Sunday, September 20, 2009

ముక్కోటి ఏకాదశి, Mukkoti Ekadashi




  • ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.సుక్లాపక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమవాసి కి , పౌర్ణమికి ముందు ఏకాదశులోస్తుంటాయి . ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు .

  • * ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
    ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
    . వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులనువిశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:

1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)

  • వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి

పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు.

కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి
కుడి చేయి దక్షిణం; ఎడమ చేయి ఉత్తరం
ఎక్కడైనా (ఉత్తర - దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది.

దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు - అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా, వారి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారేముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచిఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

మరిన్ని వివరాలకొరకు ఇక్కడ క్లిక్ చేయండి > ముక్కోటి ఏకాదశి

No comments: