Showing posts with label Batukamma panduga. Show all posts
Showing posts with label Batukamma panduga. Show all posts

Friday, September 18, 2009

బతుకమ్మ పండుగ, Batukamma panduga




బతుకమ్మ పండుగ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

బతుకమ్మ పండుగ విశిష్టత

సెప్టంబరు, అక్టోబరు నెలలు తెలంగాణా ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంరంభాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మ పండుగతో సరిపోలవు.

పూర్తీ వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి > బతుకమ్మ పండుగ