Monday, October 5, 2009

కోజగారీ వ్రతము , Kojagari Vratamu




కోజగారి పూర్ణిమ శరదృతువు లో ఆశ్వీయుజ మాసము పౌర్ణమి నాడు పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్షీ దేవి ఆకాశమార్గములో తిరిగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యములు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. హిందువులు ముఖ్యముగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు.

వ్రతము చేయువిధానము

ఉదయాన్నే లేచి శుచి శుభ్రముగా స్నానము చేసి ఇంట్లో తూర్పుదిక్కున లక్ష్మీదేవి పూజా మంటపము ఏర్పాటు చేయాలి.లక్ష్మి ప్రతిమను కాని ,ఫొటోనికాని ఉంచి విఘ్నేశ్వర పూజచేసి లక్ష్మీదేవిని ఆస్వాదించాలి.ధూప,దీప నైవేద్యాలు పెట్టి భక్తిశ్రద్దలతో లక్ష్మి అష్ట్రోత్రాలు,శ్లోకాలు చదివి పూజచేయాలి.రోజంతా ఉపవాసముండాలి.రాత్రంతా జాగారం చేసి ... తకిస్తమైన "అక్షక్రీడను (గవ్వలు /పాచికలు) ఆటను ఆడుతూ .. అర్ద రాత్రి లక్ష్మీ దేవిని పూజించాలి .

వ్రతకద
విదానము :

వాలఖిల్య ఋషి ఈ వ్రాత ఉదంతాన్ని ఇతరులందరికీ తెలిపాడు.
ఉద్దాలకుడు పేద బ్రాహ్మణుడు . ఇతడికి " వలితుడు" అనే నమాతన్రం . బ్రహ్మచర్యాశ్రమం ముగిసింది . చండిక అనే కన్యను వివాహమాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు . ఆమెకు నగలు , ఆభరణాల మోజు ఎక్కువ . స్థోమత లేక పోయినా అగచాట్లుపడి ఆమె కోరికలు తీర్చుతుందేవాడు ... ఆమె కోరికలకు అంటు ఉండేది కాదు . మరీ మరీ కోరేది . అవి అతడి తలకు మించిన భారం అయ్యేవి . స్వర్నాభానాలు తేలేదని భర్తా చెప్పిన పనికి వ్యతిరేకం గా ప్రవర్తించేది .

ఆ భాద భరించలేని ఉద్దాలకుడు తన సమస్యను స్నేహితునికి విన్నవించుకున్నాడు . " నువ్వు ఆమె చేత చేయించుకోవాలనున్నా పనికి వ్యతిరేకం గా చెప్పు .. ఆ పని సక్రమము గా జరుగు తుంది " అని సలహా ఇచ్చాడు ... అలాగే ప్రవర్తిస్తున్నాడు కాని ఒక సారి అతడి తండ్రి అబ్దికం సమయం లో భార్య పరర్తించిన తీరు వలన శ్రమంతా వృధా అయిపొయింది . .. దాంతో అతడి మనసు విరిగి పోయింది . " దాన్ని తప్ప , భర్తను భర్తగా ప్రేమించ లేని ఈ భార్య ను విడిచి సంయసిస్తాను " అని సన్నద్ధుడయ్యాడు . అప్పుడు మిత్రుడు అడ్డుపడి " భార్య అనుమతి లేనిదే సన్యసించడం ధర్మ సమ్మతి కాదు " సంయమనం పాటించమని సలహా ఇచెను . అతడి మాటలతో సంయసించే ప్రయత్నాన్ని విరమిచాడు కాని ఇల్లు విడిచి అరణ్యమార్గం పట్టేడు . " లక్ష్మీ దేవి అనుగ్రహమైనా కలగాలి ... తన భార్య మన్కుతనంయానా వీడాలి ... అంతవరకు ఇంటికేల్లేది లేదని నిశ్చయించుకున్నాడు .

అరణ్య మార్గం లో తిరుగుతున్న అతడికి ముగ్గురు కన్యలు పిలిచారు . తామూ నాగ కన్యలమని పరిచయం చేసుకున్నారు . లక్శ్మీ పూజ చేశామని దానితో భాగం గా గవ్వలతో ఆడదలచమని చెప్పారు ... ఆటకు ఒకరు తక్కువయ్యారు .. ఆ లోటు తీర్చాలని అడిగేరు . అక్ష క్రీడా లక్ష్మీ దేవికి ఇస్తమైనదనీ అది ఆడడం వలల ఆమె అనుగ్రహం కలుగుతుందని చెప్పారు . .. ఒప్పించారు . అర్ధ రాత్రి దాటింది లక్ష్మీ నారాయణులు లోకచంచరానికి బయలు దేరారు . మేలుకొని పాచికలు ఆడుతున్న ఉద్దాలకుడి ని చూసి దర్శనమిచ్చేరు .. ఆ దంపతులను చూసి ఉద్దాలకుడు ప్రత్యక్షము గా వారికి పూజించాడు . అతడి సంగతులన్నీ
తెలిసిన ఆ జగదాదారులు అతడికి అఖండైశ్వర్యాలను ఇచ్చారని పురాణ కధ . లక్ష్మీ దేవి పాలకడలి లో పుటినది . పాచికలు గా ఉపయోగించే గవ్వలు , చంద్రుడు , ఆమె తోబుట్టువులు . ఈ వ్రతం వలన పాలకడలి లో తోబుట్టువులంతా ఒక చోట చేరినట్లవుతుంది .

ఈ రోజు ఆడ మగ తేడా లేకుండా అందరూ వేకువనే మేల్కోవాలి . కాలకృత్యాల అనంతరం పుజామందిరాన్ని అలంకరించి లక్ష్మీ దేవి ప్రతిమను ప్రతిస్తిమ్చాలి . పగలంతా ఉపవాసం చేయాలి .సాయంత్రం కొబ్బరినీరు మాత్రమే తాగి (పూజ అయ్యేవరకు) ఉండాలి . ఆ పూజ కు నివేదించడానికి పాలు , బియ్యం , పంచదార , కుంకుమ పువ్వు , సుగంధ ద్రవ్వ్యాలు కలిపిన పరమాన్నం వండి వెన్నెలలో ఉంచాలి . అర్ధరాత్రి వరకు జాగరణ ఉండి ఆ పాయసాన్నే దేవికి నివేదన చేసి , దాన్నే ప్రసాదం గా స్వీకరించాలి. ఆ తరువాత బందు మిత్రులంతా కలిసి పాచికలు ఆడాలి . . తెల్లవార్లు జాగరణ చేయాలి . ఇలా చేయడం వలన దేవి అనుగ్రహానికి పాత్రులవుతారని నమ్మకం .
ఆశ్వయుజమాసం సమకాలం ... గాలి , నిరు , వాతావరణం ప్రశాంతం గా ఉంటాయి . అనేక పుష్పాలు వికసించి పుప్పొడిని , పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి . ఇవన్నీ గాలి లో తేలుతూ వెన్నెల కిరణాలతో మమేకమవుతాయి . చంద్రకిరనాల్లోని ఆరోగ్య లక్ష్ననాలు ప్రక్రుతి లోని ఓషధ గుణాలు గాలి ద్వారా వచ్చినవీ అన్నీ ఆ పాయసం తో కలుస్తాయని , ఆవిధంగా ఆ ప్రసాదం లో ఆరోగ్యము ఇమిడి ఉంటుందని . . గవ్వలాట మానసిక ఉల్లాసాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకం .

ఇన్ని- శారీరక , మానసిక , సామాజిక ఆరోగ్య భావనలు ఇమిడి ఉన్నాయి కాబట్టే ... దేశం లో అన్ని ప్రాంతాలవారూ వేరు వేరు నామాల తో ఈ పూజను చేస్తారు .
ఒరిస్సా లో " లక్ష్మీ పూర్ణిమ " గాను ,
బెంగాల్ లో " సోనో పూర్ణిమ" గాను ,
మధ్యప్రదేశ్ లో " శరత్ పూర్ణిమ" గాను ,
చత్తిస్ గడ్ లో " శరత్ పూర్ణిమ " గాను ,
ఆంధ్రప్రదేశ్ లో " కోజగారి వ్రతం " గాను ,
ఇతర ప్రాంతాల్లో " ధన పూర్ణిమ" గాను , ................ చేస్తారు .
------------------------------------------ మూలము : వ్యాసము / అయ్యగారి శ్రీనివాసరావు ----- ఈనాడు .

No comments: