Saturday, January 15, 2011

సంక్రాంతి పుణ్యకాలము , Sankranthi Precious Time


సంక్రాంతి పుణ్యకాలము అంటే ?
ప్రాచీనకాలములో శాస్త్ర అవగాహన అంతగాలేనికారణం గా సూర్యగ్రహాన్ని దేవునిగా బావించేవారు . సూర్యభవానుడు వేరు సూర్య గ్రహం వేరు .ఆది- అంతములేని ఈ విశ్వములో కోటానుకోట్ల గ్రహాలలో సూర్యగ్రహము భూమికి దగ్గరగా ఉన్న పెద్ద గ్రహాలలో ఒకటి . సూర్యభగవానుడు అదితి - కస్యపుమహామునుల బిడ్డలలో ఒకడు ... సూర్య్తతేజస్సు కలిగిన ఒక దేవతామూర్తి . సూర్యునిచుట్టూ భూమి .. భూమిచుట్టూ చంద్రుడు ఒక నిర్ధిస్ట కక్ష్యలో తిరిగే గమన్నాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని లెక్కించే కొలమానాన్ని అనేకులు అనేక రకాలుగా తయారుచేసి నిర్ణయించారు . అందులో ముఖ్యమైనవి హిందువులు పాటించేచి సూర్యగమన్నాన్ని బట్టి సూర్య మానము , చంద్రునిగమనాన్ని బట్టి చంచ్రమానము . ఈ రెండింటి ప్రకారమే ఈ సంక్రాంతి పుణ్యకాలము నిర్ణయిస్తారు ..

భూమిపై మారే వాతావరణ మార్పులు బట్టి , సూర్య కాంతి తీవ్రతను బట్టి , మన ప్రాచీన మునులు సంవత్సరకాలాన్ని సూర్యుడు గతి (మార్గము )మారే 12 రాశులుగా విభజించారు . దీనిప్రకారము సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు . ఇలా ప్రవేశించడాన్ని " సంక్రమణం " అంటారు . దానినే కొందరు సంక్రాంతి అంటారు .సూర్యుడు మకరరాశలలో ప్రవేశిస్తాడు .కావున ఈ సంకాంతిని " మకర సంక్రాంతి" అంటారు.

రాశులు : 12.

1.మేషము 2.వృషభము 3.మిధునము 4.కర్కాటకము 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము 9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము .

మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేకకు ఉత్తరదిశలొ ఉన్నట్లు కనిపించునప్పుడు --ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు -- దక్షిణాయణము అని పిలిచారు . (సంవస్తరాన్ని రెండు ఆయణములు గా విభజించారు) . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయణం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయణం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణము లో ప్రవేశించు గడియలనే పుణ్యకాలం అంటారు .మన జ్యోతిష్య్ శాస్త్రం ప్రకారము దక్షిణాయణం లో దేవతలు నిద్రించి ఉత్తరాయణమ్లో మేల్కొంటారని పురాణాలు తెలియజేయుచు్న్నాయి.ఉత్తరాయణం లో స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని , ఈ కాలలములో మరణించినవారికి వైంకుఠ ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ సూత్రాలు చెబుతున్నాయి . ఈ మకర సంక్రమణము పుష్య మాసం నుండి వస్తుంది. దక్షిణాయణము లో చనిపోయిన మన ఆత్మీయులు మనమిచ్చే తర్పణాలు మూలముగా ఉత్తరాయణ ప్రారంభం కాగానే తెరి్చియున్న ద్వారాలు గుండా వైకుంఠం చేరుకుంటారని (వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ) నమ్మకం . అందుకే పెద్దలకు పూజలు , కొత్తబట్టలు , నైవేద్యాలు పెడతారు ... పూజలు జరుపుతారు . అంతా నమ్మకమే. . . ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు .

చంద్రమానము ప్రకారము -- చంద్ర గ్రహము ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాదో ఆ నెలని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు .
తెలుగు నెలలు (తెలుగు మాసములు) :తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).


తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము


ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.


  • ===============================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: