Thursday, June 13, 2013

Saint Kavi Bhagat Surdas ,సిక్కుల 14వ మత గురువు భగత్ సూరదాస్

  •  

  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Saint Kavi Bhagat Surdas ,సిక్కుల 14వ మత గురువు భగత్ సూరదాస్ -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

  
సిక్కు మత స్థాపకుడు గురునానక్ విరచిత గురు గ్రంథ్ సాహిబ్‌లో కొన్ని శబ్ధాలను అందించిన మహా భక్తుడు భగత్ సూరదాస్. భక్తి ఉద్యమంలో సూరదాస్ కీలకపాత్ర వహించారు. మెఘల్ చక్రవర్తుల్లో పరమత సహనం నిష్ఠగా పాటించిన అక్బర్ కాలానికి చెందినవారు సూరదాస్. సూరదాస్ 14వ శతాబ్దంలో జన్మించారు.

సూరదాస్ అంధత్వంతో పుట్టారు. ఆరేళ్ల వయస్సు నుంచే భక్తి మార్గాన్ని సూరదాసు అనుసరించారు. 18ఏళ్ల ప్రాయంలో ఆయన గురువు శ్రీ వల్లభాచార్యుల వారిని యమునా నది ఒడ్డున కలిశారు. ఆయన బోధించిన శుద్ధ అద్వైత విధానాన్ని సూరదాస్ ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన శ్రీమద్ భగవత్‌ గ్రంధాన్ని సమగ్రంగా సహచరుల సాయంతో విన్నారు.

సూరదాసు ఆ తర్వాత ద్వారాకాధీశుని పరమభక్తుడయ్యారు. సూరదాస్ బ్రహ్మచారి. సూరదాస్ ఎక్కువ కాలం నందనందనుడు శ్రీకృష్ణుడు జన్మస్థానమైన బృందావనంలో ఎక్కువ కాలం గడిపారు. ఈ సమయంలో ఆయన సూర్ సాగర్ (సంగీత సముద్రం) అనే గ్రంథాన్ని రచించారు. ఇందులో వేయి పద్యాలు ఉన్నాయి. సూర్ సాగర్‌లో ప్రస్తుతం 8వేల పద్యాల వరకే అందుబాటులో ఉన్నాయి. సూరదాస్ స్వతగానే బృందావనం ప్రాంతంలో మాట్లాడే వ్రజ భాషలో పండితుడు.

సూరదాసును సిక్కులు 14వ మతగురువుగా పిలుస్తారు. ఆయన రచించిన పాటలను సూరదాసు బాణిగా సిక్కులు నామకరణం చేశారు. ఆయన రచనలను తదుపరి కాలంలో సిక్కుల పవిత్ర మత గ్రంధమైన గురు గ్రంథ సాహెబ్‌లో జత చేశారు.
  • ======================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: