Sunday, October 25, 2009

గుడ్‌ఫ్రైడే, Good friday





గుడ్ఫ్రైడే - చరిత్ర, ప్రాధాన్యత
క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య... ముళ్ళ కంచెల భారంతో... శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష పూనుతారు.

గుడ్‌ఫ్రైడ్‌ అనే పదం గ్సాడ్‌ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఈ పదం - పది లేదా 11వ శతాబ్దంలో ్థసిరపడినట్లు తెలుస్తోంది.
క్రైస్తవ గ్రంధాల ప్రకారం - ఏసుక్రీస్తు నజరత్‌ అనే పట్టణానికి చెందిన వ్యక్తి. ఈ పట్టణం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉంది. చాలామంది ఏసును దేవుని బిడ్డగా భావించేవారు... పూజించేవారు, కొలిచేవారు. అయితే యూదు ప్రవక్తలకు, ఉన్నతాధికారులకు మాత్రం ఇది కడుపుమంటగా ఉండేది. ప్రజల్ని ఏసు తప్పుదోవ పట్టిస్తున్నాడని వారు భావించేవారు. దాంతో వారు ఎలాగైనా ఏసును హతమార్చాలని కుతంత్రం పన్నారు. జుడాలని పిలవబడే 12 మంది శిష్యులతో వారు ఈ పథకాన్ని అమలు పరిచేందుకు ప్రయత్నించాడు. వారు ఏసుక్రీస్తును నిర్భధించారు. ఆ మర్నాడు ప్రవక్తల సంఘం ముందు హాజరుపరిచారు.

ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాడని, చక్రవర్తికి పన్నులు కట్టక్కర్లేదని ప్రజలకు చెబుతున్నాడని, తాను దేవుని ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడని... ఇలా వివిధ ఆరోపణల్ని ఏసుపై రుద్దారు. ఇవన్నీ నిజమని నిర్ధారించి రోమన్‌ చక్రవర్తి ముందు ఏసును హాజరు పరిచారు. అయితే చక్రవర్తి మాత్రం ఆ ఆరోపణల్ని నమ్మలేదు - అయినా మతప్రవక్తలు పట్టుబట్టి - నగరంలోని విధ్వంసకాండకు కూడా ఏసే కారణమని నమ్మబలికారు. చక్రవర్తిపై వారు మరింత ఒత్తిడి తీసుకురావడంతో ఇక చేసేది లేక చక్రవర్తి - ఏసును ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ఆ మతప్రవక్తలకు వదిలి వేశాడు. దీంతోవారు ఏసును శిలువ వేయాలని నిర్ధారించారు.

ఏసుక్రీస్తుకు తలపై ముళ్ళ కంప పెట్టారు. సైనికులు కొరడాలతో కొట్టారు. చెక్కతో చేసిన పెద్ద శిలువను ఆయన భుజాలపై మోపారు. కొంతదూరం నడిపించారు. చుట్టూ ప్రజలు... ఆయన వెనుక ఆయన అనుచరులు... ప్రజలు రాళ్ళతో కొట్టారు. చివరకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏసుక్రీస్తుకు శిలువ వేశారు. చేతుల్ని శిలువకు మేకులతో బంధించారు. రక్తం ఓడుతున్న ఏసుక్రీస్తు మూడుగంటల తర్వాత ప్రాణం వదిలాడు. ఆ రోజు శుక్రవారం... మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటలకు ఏసుక్రీస్తు శిలువపై తుది శ్వాస విడిచాడు. ఆ నాటి ఆ శిలువకు గుర్తుగా.. చర్చిల్లో శిలువను ఉంచే సంప్రదాయం నెలకొంది. మరణించే ముందు ఏసుక్రీస్తు దేవుణ్ణి ఇలా ప్రార్ధించాడు.

ప్రభూ నా మరణానికి కారణమైన వీళ్ళందరిని క్షమించు. వీరు పాపులే అయినా క్షమించి వదిలిపెట్టు ఎందుకంటే పాపం అని తెలీని అమాయకులు వారు. ఏసుక్రీస్తులోని దయాగుణం, క్షమం, ఔన్నత్యాలకు ఇది నిదర్శనం. అయితే ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే ఆదివారంనాడు ఏసుక్రీస్తు శిలువపై నుండి పునర్జన్మించాడు. అందుకే ఆ రోజు ఆనందసందోహాల ఈస్టర్‌ ఆదివారం జరుపుకుంటారు. గుడ్‌ఫ్రైడేనాడు జరుపుకునేవి అన్ని అంతకుముందు గురువారం రాత్రి ప్రారంభం అవుతాయి. చివరి సప్పర్‌ తీసుకున్న తరువాత - వారు ఈస్టర్‌ వరకు ఉపవాసం ఉంటారు. కైస్తవులకు ఆరాధనా స్థలం - ప్రశాంతతకు ప్రతిరూపంగా, అహ్లాదకర వాతావరణానికి ప్రతిబింబంగా నిలిచే చర్చి.

గుడ్ ఫ్రైడే రోజున ఏమేం చేస్తారు...!

గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే "ఈస్ట్ వెడ్నెస్‌డే" నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు.

ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.

ఆ తర్వాత మధ్యాహ్నంనుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారిచేతకూడా చదివిస్తారు.

ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు.

దీని తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు.

కొన్ని చోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేస్తారు. చివరికి కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు.

క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా ఈ రోజు చర్చిలలో గంటలు మ్రోగవు.


ఏసు అమర వాక్యాలు

జీసస్‌ను శిలువ చేసేందుకు గుల్గుతా అనే పేరుగల ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయనను శిలువకు వ్రేలడదీసారు. ఏసు యహూదీయులకు రాజు అని ఓ ఉత్తరంలో పేర్కొనబడింది. మిట్టమధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏసు తన ప్రాణాలను పరలోకానికి పంపేముందు ఏడు అమర వాక్యాలు పలికారు. వాటిని ఈ రోజు స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.

మొదటి వాక్కు : ఓ తండ్రీ వీరిని క్షమించు, ఎందుకంటే వీరి ఏం చేస్తున్నారో వీరికి తెలియదు.

రెండవ వాక్కు : ఈ రోజు నీవు నాతోబాటు స్వర్గలోకంలో ఉంటావని నేను నమ్ముతున్నాను. దేవుడా నేను నీతో నిజమే పలుకుతున్నాను.

మూడవ వాక్కు : ఓ నారీమణి, నీ పుత్రుడ్ని, నీ తల్లిని చూడు.

నాలుగవ వాక్సు : ఓ నా పరమేశ్వరుడా..! ఓ నా పరమేశ్వరుడా..! నీవు నన్ను ఎందుకు వదిలేసావు?

ఐదవ వాక్కు : నేను నీకోసం పరితపిస్తున్నాను.

ఆరవ వాక్కు : పూర్తయిపోయింది.

అందరికి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు తన పుత్రుడైన ఏసును ఏ కార్యక్రమంకోసం భూమిమీదకు అవతరింపజేసాడు. ఆ పని ఇప్పుడు పూర్తయ్యింది. చివరికి శైతానుకూడా ఆ పనులు పూర్తయ్యేందుకు అడ్డుపడలేకపోయాడు. శైతాను వలన కాలేదు. కాని జీసస్ తన ప్రాణాలను వదిలి చేయవలసిన పనులేవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసాడు. మనందరికి మంచి జీవితాన్ని ప్రసాదించి మనకంటూ కొన్ని లక్ష్యాలను రూపొందించాడు దేవుడైన ఏసు ప్రభువు. వాటిని పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తుండాలి.

ఏడవ వాక్కు : ఓ నా తండ్రీ ! నేను నా ఆత్మను నీ చేతులలో ఉంచుతున్నాను.

దేవుడు తనకు చెప్పిన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని ఏసు ప్రభువు ఈ ప్రపంచాన్ని వదిలి పరలోకానికి పయనమైన రోజు ఈ రోజు. ఆ రోజులలో అపరాధులకు కోరడాలతో శిక్షించేవారు. రెండవది బలిపీఠంపై వ్రేలాడదీసేవారు. ఏసు క్రీస్తు ఈ రెండు శిక్షలను అనుభవించి తన తండ్రి అయిన దేవునికి తన ఆత్మను సమర్పించి ప్రపంచంనుంచి కనుమరుగైనారు. అయినాకూడా ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ఓ నా తండ్రి ఇది ఆత్మీయతకు పరిచయ మార్గం.

శుభకరమైన శుక్రవారంనాడు పవిత్రమైన ఈ రోజున ప్రపంచశాంతి, ఉగ్రవాదం అంతమవ్వాలని కోరుకుంటూ ఇరుగు పొరుగు అందరూ సోదర భావంతో మెలగాలని, ఇతరులపట్ల ప్రేమానురాగాలను పంచాలనికోరుతూ ప్రార్థించండి. హలలూయా....హలలూయా...హలలూయా...!

No comments: