Sunday, December 16, 2012

12 Number and Human attachment,12 అంకెతో మనుజులకు ఉన్న అనుబంధం.






  •  
  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --12 అంకెతో మనుజులకు  ఉన్న అనుబంధం-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . . .

పన్నెండు.. పసందు-నేడు అరుదైన 12-12-12. చివరి అయిదు అంకెలు ఒకలా ఉండాలని కొందరు.. సీరియల్‌గా ఉండాలని మరికొందరు.. మరోలా కావాలని ఇంకొందరు సెల్‌ఫోన్‌ కంపెనీ కార్యాలయాల వద్ద హడావుడి పడుతుండడం చూస్తూనే ఉన్నాం..

ఎంతైనా ఫర్వాలేదు.. నాకా నెంబరు వచ్చేటట్లు చూడండని ఒకరు.. ఎలాగైనా నా నంబరులో ఏడు.. సున్నా లేకుండా చూడాలని ఇంకొకరు.. రోజూ ఆర్టీవో కార్యాలయం వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి..

నీ పుట్టిన తేదీ ఎంత??.. నీ హాల్‌టికెట్‌ నెంబరులోని అంకెల మొత్తం ఎంత?? అది సరిసంఖ్యా, బేసి సంఖ్యా?.. ఏ సంఖ్య అయితే ఏం జరుగుతుంది? ఓ సంఖ్యా శాస్త్రవేత్త అంచనాలూ... టీవీల్లో ప్రత్యేక షోలూ మనకు సుపరిచితమే...

ఇలా ఎక్కడ చూసినా నెంబర్ల గొడవే.. ఏ అంకె అయితే ఏముందిలే అనేవారూ ఉన్నారు... అలాంటి వారికి అస్సలు టేస్టు లేదని విమర్మించేవారికీ కొదవలేదు.

ఎవరి నమ్మకం ఎలా ఉన్నా.. అపుడపుడు అరుదైన సందర్భాలు వస్తుండడం కద్దు. 12-12-12... అంటే... 12వ తేదీ 12వ నెల 12వ సంవత్సరం (2012). అంటే వందేళ్లకోసారి వచ్చే సంబరం.  అత్యంత అరుదుగా వచ్చే కొన్ని తేదీలకు ప్రత్యేక విశిష్టతను ఆపాదించటం ఇటీవలకాలంలో సర్వసాధారణమైపోయింది. 12-12-12 తేదీ కూడా ఆ  కోవలోనిదే. ఈ సందర్భంగా 12 సంఖ్య విశిష్టతను చెప్పుకోవడంతోపాటు జ్యోతిష్య, సంఖ్యశాస్త్రపరంగా ఎదురయ్యే లాభనష్టాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

నిత్య జీవితంలో 12తో మనకు ఎంతో సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంగ్ల క్యాలండరుకు 12 నెలలు ఉంటే, భారతీయ ఖగోళ విజ్ఞాన శాస్త్రం ప్రకారం 12 రాశులు, 12 లగ్నాలకు హైందవులు ఇచ్చే ప్రాధాన్యం అంతా, ఇంతా కాదు.

శ్రీకాకుళం జిల్లాతో అనుబంధం

జీవరాశుల ప్రత్యక్ష దైవం.. ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన సూర్యనమస్కారాలు 12. ఆ సూర్య భగవానుడిని ప్రజలంతా ఆదిత్య, రవి, సూర్య.. ఇలా 12 పేర్లతో కొలవడం మరో ప్రత్యేకత. పవిత్రమైన భగవద్గీతలో 12వ స్కంధానికి అరుదైన గౌరవం ఉంది. భార్యభర్తల  అన్యోన్య దాంపత్యానికి, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు చెప్పుకుంటుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే.. ఎన్నో విశిష్టతల సమాహారం ఆ సంఖ్య.  అలాంటి సంఖ్య తేదీల్లో.. నెలల్లో.. ఏడాదిలో వచ్చిన అరుదైన సందర్భమే ఇది.

ఖగోళ.. ఆధ్యాత్మిక నేపథ్యం:

ద్వాదశ (12) రాశుల్లో సూర్యుడు సంచరించే మాసం సౌరమాసం. పన్నెండు మాసాలు ఒక ఏడాది. దీని ఆధారంగానే సౌరమానం ఏర్పడింది. ఈ రాశుల్లోనే సమస్త ప్రాణికోటి జనిస్తుంది. రాశులను ఆధారంగా చేసుకొని నక్షత్రాలు, వీటి ఆధారంగా పాదాలు. ద్వాదశ రాశులు, ద్వాదశ ఆదిత్యులు, ద్వాదశ  జ్యోతిర్లింగాలు, ద్వాదశ దేవతారూపులు, ద్వాదశ పుష్కర తీర్థాలు, ద్వాదశ మాసాలు గురించి వింటుంటాం.

ఆంగ్ల క్యాలండరుకు 12 నెలలు:

1.జనవరి, 2. ఫిబ్రవరి, 3. మార్చి, 4. ఏప్రిల్ , 5. మే, 6. జూన్‌, 7. జూలై, 8. ఆగస్ట్ , 9. సెప్టెంబర్ , 10. అక్టోబర్ , 11. నవంబర్ , 12. డిసెంబర్.

ద్వాదశ దేవతారూపులు :

1.కన్నతండ్రి, 2.పోషించిన వాడు, 3.విద్య చెప్పినవాడు, 4.మంత్రాన్ని ఉపదేశించినవాడు, 5.ఆపదలో రక్షించేవాడు, 6.దారిద్య్రాన్ని పోగొట్టేవాడు, 7.భయాన్ని పోగొట్టువాడు, 8.కన్యాదానం చేసిన వాడు, 9.జ్ఞానం ఉపదేశించినవాడు, 10.ఉపకారం చేసినవాడు, 11రాజు, 12భగవద్భక్తుడు.

ద్వాదశ పుష్కర తీర్థాలు :

1.గంగ, 2.నర్మద, 3.సరస్వతి, 4.యమున, 5.గౌతమి, 6.కృష్ణ, 7.కావేరి, 8.తామ్రపర్ణి, 9.సింధు, 10.తుంగభధ్ర, 11.తపతీ, 12.సరయూ నదుల పుష్కరాలు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు :

1.సోమనాథేశ్వరుడు, 2.శ్రీశైలమల్లికార్జునేశ్వరుడు, 3.శ్రీమహాకాళేశ్వరుడు, 4.శ్రీఓంకారేశ్వరుడు, 5.శ్రీవైద్యనాథేశ్వరుడు, 6.శ్రీభీమేశ్వరుడు, 7.శ్రీరామేశ్వరుడు, 8.శ్రీనాగనాథేశ్వరుడు, 9.శ్రీవిశ్వనాథేశ్వరుడు, 10.శ్రీత్రయంబకేశ్వరుడు, 11.శ్రీకేదారేశ్వరుడు, 12.శ్రీఘృష్ణేశ్వరుడు.

ద్వాదశ ఆదిత్యులు :

1.మిత్ర, 2.రవి, 3.సూర్య, 4.భాను, 5.ఖగ, 6.పూష్ణ, 7.హిరణ్యగర్భ, 8.మరీచి, 9.ఆదిత్య, 10.సవిత్రు, 11.ఆర్క, 12.భాస్కర.

ద్వాదశ రాశులు :

1.మేషం, 2.వృషభం, 3.మిథునం, 4.కర్కాటకం, 5.సింహం,6. కన్య, 7.తుల, 8.వృశ్చికం, 9.ధనుస్సు, 10.మకరం, 11.కుంభం, 12.మీనం.

ద్వాదశ మాసాలు :

1.చైత్రం, 2.వైశాఖం, 3.జ్యేష్ఠం, 4.ఆషాఢం, 5.శ్రావణం, 6.భాద్రపదం, 7.ఆశ్వయుజం, 8.కార్తీకం, 9.మార్గశిరం, 10.పుష్యం, 11.మాఘం, 12.ఫాల్గుణం.


  • ========================
 Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: