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు.అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.
* ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.
* "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే

ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళ లో ప్రజలు ఎప్పుడో పాడారు.