Thursday, June 13, 2013

Shri vallabhacharya , శ్రీ వల్లభాచార్య(తెలుగు వాడు)

  •  
  •  

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Shri vallabhacharya , శ్రీ వల్లభాచార్య(తెలుగు వాడు) - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --
 

శ్రీ పాద వల్లభాచార్యులూ-- భక్తి తత్త్వజ్ఞుడు. భారత దేశంలోని శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మతాన్ని స్థాపించాడు. ఇతడు వైష్ణవ మత ఆచార్యుడు. జన్మతః తెలుగు వైదికుల కులం లో పుట్టాడు. శుద్ధ అద్వైత వేదాంతాన్ని బోధించిన శ్రీ వల్లభాచార్య మన తెలుగువాడు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ సమీపంలోని చంపారణ్యలో శ్రీ వల్లభాచార్య 1479లో జన్మించారు. శ్రీ వల్లభాచార్యులు కుటుంబం వైదీక బ్రాహ్మణులు. ఆయన ముత్తాత యజ్ఞ నారాయణ భట్ట. శ్రీ వల్లభాచార్య ముత్తాత యజ్ఞ నారాయణ భట్ట వేయి సోమ యజ్ఞాలు నిర్వహిస్తే మీ వంశంలో జన్మిస్తానని శ్రీకృష్ణుడు ఆయనకు మాట ఇచ్చాడు. ఆయన వంశంలో వారైన లక్ష్మణ భట్ట వారణాసి వెళ్లి ఈ శత సోమయజ్ఞాన్ని పూర్తిచేశారు. అనంతరం శ్రీ వల్లభాచార్యుల వారు జన్మించారు.

శ్రీ వల్లభా చార్యుల వారు ఏడేళ్ల వయస్సులోనే చతుర్వేదాలను కంఠోపాఠంగా నేర్చుకున్నారు. అలాగే ఆది శంకర, రామానుజ, మధ్వ, నింబారకులు వారి రచనలను వల్లభాచార్య చదివారు. వీటితోపాటే అప్పట్లో ఉన్న జైన, బౌద్ధ మతాలను గురించి తెలుసుకున్నారు శ్రీ వల్లభాచార్య. అంత చిన్న వయస్సులోనే ఇన్ని విషయాలు తెలుసుకున్న శ్రీ వల్లభాచార్యునిని అందరూ బాల సరస్వతి అని ముద్దుగా పిలిచేవారు.

విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న సమయంలో వైష్ణవులకు ఆదరణ ఎక్కువగా ఉందని తెలుసుకుని శ్రీ వల్లభాచార్యుల వారు అక్కడికి వెళ్లారు. అక్కడ జరిగిన సదస్సులో వైష్ణవులు-శక్తిని పూజించేవారు పాల్గొన్నారు.

శ్రీ వల్లభాచార్యుల నేతృత్వంలో వైష్ణవులు ఈ సదస్సులో విజయం సాధించారు. దీనితో శ్రీకృష్ణదేవరాయలు వల్లభాచార్యుల వారికి కనకాభిషేకం చేయించారు. శ్రీవల్లభాచార్యుల వారు దేశవ్యాప్త పర్యటన చేసి వైష్ణవ మత వైశిష్ట్యం గురించి ప్రచారం చేశారు. బ్రహ్మసూత్ర, భగవద్గీత, ఉపనిషత్తుల గురించి శ్రీవల్లభాచార్యులు తన వ్యాఖ్యలు రాశారు.  Time period of Sripada Vallabhacharya . . (1479-1531)
  • =======================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: