దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడ ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మనవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -పుత్రగణపతి వ్రతం - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .
విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలో పుత్రగణపతి వ్రతం ఒకటి .భగవంతుడు కాల స్వరూపుడు. చైత్రంలోనే బ్రహ్మ సృష్టి ఆరంభించాడంటారు. చైత్రం నుంచి ఫాల్గుణం వరకు మన సంప్రదాయంలో పన్నెండు మాసాలు ఉన్నాయి. చివరిదైన ఫాల్గుణం ఎన్నో పండుగలకు పర్వాలకు నెలవు. ఫాల్గుణం విష్ణుప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది. ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. ఆరోజు కూడా గణపతిని పుత్రసంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.
గణపతి శబ్ద బ్రహ్మస్వరూపము . అంటే ఓంకారానికి ప్రతీక . మంత్రాలన్నింటికీ ముందు ఓంకారము ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభం లో గణేశపూజ విధిగా ఉంటుంది . గణేశుదు ఆది , అంతం లేని ఆనందమూర్తి , సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవత . ఓంకారనాదం ఉద్భవించి , ఆ నాదం క్రమక్రమం గా గజానరూపం గా వెలుగొందింది . గణపతిని ఓంకారస్వరూపునిగా " గణపత్యధర్వశీర్షం " కూడా పేర్కొన్నది . దేవతాగణాలకు ఆదిపురుషుడై , అధిపుడై ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాధుడని , గణేశుడని , గణపతి అని పేర్లు వచ్చాయి . ఆకృతిని బట్టి కొన్నిపేర్లు , ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానము గా ఈ దైవం గణాలకు నాయకుడు .
పుత్రగణపతీ వ్రతం పాల్గుణ శుద్ద (అమావాస్య తరువాత)చవితినాడు చేస్తారు . ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయ సమయాన గణపతికి , చంద్రునికి , చతుర్ధీదేవతకు ... చందన దూర్వాక్షతలతో అర్ఘ్యప్రధానము చేయాలి .ఇలా చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది . పుత్రగణపతి వ్రతం వినాయక చవితిపూజ తరహాగా చేస్తారు .
- ===========================================
No comments:
Post a Comment