Saturday, February 27, 2010

క్రిష్టియన్ పండుగలు ,Christian Festivals


క్రైస్తవ మతము - Christian Religion


క్రైస్తవ మతము (Christianity) ప్రపంచంలోని అతి పెద్ద మతం. ఏసుక్రీస్తును ఏకకాలంలో దేవుని కుమారుడు గానూ, దేవుడు గానూ నమ్ముతూ ఏక దైవారాధన ను ప్రబోధించే మతం. నజరేయుడైన యేసు జీవితం అంటే ఆయన జననం, ప్రబోధం, శ్రమ, మరణం, పునరుత్థానాలగురించి పౌలు నిర్మించిన సిద్ద్ధాంతాలే క్రైస్తవ మత పునాదులు. బైబిలు లోని క్రొత్త నిబంధన లో యేసు జీవితం, బోధలతో పాటు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలు వివరించబడ్డాయి. యేసు దేవుని కుమారుడని, పాత నిబంధన లో ప్రవచింప బడిన మెస్సయ్యా అని క్రైస్తవులు నమ్ముతారు. 2001 వ సంవత్సరపు అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళు 210 కోట్ల మంది ఉన్నారు.

యేసు పునరుత్థానం చెందిన ఏభై రోజుల తర్వాత వచ్చిన పెంతెకోస్తు అనే పండుగ దినాన క్రైస్తవం ఒక సమాజంగా ఏర్పడిందని అపోస్తలుల కార్యాల గ్రంథం పేర్కొంటుంది. తొలుత యూదా మతం లో ఒక శాఖగా మొదలైన ఇది అనతికాలంలోనే ఒక ప్రత్యేక మతంగా ఆవిర్భవించింది. యూదుల మత గ్రంథమైన హెబ్రీ బైబిలు ను విశ్వసిస్తూ దాన్ని పాత నిబంధన గా క్రైస్తవులు పేర్కొంటారు. యూదా మరియు ఇస్లాం మతము లతో పాటు క్రైస్తవం కూడా అబ్రహాము సంబంధిత మతం గా పేర్కొన బడుతుంది. అంతియొకయలోని శిష్యులు మొట్ట మొదటి సారిగా క్రైస్తవులని పిలువ బడ్డారు.

క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు సిద్ధాంత పరంగా, ఆచారాల పరంగా వేరు వేరు 3652 సమూహాలుగా తమలో తాము విడిపోయారు. డినామినేషనులు అని పిలువబడే ఈ క్రైస్తవ మత శాఖలను వారనుసరిస్తున్న సంప్రదాయాల ననుసరించి రోమన్ కాథలిక్కులు 2. సనాతన తూర్పు సంఘం 3. ప్రొటెస్టెంట్ లు అనే మూడు ప్రధాన వర్గాలుగా విభజించ వచ్చు.

యూదులు, క్రైస్తవులు

క్రీస్తుయేసుకు 12 మంది శిష్యులు. అందరూ యూదులే. ఒక వ్యక్తి యూదుడు కావాలంటే యూదా మతంలోపుట్టాల్సిందే గానీ కొత్తవాళ్ళెవరూ చేరలేరు. "నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను" (లూకా 19:10) అని ఏసుచెప్పారు. యూదులు ఆయన్ని చంపారు. కానీ క్రైస్తవ మతం విశ్వమానవాళికి ఆయన్ని ప్రభువుగా చేసి ఆరాధిస్తోంది. ఈ మతంలో ఎవరయినా చేరవచ్చు. ఆయన మార్గము ప్రేమమార్గము. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ. క్రీస్తు శిష్యుడు తోమా 1 వ శతాబ్దం లో భారత దేశానికి క్రీస్తు సందేశాలను తెచ్చాడు. ఇది ప్రేమమార్గం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనేది మూల సూత్రం.

కొన్ని క్రిష్టియన్ పండుగలు ->

  1. క్రిస్టమస్ -- Christmas
  2. గుడ్ ఫ్రైడే -- Good Friday
  3. ఈస్టర్ సండే -- Easter సండే
  4. మేరిమాత ఉత్సవము -గుణదల కొండపై మాత ఆలయం


  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: