Wednesday, December 26, 2012

Ten importent Churches in India-దేశంలోని పది ప్రముఖ చర్చిలు

  •  






అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -- పది ప్రముఖ చర్చిలు-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --



భారతదేశంలో సుమారు రెండువేల సంవత్సరాల నుంచి క్రైస్తవమతం వ్యాప్తిలో ఉంది. క్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్‌ థామస్‌ ఒకటో శతాబ్దంలోనే భారత్‌కు వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేశారు. అనంతరం దేశం పశ్చిమతీరంలో ముఖ్యంగా కేరళ, గోవాల్లో క్రైస్తవాన్ని అనేకమంది స్వీకరించారు. 15, 16 శతాబ్దాల్లో ఐరోపానుంచి క్రైస్తవ మిషనరీల రాకతో క్రైస్తవమతం దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, గోవా, తమిళనాడు, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరం... తదితర రాష్ట్రాల్లో క్రైస్తవ మతస్తులు అధికసంఖ్యలో ఉన్నారు.

క్రైస్తవంలో క్యాథలిక్‌, ప్రొటెస్టెంట్‌ అని ప్రధానంగా రెండు శాఖలున్నాయి. క్రమేణా క్రైస్తవం ఆచరించే ప్రజల సంఖ్య పెరగడంతో వారి ప్రార్థనల కోసం దేశంలోని వివిధప్రాంతాల్లో క్రైస్తవులు చర్చిలను నిర్మించారు. వాస్తుపరంగానే కాకుండా అద్భుతమైన కళారీతులతో పాటు స్థానిక నిర్మాణ సంప్రదాయపద్దతులను ఈ చర్చిల నిర్మాణంలో వినియోగించడం విశేషం.

ప్రముఖ చర్చిలు-శాంతి మందిరం... ప్రశాంతతకు నిలయం

1. మెదక్‌ కెథడ్రల్‌చర్చి...
వాటికన్‌ తరువాత ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి ఇది. కల్లోల జగతికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడి మందిరమే కాదు... ప్రశాంతతకు నిలయమైన మహాదేవాలయం. యూరప్‌ గోతిక్‌ శైలిలో రూపుదిద్దుకొన్న ఈ ఆలయం ఓ కళాఖండం. ఆపై ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న పర్యాటక కేంద్రం. దేశ, విదేశీ పర్యాటకులు ఈ చర్చి సందర్శనకు రావడం దీని ప్రాధాన్యత, ప్రత్యేకతలకు నిదర్శనం.

2. బాసిలికా చర్చి
క్రీ.శ. 1695లో గోవా రాజధాని పనాజీలో బాసిలికా చర్చిని నిర్మించారు. మత ప్రబోధకుడు సెయింట్‌ జేవియర్‌ అవశేషాల్ని ఈ చర్చిలో భద్రపరిచారు.

3. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చర్చి
కేరళలోని కొచ్చి(కొచ్చిన్‌)లో ఉంది. 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. వాస్కోడగామా మరణించిన అనంతరం అతని దేహాన్ని ఇక్కడ కొంతకాలం భద్రపరిచి అనంతరం పోర్చుగల్‌కు తరలించారు.

4. వల్లర్‌పదం చర్చి
దేశంలోని ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో వల్లర్‌పదం చర్చి ఒకటి. మేరీమాత ఇక్కడ కొలువై వున్నారు. ఇది కూడా కొచ్చిలోనే వుంది.

5. సెయింట్‌ థామస్‌ బాసిలికా- చెన్నై
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వున్న సెయింట్‌ థామస్‌ బాసిలికా చర్చిని 2006లో జాతీయ ప్రార్ధనామందిరంగా గుర్తించారు.

6. మార్‌ థోమ చర్చి- మలబార్‌
రోమ్‌లోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా నమూనాలో ఈ చర్చిని నిర్మించారు. సెయింట్‌ థామస్‌ నిర్మించిన ఏడు చర్చిల్లో ఇదొకటి. కేరళలోని మలబార్‌ ప్రాంతంలో ఈ చర్చి వుంది.

7. సెయింట్‌ ఆండ్రూస్‌ చర్చి
ముంబయి మహానగరంలోని ప్రాచీనమైన చర్చిల్లో ఇదొకటి. బాంద్రా ప్రాంతంలో దీన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు. పోర్చుగీసు వారి హయాంలో దీని నిర్మాణం ప్రారంభమైంది.

8. సెయింట్‌ పాల్స్‌ కాథెడ్రల్‌
కోల్‌కతా నగరంలోని ప్రముఖమైన యూరోపియన్‌ కట్టడాల్లో ఒకటి. గోథిక్‌ వాస్తు రీతిలో దీన్ని నిర్మించారు.

9. వైస్రాయ్‌ చర్చి
వైస్రాయ్‌ చర్చి దేశరాజధాని నగరంలో ఉంది. అప్పట్లో బ్రిటిషు పాలకులు ఎక్కువగా ఈ చర్చిలోనే ప్రార్థనలు చేస్తుండటంతో వైస్రాయ్‌ చర్చి అనే పేరు వచ్చింది. పార్లమెంటుకు రాష్ట్రపతి భవన్‌కు సమీపంలో ఉంది.

10. వేలాంకణి చర్చి (నాగపట్టణం)
తమిళనాడులోని నాగపట్టణానికి 12 కి.మీ.దూరంలో వుంది. నిత్యం వేలాదిమంది క్రైస్తవులు దేశం నలుమూలల నుంచి మేరీమాత దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి విచ్చేస్తుంటారు.
  • ========================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: