శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (Sri Guru Raghavendra Swamy-1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైనగురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్నిఅవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు(పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
- జీవిత చరిత్ర :
తంజావురు రాజు రాఘునాధ్ నాయకుడి ఆధ్వర్యంలో 1623 పాల్గుణ శుద్ద విదియనాడు మద్వపీఠ సంప్రదాయ ప్రకారం సన్యాస ఆశ్రమం స్వీకరించారు. గురుప్రణవ మంత్రం భోదించి శ్రీ సుదీంద్ర తిర్తులవారు ఆయనకు 1621 ధుర్మతినామ సంవత్సరంలో శ్రీ రాఘవేంద్ర యోగి దీక్షా నామాన్ని ఇచ్చారు. నాటి నుండి వెంకటనాధుడు శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారారు. ఆ తరువాత మఠ సంప్రదాయల ప్రకారం ఉత్తరదేశ యాత్రకు వెళ్ళి ఎన్నో మహిమలను చూపారు. పలువురిని పాపవిముక్తులను చేశారు. కొన్నేళ్ళ తరువాత శ్రీ రాఘవేంద్రులు పవిత్ర తుంగభద్ర నది తీరాన కీ.శ.1671 విరోధినామ సంవత్సరం శ్రావణ బహుళవిధియ గురువారం సూర్యోదయంకు ముందు మూల రాముణ్ణ ఆద్భుత గాణంతో పూజించి మంత్రాలయం బృందవనంలో సజీవ సమాది అయ్యారు. ఆ గానానికి ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహాలు సైతం నాట్య చేశాయి. అప్పటి నుండి స్వామి బృందవనం నుండి అనేక మహిమలను చాటుతూ కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా ,కొరికలు తీర్చే గురు సార్వభౌముడిగా దేశవ్యాప్తంగా పేరుపోందారు.
భక్తిశ్రద్ధలతో స్వామి వారిని కొలుస్తే సకల సంపదలు ఫలిస్తాయని భక్తులు నమ్మకంతో ఎందరో కొలుస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందa.
- మంత్రాలయము,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారిపుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మంత్రాలయం అసలు పేరు 'మాంచాలే'. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి వసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.
రాఘవేంద్ర స్వామి జీవిత విశేషాలు : పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి అసలు పేరు వెంకటనాథుడు. ఆయన ఒక గృహస్తుడు. ఆయన భార్య పేరు సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణ. 'గురు సుధీంద్ర తీర్థ' వెంకటనాదుని గురువు. అత్యంత ప్రతిభావంతుడైన వెంకటనాధుని తన తదనంతరం పీఠం భాధ్యతలు స్వీకరించమని సుధీంద్ర తీర్ద ఆదేశించాడు. గురు స్దానాన్ని చేపట్టాలంటే గృహస్ద జీవితాన్ని వదులు కోవాలి. గృహస్ధు గా తన భాధ్యతలకు పూర్తి న్యాయం చెయ్యలేననే కారణంతో గురు ఆఙ్ఞను వెంకటనాధుడు వినయంగా తిరస్కరించారు. కానీ కాలక్రమంలో దైవ సంకల్పం వల్ల వెంకటనాధుడు సన్యాసాన్ని స్వీకరించి, పీఠం గురు స్దానాన్ని అలంకరించడం జరిగింది. అప్పడినుండి ఆయన గురు రాఘవేంద్రుడుగా ప్రసిద్దుడయ్యారు. ఆయన తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీ హరి మహాత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశాడు. శ్రీ హరి కృప వల్ల ఆయన నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. అలాంటి వాటిలో బాగా చెప్పుకోదగింది ఆదోని రాజు సిద్ది మసూద్ ఖాన్ గర్వాన్ని అణచడం. స్వామిని అవమానించాలనే ఉద్దేశ్యంతో సిద్ది మసూద్ ఖాన్ పంపిన మాంసం తో కూడిన తినుబండారాలను స్వామి పళ్ళు గా మార్చడంతో ఖాన్ రాఘవేంద్ర స్వామి శరణు వేడి వెంటనే ఒక అత్యంత సస్యశ్యామలమైన జాగీరుని స్వామికి సమర్పించాడు. స్వామి నవ్వుతూ జాగీరుని తిరస్కరించి తను తుంగభద్రా నదికి తల్లిగా భావించే మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించారు. ఆంధ్ర ప్రధేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున మంత్రాలయం ఉంది. మద్రాసు, ముంబై, బెంగుళూరు, హైదరాబాదు మొదలుకొని పలు ప్రాంతాలనుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యం ఉంది. మద్రాసు నుండి 595 కిలోమీటర్లు, ముంబై నుండి 690 కిలో మీటర్లు, హైదరాబాదునుండి 360 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయం ఉంది. ఇక్కడ యాత్రికులు బస చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ముంబై- మద్రాస్, డిల్లీ-బెంగుళూరు, హైదరాబాదు-తిరుపతి వెళ్ళే రైలు మార్గంలో మంత్రాలయం ఉంది. ఆ స్టేషన్ పేరు "మంత్రాలయం రోడ్డు". రైల్వే స్టేషన్ నుండి మంత్రాలయం 16కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడినుండి ప్రైవేటు జీపులు, ఆటోల లాంటి ప్రైవేటు వాహనాల సాయంతో మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6గంటలనుండి మద్యాహ్నం 2గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య దేవాలయాన్ని దర్శించవచ్చు. ఇటీవలి కాలంలో దేవాలయానికి లభించిన "బంగారు రథం" ప్రత్యేక ఆకర్షణ. వెండి, మామూలు రథాలు దేవాలయంలో ఉన్నా బంగారు రథం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కన్నుల పండువగా ఉంటుంది. దేశం లోని పలు ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. యూత్రికులను ఇంతగా ఆకర్షిస్తున్న ఈ దేవాలయం మూడువందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.
- మంత్రాలయంలోని ఇతర దర్శనీయ స్దలాలు--
శ్రీ గురు సార్వభౌమ విద్యా పీఠం: ఇది ఒక సంస్కృత విద్యా పీఠం. ఈ విద్యాపీఠం శ్రీ రాఘవేంద్ర బృందావనం వెనకవైపు ఉంది. ఇక్కడి గ్రంధాలయంలో సంస్కృత పలు రచనలు, ప్రాచీన కాలం మెదలుకొని ఆధునిక కాలం వరకు రచనలు లభ్యమౌతాయి.
మాంచాలమ్మ దేవాలయం: మంచాలమ్మ పార్వతి దేవి ఇక్కడ మాంచాలమ్మ గా కొలవబడుతుంది. రాఘవేంద్ర బృందావనానికి వెళ్ళకముందు మాంచాలమ్మ ను దర్శించుకోవడం ఆనవాయితీ.
శ్రీ వేంకటేశ్వర దేవాలయం : మంత్రాలయం క్యాంపస్ లో శ్రీ వేంకటేశ్వర దేవాలయం దర్శించుకోదగిన మరో స్ధలం. ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏమిటంటే గుడిలోని వేంకటేశ్వరస్వామి మూర్తిని స్వయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్టించడం.
శివలింగం: తుంగభద్రా నది మద్యలో నిర్మించిన మంటపం లోని పెద్ద శివలింగం కన్నుల పండువగా ఉంటుంది.
పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం: మంత్రాలయం నుండి 5కిలో మీటర్ల దూరంలో పంచముఖి ఆంజనేయ స్వామి కోవెల ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండటం. ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని ప్రతీతి.
అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానిని వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, నంజన్ గూడ్
ఈ మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా అంటారు. ఇక్కడ సాధారణంగా చూసే బృందావనమే కాక రాఘవేంద్ర స్వాముల విగ్రహం కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో రాఘవేంద్రులవారి విగ్రహం ఇది ఒక్కటే. మిగిలిన ప్రదేశాలలో ఆయనను బృందావనంగానే చూస్తారు. 1836 నుండి 1861 కాలంలో దీనిని శ్రీమదాచార్య పరంపరలో శ్రీ సుజనానేంద్ర తీర్ధరు స్ధాపించారు. పర్యాటకులు ఇక్కడి పంచ బ్రిందావనం కూడా చూడవచ్చు. దీనిలో అయిదుగురు రుషులు అంటే శ్రీ సుజనేంద్ర తీర్ధ, శ్రీ శుబోధేంద్ర తీర్ధ, శ్రీ సుప్రజనేంద్ర తీర్ధ, శ్రీ సుజనానేంద్ర తీర్ధ మరియు శ్రీ శుక్రుతీంద్ర దీర్ధల అవశేషాలుంటాయి.
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మీద దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న భక్తి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన మంత్రాలయా రాఘవేంద్ర పీఠానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించినట్లు మఠం అధికారి సుయమీంద్ర చార్ ఈ విషయం తెలిపారు. ఈ విరాళంతో సర్వజ్ఞ మందిరం వద్ద 125 కొత్త గదులు నిర్మిస్తారు. అందులో 25 ఏసీ గదులు ఉంటాయి. సంస్కృత విద్యాలయం మైదానంలో ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో రజనీకాంత్ రాఘవేంద్ర స్వామిగా కూడా నటించారు. దాన, ధర్మాలు చేయడంలో రజనీ మొదటి నుండి ముందుంటారు. తాజాగా ఏకంగా రూ.10 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడం కూడా సంచలనమే.
- ===========================
No comments:
Post a Comment