Thursday, June 13, 2013

Ramananda(SriRama devotee), రామానంద(శ్రీరామ భక్తుడు )  •  

  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Ramananda(SriRama devotee), రామానంద(శ్రీరామ భక్తుడు )- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --


  
శ్రీరామ పరమభక్తుడు రామానంద. అందరినీ వైష్ణవ మతంలోకి తీసుకుని శిష్యులుగా మార్చిన ఘనత రామానందుల వారిది. భక్తి ఉద్యమంలో ఉత్తరాది నుంచి కీలకపాత్ర పోషించిన వారిలో రామానందులు వారు ఒకరు. దక్షిణాది చెందిన కుటుంబంలో రామానందులు వారు 14వ శతాబ్దంలో అలహాబాద్‌లో జన్మించారు.

రామానందుల వారు చిన్న వయస్సు నుంచే తాళపత్రా గ్రంధాలను కంఠోపాఠంగా చదివారు. శ్రీ వైష్ణవ మతంలో ముఖ్య గురువైన రాఘవానందుల వారి శిష్యుల్లో ఒకరు రామానందులు. రామానందులు వారు దక్షిణాది పర్యటనకు ఒకసారి వెళ్లివచ్చిన తర్వాత సన్యాసం పుచ్చుకుంటానని ఇంట్లో అనగా ఆయన సోదరుడు దానిని వ్యతిరేకించాడు.

రామానందుల వారి ఉద్దేశ్యంలో అఖిలాండ కోటికి రక్షకుడు సాకేత రాముడు ఒక్కడేని అని భావించారు. నాటినుంచి శ్రీరామ భక్తుడయ్యారు రామానందుల వారు. దేశంలో పలుప్రాంతాలు సందర్శించి రామానందుల వారు అనేక ప్రవచనాలు చేశారు. సిక్కుల పవిత్ర గ్రంధమైన గురు గ్రంధ్ సాహెబ్‌లో ఆయన రచించిన ఒక పద్యానికి వారు అందులో పదిలపరిచారు. సమాజంలోని అనేక దురాచారాలకు రామానందుల వారు ఎండగట్టారు.

రామానందుల వారి ప్రముఖ శిష్యుల్లో కబీరు ఒకరు. ఇతర శిష్యుల్లో అనంతానంద, భావానంద, ధాన్న భగత్, నాభ, పిప, రవిదాసు, సుఖానంద, తులసీదాసుల వారు ఉన్నారు. ఉత్తరాది మొత్తం ముస్లింల పరిపాలన సాగుతున్న సమయమది. హిందువులను కులాలు, వర్గాలు వారీగా విభజించి పాలించారు ముస్లిం పాలకులు. వారి చర్యలను రామానందుల వారు సున్నితంగా వ్యతిరేకించారు.

Courtesy with : Pavan Kumar@webdunia.com
  • ==================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: