కబీరుదాసు భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాలవలె వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం కాశి. ఈయన క్రీ.శ.1399లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్నిఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమె పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు మరియు మూఢాచాఅరాలు విరివిగా వ్యాపించి యుండెడివి. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. కబీరు చదువుకొన్న విద్యాధికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్". కబీర్ శ్రీరాముని భక్తుడు కాడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ క్రీ.శ.1518లో మరణించాడు. అతని భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని, కాదు, హిందువని వారు పోట్లాడుకున్నారు. భౌతికకాయం మాయమై, దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయట. ఈ నిదర్శనం వల్ల వారికి భక్తకబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమయింది. ఇతడు 120 యేళ్ళ సుదీర్ఘ జీవితాన్ని చూశాడు.
కబీర్ సూక్తులు
మతాల పేరిట సామరస్యం చెడగొట్టుకోవటం అవివేకం
"రామ్ రహీమ్ ఏక్ హై"
భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు . నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు .
రాం రహీం ఒక్కరే అని చాటిన కబీర్
ఉత్తర భారతంలో మత విద్వేషాలు ఉన్న సమయంలో అందరినీ కుటుంబంలా కలిపి ఉంచటానికి రాం రహీం ఒక్కరే అని ఎలుగెత్తి చాటాడు కబీర్. మానవత్వానికి కబీర్ ప్రాధాన్యత ఇచ్చాడు. భక్తి ఉద్యమంలో ఉత్తర భారతం నుంచి తొలి తరం మత ప్రచారకుడు కబీర్‌దాస్. కబీరు అంటే అర్ధం గొప్ప. కబీరు పదం అరబిక్ భాష నుంచి వచ్చిందంటారు.
ఉత్తర ప్రదేశ్‌లో పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రమైన వారణాసిలో జన్మించాడు కబీర్. పుట్టుకతోనే అనాథ అయిన ఆయనను ముస్లిం దంపతులు పెంచారు. భారతీయ తత్వ శాస్త్రానికి కొత్త రూపురేఖలు ఇచ్చారు కబీర్. రామానంద స్వామిని ఒకసారి కలిసిన కబీర్ ఆయన చెప్పిన మాటలను జీవితంలో అమలుచేశాడు. ఆ సమయంలో హిందూ మత గురువుగా రామానంద స్వామికి మంచి పేరుంది.
రామానంద్ నుంచి జ్ఞానోదయం పొందిన కబీరు రామ తారక మంత్రమును పటించి శ్రీరామ భక్తుడయ్యాడు. కబీర్ ఎక్కడా తాను ఈ మతానికి చెందిన వాడినని స్పష్టం చేయలేదు. కబీరు సమయంలో ఉత్తరాదిలో హిందూ-ముస్లింల మధ్య మత ఘర్షణలు ఎక్కువగా చోటుచేసుకుంటుండేవి. దీనిని నియంత్రించటానికి కబీరు రాం రహీం ఒక్కరే అని ఎలుగెత్తి చాటారు. ఆ కాలంలో ఉన్నటువంటి మతాలు, తెగల దురాచారాలను కబీరు విమర్శించారు.
సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ను కబీరు కలిశాడని అంటారు. దీనితో ఆయన సిక్కు మత పవిత్ర గ్రంధమైన గురు గ్రంథ్ సాహెబ్‌లో దాదాపు 500 పద్యాలను అందించారు. సిక్కు భగత్‌లలో మూడవ వ్యక్తిగా కబీరును వారు పరిగణిస్తారు. కబీరు ప్రవచనాలను అనుసరించేవారిని కబీర్‌పంత్‌లుగా పిలుస్తారు. దాదు పంత్, దరియా పంత్‌లు కబీరు పంత్‌లలో ఒకరు. వీరు హిందూ-ముస్లింల తమ మధ్య ఉన్న విభేదాలను విడనాడాలని ప్రచారం చేశారు.
source : Telugu widipedia.org
- ===================
No comments:
Post a Comment