Thursday, October 8, 2009
మహాలయ పక్షము ,Mahalaya Pakshamu
మహాలయ పక్షము
భాద్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున కలదు.
పక్షము అనగా 15 రోజులకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
1. శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
2. కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
తిధి
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిధి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
పక్షంలోని తిథులు
1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
3. తదియ (అధి దేవత - గౌరి)
4. చవితి (అధి దేవత - వినాయకుడు)
5. పంచమి (అధి దేవత - సర్పము)
6. షష్టి (అధి దేవత - కుమార స్వామి)
7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
8. అష్టమి (అధి దేవత - శివుడు)
9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
10. దశమి (అధి దేవత - యముడు)
11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)
Labels:
Mahalaya Pakshamu,
మహాలయ పక్షము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment