Friday, April 22, 2011

అనుసంధాన గంధం,Link between God and human



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలి వానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా వాన లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -అనుసంధాన గంధం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--



భక్తుడికి, భగవంతుడికి మధ్య అనుసంధానం అనేది అత్యంత ప్రధానమైనది. అనుసంధానంలేని సాధన వ్యతిరేక దిశల్లో పయనిస్తున్న రెండు మనసులవంటిది. అవి ఎన్నటికీ కలవవు. అలాగే ఎన్ని తీవ్ర సాధనలు చేసినా భగవంతునితో అనుసంధానం కుదరనప్పుడు అదంతా వృథా ప్రయాస అవుతుంది. చిరునామా లేని ఉత్తరంలా, గమ్యంలేని పయనంలా అగమ్య గోచరం అవుతుంది.

అనుసంధానం కలిగి ఉండటమంటే-'నేను నీ వాణ్ని. నీకోసమే ఉన్నవాణ్ణి. నీకై నన్ను నేను 'మీదు' కట్టుకున్న వాణ్ని. నా సాధన, నా శోధన, నా వేదన అన్నీ నీ కోసమే' అనే భక్తుని ఉద్దేశాన్ని, ఆవేశాన్ని, ఆర్తిని, హఠాన్ని భగవంతుని వరకూ చేర్చాలి. గర్భస్థ శిశువు తల్లిపేగుతో అనుసంధానమై ఉన్నట్లు సాధకుడు తన ఇష్టదైవంతో సదా కలిసివున్న భావనతో ఉండాలి. ఆ భావన ఆయనకూ కలిగించాలి. ఆయనను అనుసంధాన తంత్రిలోకి తెచ్చుకునే వీలుకై ప్రయత్నించాలి. మనకు, ఆయనకు మధ్య ఇరువురినీ కలిపే ఒక బంధనాన్ని, ఒక మాధ్యమాన్ని సృజించుకోవాలి. ఒక తంత్రిని బిగించుకోవాలి. ఏమిటా తంత్రి? ఎలాంటిదా మాధ్యమం? ఆయనతో మన మనసును అనుసంధించటమే. అంటే కలపటమే. సదా సంధించి ఉంచటమే. అందరూ, ముఖ్యంగా ప్రారంభ సాధకులు దైవంతో మనసును కలపటం అంత సులభమా? కాదు. నిజమే. అందుకే కొన్ని బాహ్య వస్తువుల సాయం తీసుకోవాలి. పసుపు, కుంకుమ, కుంకుమ పువ్వు, గంధం, గరిక లాంటివి భగవంతునితో అనుసంధానానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ బాహ్య వస్తు జాతాలకంటే మనసును అనుసంధానిస్తే అంతకుమించిన ఉత్తమ అనుసంధాన సాధనం మరోటి ఉండదు. ఇందుకోసం బాహ్యవస్తు సహకారం తీసుకున్నా కేవలం వాటిమీదే ఆధారపడకుండా మనసును పదేపదే ధ్యేయ వస్తువు మీద లగ్నం చేస్తూ సాధన చేయాలి.

మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలు అనుసంధానమై ఉంటారు. బిడ్డ ఎక్కడున్నా, ఎంతదూరాన ఉన్నా తల్లితో అనుసంధానమయ్యే ఉంటాడు. విడదీయలేని ఆ అనుసంధాన గ్రంధి బిడ్డకు జీవితాంతం పిచ్చుక కాలికి దారం కట్టినట్లు తల్లితో తీయని బంధాన్ని కలిగి, శ్రీరామ రక్షగా నిలిచి ఉంటుంది. అనుక్షణం ఇలాంటి ప్రియమైన, ఇంతకంటే బలీయమైన అనుసంధానాన్ని కలిగి ఉండాలి సాధకుడు భగవంతుడితో.

మనసును మరెక్కడో ఉంచి ఎంతగా బాహ్యవస్తు సాయం తీసుకున్నా సాధన, మనసు తలోదారిగా మారి ఎన్నడూ కలవని భిన్న ధ్రువాలైపోతాయి. అనుసంధానం అనే ప్రక్రియ గర్భస్థ శిశువుకు తల్లిలా అనుక్షణం రక్షణ కవచంలా ఉంటుంది. సాధనా ప్రక్రియ- నుంచి వైదొలగకుంటే, మార్గాయాసం లేకుండా గమ్యం చేరటం సాధ్యమవుతుంది. అమ్మ కళ్ళలోకి చూస్తూ స్తన్యం గ్రోలుతున్న బిడ్డలా- భక్తుడు భగవంతుని అనుసంధాన గంధాన్ని ఆహ్వానిస్తూ, ఆయనతో స్నేహ సౌరభాన్ని ఆస్వాదిస్తూ నిర్భయంగా, తృప్తిగా, ఆనందంగా జీవన ప్రస్థానం సాగిస్తాడు.

-- చక్కిలం విజయలక్ష్మి

==========================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: