Wednesday, December 28, 2011

తాంబూలంవల్ల ఉపయోగం ఏమిటి?, Benefits of Tambulam



  • image : courtesy with teluguone.com

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -తాంబూలంవల్ల ఉపయోగం ఏమిటి?- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--



ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.


ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం వుంది. వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు.


ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.


ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.



  • =================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం? , Why do Hindus do Pradakshina in Temples?

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం? - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgUqTvT_rsA-Jfd8pkacN5X2EY1z6IjGv53hAmaKMAAPZ4hAlQmw7aSUPil98xnfN-hJ_k-LDnr5qP1Ag0CHnPl5B2qhZBKObXrM-7J2t5_aBx6Ym4q583xTpJXUBH3ZByKGBqpdLDohBjz/s1600/Why+do+Hindus+do+Pradakshina+in+Temples+%25E0%25B0%2597%25E0%25B1%2581%25E0%25B0%25A1%25E0%25B0%25BF%25E0%25B0%25B2%25E0%25B1%258B+%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%25A6%25E0%25B0%2595%25E0%25B1%258D%25E0%25B0%25B7%25E0%25B0%25BF%25E0%25B0%25A3%25E0%25B0%25B2%25E0%25B1%2581+%25E0%25B0%258E%25E0%25B0%2582%25E0%25B0%25A6%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B1%2581+%25E0%25B0%259A%25E0%25B1%2587%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B0%25BE%25E0%25B0%2582.jpg

* image : courtesy with - http://teluguone.com/


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

-- గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ, ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు. ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది.

గుడిలో వుండే దేవుడికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు.

మనకి కనిపించే 'సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.

ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం 'చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

* ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి ?


దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే, అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి అనే సందేహం తలెత్తుతుంది. ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, కొందరు అయిదు లేదా పదకొండుసార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో వుండాలి. 3. 5. 11 ఇలా అన్నమాట! ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న.

ఏ దేవుడి గుడికి వెళితే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎవరకి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం! ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే. రోడ్డు మీద నడిచినా ఒకటే! అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే వుంటుంది.

  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

పూజ ఎందుకు చేయాలి?,What is the Purpose of Prayer?



  • image : courtesy with >http://teluguone.com/


అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --పూజ ఎందుకు చేయాలి?- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--




మన హిందువులకు ఉన్నంతమంది దేవుళ్ళు మరే మతం వాళ్ళకీ లేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణపతి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు - ఇలా ఎందరో దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వాయుదేవుడు, వరుణదేవుడు - ఇలా సృష్టి, స్థితి, లయలలో మనకు మేలు చేస్తున్న శక్తులు అన్నిటినీ అర్చిస్తున్నాం.



అంతెందుకు, ఇల్లు ఊడ్చే చీపురుకట్టను కూడా పరమ పవిత్రంగా భావిస్తాం. చీపురుకట్టను తొక్కితే పాపం వస్తుంది అని చెంపలు వేసుకోవడం మీరు గమనించే ఉంటారు. ఈ ఆచారం ఈనాటిది కాదు, వేదాల్లోనే ఉంది. ఈ లెక్కన మనకు వందమందో, వెయ్యిమందో కాదు, ఏకంగా ముక్కోటి దేవతలున్నారు.



ఇంతమంది దేవుళ్ళలో ఎవర్ని పూజించాలి, ఏ విధంగా పూజించాలి అంటే, ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన రూపాన్ని, నచ్చిన రీతిలో పూజిస్తారు. ఇంతకీ అసలు దేవుళ్ళకు రూపాలు ఉన్నాయా? తలమీద కొప్పు, మెడలో సర్పం ఉంటేనే శివుడా? విల్లు, బాణం ధరిస్తేనే రాముడా? - తరహాలో కొందరు ప్రశ్నలు సంధిస్తారు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించమని తర్కించేవాళ్ళు కూడా ఉన్నారు.



ఇలాంటి వాదాలకు సమాధానం చెప్పడం కుదరదు. మనం ఆలోచిస్తాం. ఊహలు చేస్తాం. కలలు కంటాం. వాటన్నిటికీ ఆధారాలు చూపమంటే కుదురుతుందా? మనసులో ఉండే ఆనందం లేదా ఆందోళన గురించి మాటల్లో చెప్పగలం కానీ పట్టి చూపమంటే వీలవుతుందా? కనుక దేవుడూ అంతే. ఉన్నాడని నమ్మినవాళ్ళకి నిదర్శనాలు కనిపిస్తాయి. నమ్మకం లేనివారిని బలవంతంగా ఒప్పించాల్సిన పని లేదు.



దేవుణ్ణి నమ్మేవాళ్ళలో కూడా రెండు రకాలు ఉన్నారు. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆయనకు రూపం ఇవ్వడమేంటి అనేవారు కొందరు. దేవుడికి ఆకారమిచ్చి, పూజలు చేసేవారు కొందరు. రూపం ఏదయితేనేం దేవుడి విగ్రహం ముందు కూర్చుంటే సుఖశాంతులు అనుభూతికి వస్తాయి. కాసేపు దేవాలయానికి వెళ్తే, మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలు, కలతలు మర్చిపోతాం. మనకు తెలీని ఒక అతీతమైన శక్తి కాపాడబోతున్నట్లు, అండగా ఉన్నట్లు అనిపించి ధైర్యంగా ఉంటుంది. కొండంత ఉపశమనం కలుగుతుంది.



ఈ అనంత విశ్వంలో అణువణువునా ఉన్న భగవంతునికి రూపం ఎందుకు అంటే, అది స్థిరత్వం కోసం. మనసును నిమగ్నం చేయడం కోసం. కొందరికి గణపతి ఆరాధ్యదైవం అయితే, మరికొందరికి హనుమంతుడు ఇష్టదైవం. ఎవరి నమ్మకం వారిది, ఎవరి పద్ధతి వారిది. ఏ ఆకృతీ లేకుండా, సృష్టిని నడిపిస్తున్న ఒక అతీత శక్తి ఉందని నమ్మి ప్రార్ధించేవారు చాలా తక్కువ. మనసులో ఏదో ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధించేవారే అధికశాతం. ఈ విధానము అన్ని మతాలనోనూ ఉన్నది . అన్నిప్రాంతాతలోనూ ఉన్నది .



రాముడు, కృష్ణుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి - ఈ దేవుళ్ళ రూపాలు మన పూజామందిరంలోనే కాదు, గుండె గుడిలోనూ ప్రతిష్టించుకున్నాం. ఆ రూపాన్ని అర్చిస్తున్నప్పుడు మనసు అక్కడ నిమగ్నమౌతుంది. ఆ కాసేపూ ఇతర ఆలోచనలు లేకుండా దేవునిమీద కేంద్రీకృతం అవుతుంది. అందుకే దేవుని సాకారంగా పూజిస్తాం.
  • ==========================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Thursday, December 22, 2011

దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?, Worshiping with Light How?



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--
  • దీపారాధన ఎప్పుడు? ఎవరికి? ఎలా?-సిద్దాంతి డా వి.జి.శర్మ

చాలామంది భక్తులు ఏ దైవారధనకు ఎన్ని వత్తుల దీపాన్ని వెలిగించాలి, ఏ వారం, ఏ సమయంలో దైవారధన చేయాలి అనే విషయాల్లో సందిగ్ధతతో సతమతమవుతుంటారు. వారికోసమే ఈ శీర్షిక... క్రింద చూపబడినట్లుగా దైవారధన చేసి భగవంతుని కృపను పొందండి.


వత్తులు--------వారము-------శుభగడియలు-------జరుపవలసిన పూజ----------పండుగ

ఏక వత్తి--------ఆదివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -రథసప్తమి, దీపావళి
ద్వి వత్తులు ---- సోమవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- శివపార్వతుల పూజ -శివరాత్రి
త్రి వత్తులు----- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు - దత్త పూజ -సుబ్రహ్మణ్య షష్ఠి
చతుష్ఠ వత్తులు- బుధవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం -గురుపౌర్ణమి
పంచ వత్తులు-- సోమవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం- దత్తజయంతి
షణ్ముఖ వత్తులు- మంగళవారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- సుబ్రహ్మణ్య పూజ- సుబ్రహ్మణ్య షష్ఠి
సప్త వత్తులు--- శనివారం- ఉ 6 గం నుండి 7 గం లోపు- లక్ష్మీ పూజ -దీపావళి
అష్ఠ వత్తులు--- ఆదివారం - ఉ 4.30 గం నుండి 6 గం లోపు- వినాయక పూజ - వినాయక చవితి
నవ వత్తులు-- శుక్రవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు - దుర్గాదేవి పూజ -నవరాత్రులు
దశ వత్తులు-- బుధవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు - రుద్రాభిషేకం -తొలి ఏకాదశి
ఏకాదశ వత్తులు- సోమవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు- రుద్రాభిషేకం -శివరాత్రి
ద్వాదశ వత్తులు- ఆదివారం - ఉ 6 గం నుండి 7 గం -లోపుసూర్య పూజ -రథసప్తమి
త్రయోదశ వత్తులు- మంగళవారం - ఉ 6 గం నుండి 7 గం లోపు-సుబ్రహ్మణ్య పూజ -సుబ్రహ్మణ్య షష్ఠి
చతుర్దశ వత్తులు- మంగళవారం -ఉ 6 గం నుండి 7 గం లోపు -ఆంజనేయ పూజ -హనుమజ్జయంతి




జన్మనక్షత్రం - వెలిగించాల్సిన వత్తులు


నక్షత్రం ----------వత్తులు
అశ్వని ---------నవ వత్తులు
భరణి --------- షణ్ముఖ వత్తులు
కృత్తిక-------- ఏక లేదా ద్వాదశ వత్తులు
రోహిణి------- ద్వి వత్తులు
మృగశిర----- త్రి వత్తులు
ఆరుద్ర------ అష్ఠమ వత్తులు
పునర్వసు-- పంచమ వత్తులు
పుష్యమి---- సప్తమ వత్తులు
ఆశ్లేష------ చతుర్‌ వత్తులు
మఖ------ నవ వత్తులు
పుబ్బ----- షణ్ముఖ వత్తులు
ఉత్తర ----- ఏక లేదా ద్వాదశ వత్తులు
హస్త------ ద్వి వత్తులు
చిత్త ------ త్రి వత్తులు
స్వాతి----- అష్ఠ వత్తులు
విశాఖ----- పంచ వత్తులు
అనూరాధ-- సప్త వత్తులు
జ్వేష్ఠ ------ చతుర్‌ వత్తులు
మూల----- నవ వత్తులు
పూర్వాషాఢ- షణ్ముఖ వత్తులు
ఉత్తరాషాఢ-- ఏక లేదా ద్వాదశ వత్తులు
శ్రవణం----- ద్వి వత్తులు
ధనిష్ఠ------ త్రి వత్తులు
శతభిషం --- అష్ఠ వత్తులు
పూర్వాభాద్ర- పంచ వత్తులు
ఉత్తరాభాద్ర-- సప్త వత్తులు
రేవతి------ చతుర్‌ వత్తులు



పై విధంగా జన్మనక్షత్ర రీత్యా దైవారాధన చేసినట్లయితే... సకల శుభాలు కలిగి సుఖ సౌఖ్యాలు పొందుతారు.

- సిద్దాంతి డా వి.జి.శర్మ,-సెల్‌: 9440944132

  • =============================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Tuesday, November 29, 2011

Mythological importance of bathing, ఆధ్యాత్మిక దృష్టిలో స్నానము .


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjCTntADVTCwj1PrYI80GNT4EEwWtU1Z1-RdoNfCSYaSPacOt8YSqcDf6xJF2gdm6CiZUIuSCF2M4LfPWjCLP8Swxx25XP7tUUzNB-ulB3EvFSkpcobKbdmdqGAj0JQyWabXQ0zKBC2dGU8/s1600/Bath+after+temple+visit.jpg


అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --స్నానము -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి అంటే ఇది పూర్తిగా చదవవలసినదే.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి 1.జలము మరియు 2.అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో నేను నేర్చుకున్నవీ, చదివి, విని తెలుసుకున్నవీ అన్నిటినీ క్రూడీకరించి ఇక్కడ రాస్తున్నాను.

అన్నట్టుగా స్నానాలని అయిదు విధములుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధములు. అవి

  • నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.
  • నైమిత్తిక స్నానం :
ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం.
ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.
  • కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.


స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు. అవి
ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు --
  • మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం".మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.
*
"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "

అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.

  • వారుణం : ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.

అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు (మీరు చదివినది నిజమే! నీరు లేకుండా కూడా స్నానం చేయచ్చు). ఇది అయిదు రకాలు

  • * ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. అదెక్కడి స్నానం అనుకుంటున్నారా? చెప్తాను వినండి కాదు రాస్తాను చదవండి. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.

"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"
  • పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.

  • * భౌమస్నానం : పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.

  • * వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.

  • * దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. అవకాశం వస్తే వదలకండి.

  • * మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.

ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||

  • అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.
ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||
ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||

  • ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.

  • అభ్యంగన స్నానం : ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట . ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం -

  • 1. వేడినీటి స్నానం --చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.

  • 2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు --చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.

  • 3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.

  • 4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మైండ్ చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.

ఇవే కాక
  • నేతితో స్నానం చేయుట వలన ఆయుర్దాయం పెరుగుతుంది;
  • పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుట వలన లక్ష్మీ వర్ధనము;
  • దర్భలతో చేయుట వలన సర్వ పాపాలు తొలగుతాయి;
  • సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి;
  • ఆమలక స్నానము అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్ర్యాలు తొలగుతాయి;
  • నువ్వులు మరియు తెల్ల ఆవాలతో చేసిన స్నానం అమంగళనివారకము; నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్యం .
  • వర్ధనము; మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం;
  • నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం;
  • బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతాయి అని రక రకాల స్నానముల వలన కలిగే ఫలితాలను గురించి శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణములో చెప్పబడింది.

  • సముద్ర స్నానము
మానవుడు సముద్రములో మునుగగనే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.
  • కార్తీక స్నానము
కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విస్మరించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

  • -------------------------------------------------------------------------------------------
మూలము : నవ రస(జ్ఞ) భరితం (http://navarasabharitham.blogspot.com/)
  • --------------------------------------------------------------------------------------------

  • ================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Thursday, November 10, 2011

ధన్వంతరి ,Dhanvanthri



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --ధన్వంతరి ,Dhanvanthri-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--



ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘‘ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, ఉద్యోగ ప్రాప్తిరస్తు’’ అంటారు. ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. సకల రోగాల విముక్తికై మనమంతా ధన్వంతరిని పూజించాలి. సాక్షాత్తూ విష్ణుమూర్తియే ధన్వంతరిగా పాలకడలి నుండి అమృతభాండం పట్టుకుని అవతరించిన రోజు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఈ రోజున ధన్వంతరి పూజ తప్పక చేయాలి.
వైద్యవిద్యకు అధిదేవుడు. సనాతన వైద్య శాస్తమ్రైన ఆయుర్వేదాన్ని వృత్తిగా గైకొన్నవారు ఈ రోజు ధన్వంతరీ పూజ చేస్తారు. యాగాలు చేస్తారు. వైద్యులు మాత్రమే ధన్వంతర యాగాన్ని, పూజలను చేస్తారని, మరెవ్వరూ చేయరు అనే భావన చాలామందిలో ఉంది. కాని ఈ ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. అందుకే ధన్వంతరి వ్రతాన్ని ఆనవాయితీగా లేనివారు కూడా ఆనాడు శ్రీమన్నారాయుణిడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి. ఆయుర్వేదానికి ప్రథమ గురువు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి మొదట ఆయుర్వేద శాస్త్రం ఉపదేశం పొందినాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాల నిస్తుందని చెప్తుంది ఆయుర్వేదం. కేరళ రాష్ట్రంలో త్రిశూరవద్ద ధన్వంతరి ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.
పురాణ కథనం ప్రకారం సురాసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. ధర్మాచరణతో మనుగడ సాగించేవారికి అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన సంపదను అందించడానికి విశ్వపాలకుడు, జగద్రక్షుడైన ఆ నారాయణుడు నడుం కట్టాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని పరమశివుడు మింగేసి గరళకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచె్తై్చశ్రవం పుట్టాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీ, కల్పవృక్షం ఉద్భవించింది. చిట్టచివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ ప్రశాంత సాకార పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలికి వచ్చాడు. అమృత కలశంలోనే సమస్త శారీరక, మానసిక, అజ్ఞానరోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన ధన్వంతరి నాలుగు భుజాలుతో ఉద్భవించాడు. దేవదానవులు అతనికి నమస్కరించారు.
వైభవంగల ధన్వంతరి (శ్రీమహావిష్ణువు) పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి. అమృతం పంచిన తర్వాత ఇంద్రుని ప్రార్థించి ధన్వంతరి దేవవైద్య పదవి స్వీకరించాడు. కాలక్రమంలో భూమిపై మనుష్యులు అనేక రోగాల పాలయ్యారు. ఇంద్రుని ప్రార్థన మేరకు ధన్వంతరి కాశీరాజైన దివ్‌దాసుగా అవతరించాడు. అప్పుడే ‘్ధన్వంతరి సంహిత’ పేరుతో ఆయుర్వేద మూల గ్రంథం అందించాడు. మనమందరం ఆరోగ్యవంతులుగా ఉండుటకు, కాలుష్య రహిత వాతావరణంలో జీవించుటకు ధన్వంతరి పూజలు చేసి, నాడు చెప్పిన ఆరోగ్య నియమాలను పాటిద్దాం.

For full details - ధన్వంత్రి తెలుగు వికిపిడియాలో
  • =============================
Visit My Website - > Dr.Seshagirirao ->-http://dr.seshagirirao.tripod.com

Friday, October 7, 2011

పెద్దల పండగ,Ancestors Pongal,పితృదేవతారాధన


అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -పెద్దల పండగ,పితృదేవతారాధన- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


కళ్లముందు కనిపించకపోవచ్చు. భౌతికంగా దూరమై ఉండవచ్చు. అంతమాత్రాన, దివంగతులతో మన బంధం తీరిపోదు. వారి కలల్నీ ఆశయాల్నీ నిజం చేయాల్సిన బాధ్యత మనదే. వారి జ్ఞాపకాలకు ట్రస్టీలమూ మనమే.

శతాధిక వృద్ధుడు. చేతులు వణుకుతున్నాయి. అయినా, సత్తువంతా కూడదీసుకుని గొయ్యి తవ్వుతున్నాడు. పొలంలో మామిడి మొక్క నాటుతున్నాడు. అటుగా వెళ్తున్న రాజుగారు చూశారు. 'ఆ...గొయ్యి తవ్వుకోవాల్సిన ముసలి, ఈ...గొయ్యి తవ్వుతున్నాడే!' అని నవ్వుకున్నారు. ఆటపట్టించాలన్న కోరిక కలిగిందేవో. 'ఎంత ఆశ! ఎంత ఆశ! బతుకు మీద మమకారం చావలేదా! ఈ మొక్క పెరిగి, పెద్దయి, పూలుపూసి, పిందెలేసి, కాయలు కాయాలంటే ఎన్నేళ్లు పడుతుందో! పండు తినేదాకా పండుటాకు రాలకుండా ఉంటుందా తాతా?' వెక్కిరింతగా మాట్లాడారు. తాత బోసినవ్వులు నవ్వాడు. 'ఈ ప్రయత్నం నాకోసం కాదు మహారాజా. నా కొడుకుల కోసం. నా మనవల కోసం. నా మునిమనవల కోసం. వాళ్లకు పుట్టబోయే బిడ్డల కోసం. నా వంశస్తులు ఈ చెట్టు కొమ్మకు వూయలలూగాలి. ఈ చెట్టు నీడలో సేదతీరాలి. ఈ చెట్టు కాయలతో పచ్చడి చేసుకోవాలి. ఈ చెట్టు పండ్లతో పండగ చేసుకోవాలి...' వందేళ్ల కలను, వెయ్యేళ్ల కలను ఆవిష్కరించాడు తాతయ్య. మహారాజు తన అజ్ఞానానికి బాధపడ్డాడు. పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాడు.
మనకూ తాతలున్నారు. ముత్తాతలున్నారు. కథలోని తాతయ్యలాగానే మనకోసం తపించే ఉంటారు. మన గురించి కలలుకనే ఉంటారు. మన కోసం త్యాగాలు చేసే ఉంటారు. మన మూలాలకు కారణమైన మూలవిరాట్టులను, మనకు జన్మనిచ్చినవారికి ప్రాణంపోసిన పుణ్యమూర్తులను, జన్యు సంపదనిచ్చిన మహాదాతలను...ఏ మేరకు గౌరవిస్తున్నాం? కనీసం, వాళ్ల పేర్లయినా గుర్తున్నాయా?
తండ్రిపేరు చెప్పండి?
ఠక్కున చెప్పేస్తాం.
తాత పేరు చెప్పండి?
కాస్త తడుముకుంటాం.
ముత్తాత పేరు?
కష్టం. చాలా కష్టం.
ఒక్క ఫొటో అయినా ఉందా?
ఆ పెద్దలే కట్టించిన లంకంత ఇంట్లో అణువణువూ గాలించినా, ఒక్క ఆనవాలూ దొరకదు. గౌరవం అంటే, బతికున్నన్నాళ్లూ ఇష్టంగానో అయిష్టంగానో భరించడం కాదు. చనిపోయాక కూడా గుర్తుంచుకోవడం. జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకోవడం. వారి ఆలోచనల్నీ కలల్నీ కోరికల్నీ నిజం చేయడం. ఏం చేసినా చేయకపోయినా, ఏడాదికి ఒక్కసారి ప్రేమగా తలుచుకోవడం. క్రైస్తవంలో 'ఆల్‌ సోల్స్‌డే' అని పిలవవచ్చు, హిందూధర్మంలో 'పితృపక్షం' అని వ్యవహరించవచ్చు. పేరేదైనా ప్రధాన ఉద్దేశం అదే. అసలు పితృదేవతలంటూ ఉన్నారా, దివ్యలోకాల నుంచి దిగొస్తారా, మనం పెట్టే ప్రసాదాలు భోంచేస్తారా, మనల్ని ఆశీర్వదిస్తారా...అన్నది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం. కానీ వందేళ్ల క్రితవో, యాభై ఏళ్లక్రితవో వాళ్లంతా జీవించి ఉన్నారన్నది నిజం. ఒక్కో ఇటుకా పేర్చి ఇల్లంటూ కట్టారన్నది నిజం. అది ఏడంతస్తుల మేడ కావచ్చు. పెంకుటిల్లూ కావచ్చు. కట్టిందేదో స్థోమతకు మించే కట్టుంటారు. కొడుకులూ కోడళ్లూ, మనవళ్లూ మనవరాళ్లూ, ఆ మనవళ్ల పిల్లలూ సుఖంగా సంతోషంగా ఆ ఇంట్లో జీవించాలని ఆకాంక్షించి ఉంటారు. ఆ ప్రేమను గుర్తుచేసుకోవడంలో తప్పేంలేదుగా!

కరవులూ వరదలూ అప్పులూ తిప్పలూ...ఎన్నొచ్చినా ధైర్యంగా తట్టుకున్నారు. ఒక ఎకరం అమ్ముకుంటే అప్పులు తీరిపోయేవేవో. ఇంకో ఎకరం లేదనుకుంటే బిడ్డల పెళ్లిళ్లు ఘనంగా జరిగిపోయేవేవో. అయినా అమ్మలేదు. అప్పుల్నీ అవమానాల్నీ భరించారు. కారణం...రేపటి తరాలకు అన్యాయం చేయకూడదన్న ముందస్తు ఆలోచన. తినో తినకో మనకంటూ ఆస్తులు మిగిల్చారు. అది అరఎకరం కావచ్చు. పాతిక ఎకరాలు కావచ్చు. ఆ మట్టిలో అపారమైన మమకారం దాగుంది. ఆ నేలలో పండిన ప్రతి గింజ మీదా పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలపడం నేరమేం కాదుగా!

అందరూ అంతస్తులు ఇవ్వకపోవచ్చు. ఆస్తులు పంచకపోవచ్చు. అయితేనేం, విలువలతో కూడిన చరిత్రను ఇచ్చారు. ఫలానావారి బిడ్డలం అనో, మనవళ్లం అనో, మనవరాళ్లం అనో సగర్వంగా చెప్పుకోడానికి సరిపడా గతాన్నిచ్చారు. ఆ వారసత్వాన్ని నెమరేసుకోవడం మన బాధ్యత. అది కూడా మొక్కుబడిగా కాదు, శ్రద్ధగా చేయాలి. శ్రాద్ధం అంటే అదే. హిందూ సంప్రదాయం ప్రకారం... మహాలయ పక్షంలో పితృదేవతలందరికీ శ్రాద్ధం పెడతారు. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు వచ్చే కృష్ణపక్షమే, పితృపక్షం. 'భాద్రపద మాసం, కృష్ణపక్ష పాడ్యమి నుంచి పదిహేను రోజుల పాటు పైలోకాల్లో ఉన్న పితృదేవతలకు ప్రత్యేక సెలవులు. భూలోకానికి వచ్చి వారసుల్ని ఆశీర్వదించి వెళ్తారు. ఆ అపురూప అతిథులకు, మనం చేసే సపర్యలే శ్రాద్ధకర్మలు' అని గరుడ పురాణం చెబుతోంది. ఆ సందర్భంగా తల్లివైపు మూడు తరాల కీర్తిశేషుల పేర్లూ తండ్రివైపు మూడుతరాల కీర్తిశేషుల పేర్లూ తలుచుకుంటారు. దివంగతులైన ఆత్మీయుల్నీ స్నేహితుల్నీ గుర్తుచేసుకుంటారు. వారి ప్రతినిధులుగా ఎంతోకొంతమందికి కడుపునిండా భోజనం పెడతారు. పుట్టినరోజున స్నేహితులకు పార్టీ ఇచ్చినట్టు, పెళ్లిరోజున బంధువులకు విందు ఇచ్చినట్టు, ప్రవోషన్‌ వచ్చినప్పుడు సహోద్యోగుల్ని రెస్టారెంట్‌కు తీసుకెళ్లినట్టు...మహాలయపక్షంలో ఏ లోకాల్లోనో ఉన్న పితృదేవతలకు నైవేద్యం పెడతారు. తర్పణాలు వదులుతారు. నిజానికి, దివంగతుల్ని గుర్తుచేసుకోడానికి శ్రాద్ధకర్మలే చేయాల్సిన పన్లేదు. చాలా మార్గాలున్నాయి. అనాథ ఆశ్రమంలో ఓ పూట అన్నదానం, పేద విద్యార్థులకు పుస్తకాలు, దిక్కులేనివారికి వెచ్చని రగ్గులు...స్థోమతను బట్టి, ఓపికనుబట్టి ఏ సత్కార్యమైనా చేయవచ్చు. ఆత్మీయులతో చిన్న సంస్మరణ సమావేశం నిర్వహించుకోవచ్చు. పెద్దలు చేసిన మంచిపనుల్ని తలుచుకోవచ్చు. ఏదీ కుదరకపోతే, ఇంట్లో ఉన్న ఫొటోలకు దండవేసి దండం పెట్టుకోవచ్చు. స్థూలంగా 'పితృపక్షం' అంతరార్థమిదే. ఆపని ఎప్పుడైనా చేయవచ్చని చెబితే, బద్ధకస్తుడైన మనిషి ఎప్పుడూ చేయడని మన పూర్వీకులకు బాగా తెలుసు. అందుకే ఏడాదిలో ఓ పదిహేను రోజుల్ని ప్రత్యేకంగా కేటాయించారు. మహాలయ అమావాస్యదాకా గడువు ఇచ్చారు.
--------


ఆశయాల్ని బతికించుకుందాం
ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి పుట్టుకతోనే రుణబంధాల్లో చిక్కుకుపోతాడు. ఆధ్యాత్మికత ద్వారా దేవరుణాన్ని, సేవ ద్వారా రుషి రుణాన్ని, దానధర్మాల ద్వారా మనుష్యరుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. పితృరుణాన్ని తీర్చుకోడానికి ఒకటే మార్గం...మంచి మనిషిగా పేరు తెచ్చుకోవడం, మంచిపనులతో పెద్దల పేరు నిలబెట్టడం, వారి ఆశయాల్ని నిజం చేయడం. వూళ్లో బడో గుడో కట్టాలన్న పెద్దల కల కలగానే మిగిలిపోయి ఉండవచ్చు. నలుగురు పేద పిల్లలకు చదువు చెప్పించాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయి ఉండవచ్చు. పాతింటిని లైబ్రరీగా మారిస్తే వూరికి ఉపయోగపడుతుందన్న ఆలోచన ఆలోచన స్థాయిలోనే ఆగిపోయి ఉండవచ్చు. గంపెడు సంతానం, నష్టాల వ్యవసాయం, అనారోగ్యాలు, అప్పులు...ఇలాంటి కారణాలేవో వారి ప్రయత్నాలకు అడ్డుతగిలి ఉండవచ్చు. తీరని కోరికలూ తీర్చాల్సిన బాధ్యతలూ జీవుడి పరలోక ప్రయాణంలో రాళ్లూరప్పలై బాధపెడతాయని చాలామంది విశ్వాసం.

వరాహపురాణంలో ఓ కథ ఉంది. శ్వేతమహారాజు అపర కుబేరుడు. అన్నదానం చేయమని వశిష్టమహర్షి అతనికి సలహా ఇస్తాడు. ఆ మాట విని రాజుకు కోపం వస్తుంది. 'వజ్రవైఢూర్యాలు దానం ఇవ్వగల సంపన్నుడినే! నన్ను పట్టుకుని కేవలం అన్నదానం చేయమంటాడేమిటి' అని విసుక్కుంటాడు. యజ్ఞయాగాలు నిర్వహించి... అపారమైన సంపదల్ని ప్రజలకు పంచుతాడు కానీ, ఒక్క మెతుకు కూడా విదిలించడు. మరణం తర్వాత, స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది. అన్నపానాలు మాత్రం దొరకవు. ఆకలితో అలమటించిపోతాడు. భూలోకంలోని వారసులు అన్నదానాలు చేసేదాకా తన శరీరాన్ని తానే భుజిస్తూ బతుకుతాడు.

హిందూధర్మంలో 'పితృదేవతలు' అన్న మాటకు చాలా విశాలమైన పరిధి ఉంది. దివంగతులైన ఆత్మీయులు ఎవరైనా పితృదేవతలే. అది ప్రాణస్నేహితుడు కావచ్చు, పాఠం చెప్పిన గురువు కావచ్చు, కష్టసమయంలో ఆదుకున్న సహచరుడూ కావచ్చు. మియాపూర్‌లో ఉంటున్న రిటైర్డ్‌ ఇంజినీర్‌ జోళదరాశి చంద్రశేఖరరెడ్డి కర్ణాటకలోని బళ్లారిలో చదువుకున్నారు. ఏడో తరగతిలో తెలుగు మాస్టారు కప్పగల్లు సంజీవమూర్తి పాఠాలు ఆయన మీద చెరగనిముద్ర వేశాయి. సాహిత్యాభిమానిగా మార్చాయి. ఆ ప్రభావంతో పద్య కవిత్వం రాశారు. దాదాపు యాభైఏళ్ల తర్వాత, సంజీవమూర్తి కుటుంబ సభ్యుల్ని కలుసుకునే అవకాశం వచ్చింది. అప్పుడే, తన గురువుగారి అముద్రిత రచనల గురించి తెలిసింది. జీర్ణస్థితిలో ఉన్న ఆ కాయితాల్ని అపురూపంగా అందుకున్నారు. వందలకొద్దీ పద్యాలు. ఒక్కోటి ఓ ఆణిముత్యమే. తానే పరిష్కరించారు. పండితుల ఆవోద ముద్ర కూడా వేయించుకున్నారు. పుస్తక ప్రచురణకు సంజీవమూర్తి కుటుంబసభ్యులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. 'సుమకరండం' కంపోజింగ్‌ నుంచి ఆవిష్కరణ దాకా...అన్ని బాధ్యతలూ చంద్రశేఖరరెడ్డి భుజానికేసుకున్నారు. 'తన పద్యాల్ని పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన మా గురువుగారికి లేదేవో. ఉన్నా బతకలేని బడిపంతులు జీతం, గంపెడు సంసారం...ఆర్థిక పరిస్థితులు అనుకూలించి ఉండకపోవచ్చు. భాష మీద మమకారం కలిగించిన మహానుభావుడి రుణం ఈ రూపంగా అయినా తీర్చుకున్నందుకు సంతోషంగా ఉంది' అంటారాయన.

పంజాబ్‌కు చెందిన పూరణ్‌సింగ్‌ మూడుపదుల వయసులో ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. జట్కాబండి తోలుతూ బతుకుబండి లాగించారు. కుటుంబ బాధ్యతల కారణంగా పెళ్లి కూడా చేసుకోలేదు. 1947లో అక్కడే మరణించారు. స్థానికులే దహన సంస్కారం జరిపారు. తన అస్థికల్ని గంగానదిలో కలపాలన్నది పూరణ్‌సింగ్‌ చివరి కోరిక. ఎవరు తీరుస్తారు? అరవై ఏళ్లపాటూ అవి ఆస్ట్రేలియాలోని ఓ శ్మశానవాటికలో మగ్గిపోయాయి. ఆయన కుటుంబ సభ్యుల్లో మూడోతరానికి చెందిన హర్మెల్‌కు ఆ విషయం తెలిసింది. ఈమధ్యే తీసుకొచ్చి గంగలో కలిపారు. 'పూరణ్‌సింగ్‌జీ పంపిన డబ్బుతో మా కుటుంబాలు బాగుపడ్డాయి. మా ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఆయన రుణం తీర్చుకోడానికి ఇదో గొప్ప అవకాశంగా భావించాను' అని చెబుతారు హర్మెల్‌.

విద్యారణ్య చురుకైన విద్యార్థి. సమాజానికి తన వంతు సేవ చేయాలన్న తపన ఉండేది. అమెరికాకు వెళ్లి పెద్దచదువులు చదువుకున్నాడు. అక్కడే మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థికంగా స్థిరపడటంతో, ఓ ట్రస్టు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. విధి నిర్ణయం మరోలా ఉంది. అతనికి క్యాన్సర్‌. ఎంతోకాలం బతకలేదు. ఆ యువకుడి ఆశయాల్ని నిజం చేయడానికి కుటుంబసభ్యులు 'విద్యారణ్య ట్రస్టు' స్థాపించారు. 'మేం చేసే ప్రతి మంచి పనికీ అన్నయ్య ఆశీస్సులు ఉంటాయన్నదే మా నమ్మకం' ఉద్వేగంగా చెబుతారు హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శంకర్‌.

మనం చేసే మంచిపనుల వల్ల దివంగతులైన ఆత్మీయులకు రౌరవాది నరకాలు తప్పుతాయో లేదో తెలియదు. కానీ, ఓ అనాథ ఆకలికూపం నుంచి బయటపడతాడు. స్వర్గలోక యాత్రలో ఆటంకాలు తొలగిపోతాయో లేదో తెలియదు. కానీ, ఓ నిరుపేద విద్యార్థి చదువు నిర్విఘ్నంగా సాగుతుంది. ఈ సత్యాన్ని, ఆస్తికులైనా నాస్తికులైనా అంగీకరించాల్సిందే. ఆ మంచిని, మనుషులైనా దేవతలైనా స్వాగతించాల్సిందే.

అనుకోని అతిథి...
కర్మలూ తర్పణాలూ సంస్మరణ కార్యక్రమాలూ దివంగతుల ఛాయాచిత్రాలూ అంతర్లీనంగా మనిషిలో మరణం అంటే ఉన్న భయాన్ని పోగొడతాయి. ఏదో ఒకరోజు మనమూ ఆ వరుసలో చేరాల్సినవాళ్లమే అన్న సత్యం బోధపడుతుంది. నిజానికి, జీవితం మీద మితిమీరిన మమకారం పనికిరాదు. భారతీయ తత్వశాస్త్రం ప్రభావంతో కవిత్వం రాసిన జోసెఫ్‌ బ్లాంకోవైట్‌ మరణాన్ని ఇలా వర్ణిస్తారో చోట... 'పగటిపూట సృష్టించబడిన ఆదిమ దంపతులు రాబోయే రాత్రి గురించి చాలా భయపడ్డారు. కానీ సూర్యుడు అస్తమిస్తూ చీకట్లు అలుముకునే సమయానికి, తారలహారం వేసుకుని రాతిరి కన్యక అద్భుతంగా దర్శనమిచ్చింది. ఈ అందాల్ని దూరం చేసి, పగలు మన కళ్లు కప్పింది సుమా' అని ఆశ్చర్యపోయారు. ముక్తాయింపుగా...'మనం మరణాన్ని మాత్రం ఎందుకు తిరస్కరించాలి? వెలుతురు వోసం చేసినట్టే, జీవితం కూడా వోసం చేయదని భరోసా ఏమిటి?' అని ప్రశ్నించుకున్నారు.
ఎంత గొప్ప ప్రశ్న!
ఎన్ని భ్రమల్ని దూరం చేసే ప్రశ్న!
మనం బాగా అభిమానించేవారి ఇంటికి వెళ్లినప్పుడు, అయిష్టంగా వీడ్కోలు తీసుకుంటాం. కొన్నిసార్లు కావాలనే చేతిగుడ్డో కళ్లజోడో అక్కడే వదిలేసి వస్తాం. ఆ సాకుతో అయినా మళ్లీ వెళ్లొచ్చన్న ఆశ. నలుపు-తెలుపు ఛాయాచిత్రాలూ, పాతకాలం ఇళ్లూ, చేతికర్రలూ, పందిరిమంచాలూ, పడక్కుర్చీలూ మన పితృదేవతలు వదిలేసి వెళ్లిన అలాంటి ఆనవాళ్లే.
పునరపి జననం.
పునరపి మరణం
ఏదో ఒకరోజున, మళ్లీ వస్తారేవో?
నివాళి ఘటిస్తూ..
పేరు మారవచ్చు. తేదీ మారవచ్చు. పూజావిధానం మారవచ్చు. కానీ, పితృదేవతారాధన అన్ని దేశాల్లోనూ ఉంది. వంశాభివృద్ధికి పెద్దల ఆశీస్సులు అవసరమని చాలా మతాలు విశ్వసిస్తాయి.

క్రైస్తవం
నవంబరు ఒకటిన 'ఆల్‌ సెయింట్స్‌డే' ... దివంగతులైన సాధుసత్పురుషుల కోసం. రెండున 'ఆల్‌ సోల్స్‌డే'... దివంగతులు అందరికోసం. ఆ రెండు రోజులూ ప్రభువు సామ్రాజ్యం నుంచి వచ్చే అపురూప అతిథుల కోసం ప్రార్థనలు చేస్తారు. కీర్తనలు పాడతారు. పెద్దల త్యాగాల్ని గుర్తుచేసుకుంటారు.

ఇస్లాం
'షబ్‌-ఎ-బరాత్‌' సందర్భంగా రాత్రంతా జాగరణ చేస్తారు. తెల్లవారుజాము ప్రార్థనకు ముందు... దివంగతుల సమాధుల్ని దర్శించుకుంటారు. పెద్దలకు స్వర్గలోక ప్రవేశాన్ని కల్పించమని అల్లాను వేడుకుంటారు.

జైనం
జననమరణాల చక్రం నుంచి బయటపడమని చెబుతాడు మహావీరుడు . వోక్షమే పరవోన్నతమని బోధిస్తాడు. జైనులు కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరిస్తారు. దానధర్మాలకు ప్రాధాన్యమిస్తారు.

సిక్కుమతం
సిక్కులు దివంగతులను పూజించరు. దేవుడిని తప్ప ఎవర్నీ కొలువకూడదని 'గ్రంథ్‌సాహిబ్‌' చెబుతోంది. గురునానక్‌ పితృకర్మలను తీవ్రంగా నిరసించారు. 'గంగలో నీళ్లు వదిల్తే, పక్క వూళ్లో ఉన్న పొలమే తడవదే! అలాంటిది, ఏ లోకాల్లోనో ఉన్న పితృదేవతల దాహం ఎలా తీరుతుంది?' అని ప్రశ్నించారు.

బౌద్ధం
కోరికలే అన్ని దుఃఖాలకూ హేతువులు. నిరంతర సాధనతో మనిషి కోరికల్ని జయించాలంటాడు బుద్ధుడు. బౌద్ధం పితృదేవతల ఆరాధనను వ్యతిరేకించలేదు. అలా అని ప్రోత్సహించనూ లేదు. తైవాన్‌, జపాన్‌, చైనా, శ్రీలంక..తదితర దేశాల్లోని బౌద్ధులు వివిధ రూపాల్లో ఆత్మల పండగ చేసుకుంటారు.

జొరాస్ట్రియన్లు
జొరాస్ట్రియన్లు లేదా పార్సీలు శుద్ధికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆలోచనలు, మాటలు, చర్యలు పరిశుద్ధంగా ఉండాలంటారు. పితృదేవతలకు ప్రార్థనలు జరిపే సంప్రదాయం వీరికీ ఉంది. పార్సీల క్యాలెండరు ప్రకారం వచ్చే, ఎనిమిదోనెల పదో రోజున పితృదేవతల పండగ జరుపుకుంటారు.

పెద్దల కోసం...
రుగ్వేదంలో పితృదేవతలకు కొన్ని రుక్కులు కేటాయించారు. ఆతర్వాత వచ్చిన 'గరుడపురాణం' శ్రాద్ధ కర్మల గురించి విపులంగా చర్చించింది.
* ఈజిప్టు పిరమిడ్లు పితృదేవతల ఆరాధనలో భాగమే. మరణానంతర జీవితం సాఫీగా సాగాలని ఎంత ఆశో! దివంగతుల సమాధుల్లో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలూ పానీయాలూ పెట్టేవారు. ధనకనక రాశులూ సమర్పించేవారు.
* మెక్సికన్లు నవంబరు రెండవ తేదీని దివంగతులకు కేటాయించారు. పక్షులకూ జంతువులకూ కూడా ఆరోజు సంతాపం తెలుపుతారు.
* తైవానీయుల పెద్దల పండగ 'చింగ్‌ మింగ్‌'. దేవతలకు ముడుపు కట్టినట్టు, ఏడాది కాలంలో పితృదేవతల కోసం దాచి ఉంచిన 'ఆత్మ ధనాన్ని' సమాధుల దగ్గర కాల్చి బూడిద చేస్తారు. పొగ రూపంలో ఆ డబ్బు పెద్దలకు చేరుతుందని నమ్మకం. అలా ఇవ్వకపోతే, ఆర్థిక సమస్యలతో వారు భూతప్రేతాల రూపంలో భూలోకానికి వచ్చేస్తారని భయపడతారు.
స్మృతి...
మరణించినవారు...
స్వార్థపరులు.
మనం వెక్కివెక్కి ఏడుస్తున్నా...
ఒక్కసారైనా వూరడించరు.
వాళ్లంతే!
నడవడానిక్కూడా బద్ధకమే.
భుజాన వోయించుకుంటారు.
పిల్లల్లా స్నానం చేయించుకుంటారు.
ఎంత దర్పవో.
మనకు తెలియని సత్యాలేవో తెలిసినట్టు, మనం చూడని లోకాలేవో చూసినట్టు.
వెళ్లేప్పుడు, మాటవరసకైనా చెప్పరే!
మహామొండిఘటాలు.
హెచ్చరిస్తున్నట్టో...
మనల్ని నిందిస్తున్నట్టో...
మొహం మాడ్చుకునుంటారు.
తమమాటే నెగ్గాలన్నట్టు బిర్రబిగుసుకుపోతారు.
తామే ప్రత్యేకమైనట్టు... కర్రల రథమెక్కి వూరేగుతారు.
మహా మతిమరుపు!
ఏదీ గుర్తుంచుకోరు. ఎవర్నీ గుర్తుంచుకోరు.
మనం మాత్రం గుర్తుచేసుకోవాలి...
ఏడాదికోసారైనా.

- ఏంజెల్‌ గొంజాలేజ్‌ (1925-2000) రచనకు స్వేచ్ఛానుకరణ(source : Eenadu newspaper)
  • ==========================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Tuesday, September 20, 2011

గణేష్‌ దీక్షమాలాధారణ,వినాయక మాలాధారణ ,Ganesh Deeksha maalaadhaarana



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండ, వాన లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో , రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు ... పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -గణేష్‌ దీక్షమాలాధారణ,వినాయక మాలాధారణ(,Ganesh Deeksha maalaadhaarana)- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


కార్తీక మాసం వస్తె అయ్యప్ప మాల వేసే భజనలో కనిపించే స్వాములను చూస్తుంటాం . ఇప్పుడు వినాయ మాలధారణ వేయడం మొదలైనది . ఇది ఎప్పటి నుండో ఉన్నపటికీ బహుల ప్రచారము జతగలేదు . సాదారనము ఈ మాల 1121 రోజులు లేదా 41 రోజులు వేసి దీక్షలో ఉంటారు . 41 రోజు మాలను ధరించేభక్తులు వినాయక చవితికి ముందు 21రోజులు , 21రోజు మాల ధరించే భక్తులు వినాయక చవితిరోజున ధరించడం జరుగుతుందన్నారు. 21 & 41 రోజు అనంతరం దీక్షా విరమణ కాణిపాక సిధ్ది వినాయక దేవాలయంలో గావింపబడుతుంది . వినాయక చవితి రోజున గణేష్‌దీక్ష మాలాధారణ చేయడం ఆనవాయితీ అని గణేష్ దీక్ష చేపట్టే భక్తులకు స్వామివారి ఆలయం వద్ద దర్శనానికి కూడా ప్రత్యేక సమయం ఏర్పాట్లు చేయనున్నట్లు కానిపాకం ఆయల పూజారి తెలిపారు. గణేష్‌దీక్ష చేపట్టిన భక్తులందరికి స్వామివారి ఉచిత నిత్య అన్నదానం సత్రంలో భోజన వసతి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.



దేవగణాలకు అధిపతి అయిన వినాయకుని సేవిస్తే సర్వవిఘ్నాలు తొలగిపోతాయని , సత్వరమే కార్యసిద్ధి జరుగుతుందని శ్రీకాకుళం శ్రీ షోడశ గణపతి వ్యవస్థాపల అధ్యక్షులు ' శంకరరావు గురుస్వావి 'చెబుతున్నారు . జిల్లాలో తొలిసారిగా(01-09-2011) శ్రీకాకులం లో వినాయక మాలధారణ చేపట్టి నిష్టతో ఎంతో భక్తిప్రపత్తులతో పూజలు చేస్తున్నారు .

  • *ఐదేళ్ళ(5) నుంచి 70 యేళ్ళ వయసు వరకూ ఎవరైనా ఈ దీక్ష తీసుకొని సంకటవిమోచన గణపతిని పూజించవచ్చును .
  • *మాలధారణ చేసిన భక్తులు రోజూ తెల్లవారుజామున నిద్రలేచి ఐదు గంటలకల్లా స్నానాధికాలు ముగించుకోవాలి .
  • *వినాయక దేవాలయము చేరి పూజలు , అభిశేకాలు నిర్వహించాలి . యాగ శాలలో చేరి గణేషుని సేవలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలి .9.00 గంటల కల్లా ఎవరివిధులకు వారు వెళ్ళిపోవచ్చును .
  • *మధ్యాహ్నము భిక్ష యదావిధిగా ఉంటుంది .
  • *సాయంత్రము 6.00 గంటలకు గణనాధుని విశేషపూజలు , భజన ఉంటుంది .

ఈవిధముగా దీక్షను 21 రోజులు పాటు చేస్తే కార్యసిద్ధి , అభీష్టసిద్ధి కలగడం తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది . విద్యార్ధులకు విద్య , ధనార్ధికి ధనము , మోక్షార్ధికి మోక్షము ... ఇలా ఏ భావముతో పూజిస్తే అది సిద్ధిస్తుంది అని పూజారి తెలిపారు . ఇక్కడ నమ్మకమే ఒక ఔషధము లా పనిసేస్తుంది .గణపతి మంత్రము నిష్టగా జపం చేస్తే అభీష్టాలు సిద్ధిస్తాయని నమ్మకము . గణపతిని స్మరించినా విఘ్నాలు తొలుగుతాయి . స్వామి దీక్ష చేపట్టి 11, 21, 41 దినాలు ఇంట్లో పూహించుకుంటే సర్వాభీష్టాలు నెరవేరుతాయని అంటారు . ఈ మాలధారణ వినాయక చవితి రోజుల్లోనే కాకుండా .. సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా ఒక శుభమూర్తాన మాల ధరించవచ్చని గురుస్వాములు అంటారు .
  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Tuesday, September 13, 2011

మొగ్గ దోసిళ్ళ నోము ,Mogga Dosilla Nomu



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -మొగ్గ దోసిళ్ళ నోము ,Mogga Dosilla Nomu - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


కథ
ఒక బ్రాహ్మణ బాలిక సవతి పోరునూ, దరిద్రాన్నీ భరించలేక... ప్రతిరోjజూ శివలింగం ముందు దు:ఖిస్తుండగా, ఒకనాడు శివదేవుడు ప్రత్యక్షమై "అమ్మాయి! గతంలో నువ్వు మొగ్గ దోసిళ్ళ నోము నోచి ఉల్లంఘించడం వల్లనే నీకీ కష్టం వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆ నోమును యాధాప్రకారం ఆచేరిస్తే, సవతి తల్లి పోరూ తప్పుతుంది. సర్వ దరిద్రాలూ తొలిగిపోతాయి ” అని చెప్పాడు.

అది విన్న బాలిక ఆ విధంగానే చేయగా ఏడాది గడిచేసరికి సవతి తల్లికి మనసు మారి, ఆ కన్యను ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. అంతలోనే సంపన్నుల యింటి సంబంధం వచ్చి, ఆమెకు ధవంతుడైన యువకునితో వివాహం జరిగి దరిద్రమూ తొలగిపోయింది.

విధానం
ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఒక పళ్ళెంలో పసుపు పోసి, దానిమీద మూడు దోసిళ్ళ నీరు పోసి, దానిని వంటికి రాసుకుని శివుణ్ణి స్మరించాలి. పై కథ చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఏడాది తరువాత ఉద్యాపన చేయాలి.

ఉద్యాపనం
మూడు దోసిళ్ళ పువ్వులూ, మూడు దోసిళ్ళ పగడాలు, మూడు దోసేళ్ళముత్యాలూ తీసుకుని శివాలయానికి వెళ్లి , శివుడికి వాటిని ధారబోసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి.

  • ==================================
Visit My Website - > Dr.Seshagirirao

Monday, September 5, 2011

ముక్తినాథ దేవాలయము-నేపాల్ , Muktinath Temple-Nepal



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -ముక్తినాథ దేవాలయము-నేపాల్ - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--



శ్రీమహావిష్ణువుకు మరో రూపమే సాలగ్రామం. హిమాలయ సానువుల్లో గండకీనదిలో ఈ సాలగ్రామాలు లభ్యం అవుతుంటాయి. వాటిని తెచ్చుకుని భక్తితో పూజలు చేయడం మన సంప్రదాయం. సాలగ్రామ మూర్తిగా నిత్యం పూజలందుకునే మహావిష్ణువు స్వయంగా వెలసిన క్షేత్రం సాలగ్రామ క్షేత్రం. దీనికే ముక్తినాథ్ అనే ఇంకోపేరు ఉంది. ఈ క్షేత్రం నేపాల్ దేశంలో ఉంది.

ముక్తినాథ్ ఈ దేవాలయ దర్శనముతో కష్టములు/బాధలు అన్నీ తొలగిపోతాయని నమ్మకము. (ముక్తి=నిర్వాణము,నాథ్=దేవుడు). ముక్తినాథ్ యొక్క ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము నేపాల్ లో ముస్తంగ్ జిల్లాలో, జామ్సం కు 18 కిలోమీటర్లలలో తూర్పు, దక్షిణదిశగా, దాదాపు 3,749మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది. ముఖ్య దేవాలయము వరహా ఆకారములో ఉన్న వైష్ణవ ఆలయము. గోడల్లోంచి 108 పుణ్యతీర్థ జలధారలు వస్తుంటాయి. ఈ దేవాలయము ఎత్తైన కొండపైన నెలకొని ఉంది, అందువలన వాతావరణము అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే దర్శనీయముగా ఉంటుంది. ఖాట్మండు నుంచి ముక్తినాథ్ కు వెళ్ళడానికి రెండు మార్గములు ఉన్నాయి. ఒకటి, విమానములో ఖాట్మండు లో బయలుదేరి, పోఖరా గుండా జామ్సం చేరి, అక్కడి నుంచి కాగ్బెని ద్వారా ఏడు నుండి ఎనిమిది గంటల నడక ద్వారా చేరుకోవచ్చు. లేదంటే, పోఖరా నుంచి మొత్తము నడిచి వెళ్లడము, ఇది ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది. నాలుగు ధామముల యాత్ర పూర్తి చేసిన తరువాత ఈ యాత్ర చేయవలెనని నమ్ముతారు. ఈ దేవాలయ పవిత్రతను హిందువులు,బౌద్దమతస్థులు కూడా విశ్వసిస్తారు. దగ్గరలో ఉన్న జ్వాలామాత మందిరములో భూగర్భంలోని సహజ వాయువుల వలన నిత్యమూ వెలుగుతున్న ఒక జ్యోతి ఉంది. అన్నపూర్ణ ప్రాంతములో, జామ్సమ్ ఒక మంచి కూడలి. ఇక్కడ ప్రపంచస్థాయి వసతి సౌకర్యాలు కలవు, వీటి ద్వారా ఎవరైనా ఈ ప్రకృతి సౌందర్యమును చక్కగా ఆస్వాదించవచ్చు.

వేసవి కాలంలో ఈ ఆలయం చూడడానికి అనుమతిస్తారు. ఈ సీజన్‌లో రోజుకు 300 మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో నాలుగు చేతులున్న నారాయణుని ప్రతిమ ఉంది. ఇక్కడ స్వామికి నాలుగు చేతులున్నా ఆయుధాలు ధరించినట్టు లేకపోవడం విశేషం. ఇది నారాయణుని స్వయంవ్యక్త ప్రదేశం. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఉంది. శ్రీ వైష్ణవులు ఎంతో భక్తితో సేవించుకునే 108 దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి . ఆలయంలో ముక్తినాథ్ (నారాయణుడు) స్వామి, శ్రీదేవి, లక్ష్మీదేవి, గరుడాళ్వార్, రామానుజుల వారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు సాలగ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ వారి సంప్రదాయంలో స్వామికి హారతి ఇచ్చే అవకాశం లేదు. నేతితో దీపం పెట్టడం వరకు అనుమతిస్తారు. ఈ క్షేత్రంలో స్వామి విగ్రహమూర్తిని కాకుండా సాలగ్రామ శిలను పూజించడం శ్రేష్ఠం అంటారు. గుడి బైట రామకోటి స్తంభం కన్పించింది. దానికి కూడా ప్రదక్షణ చేసి కాస్సేపు కూర్చుంటారు . అక్కడున్న సాధువుల మాటల ప్రకారం ఈ ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలో అంటే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో గండకీ నది ఉద్భవించిన స్థలం ఉంది. సాయంత్రం అయితే కొండ దిగడం కష్టమని అంటారు . కొండ ఎక్కేటప్పుడు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కాని దిగుతున్నప్పుడు మాత్రం ఆక్సిజన్ అందక కొంతమంది ఇబ్బంది పడతారు. ఆగి ఆగి కిందకు దిగుతూ దారిలో శ్రీవారి ప్రతిరూపాలైన సాలగ్రామాలు, వింజామరలు కొనుగోలు చేసి, బయల్దేరిన శ్యాంసన్ ప్రాంతానికి చేరుకుంటారు . ఆ సాయత్రం వేళ కొండలపై పడుతున్న ఎండ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది .
  • =================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Monday, August 22, 2011

Garika pooja , గరిక పూజ



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము ---------------- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--

గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు. శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.

గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. గరికతో చేసిన అంజనాన్ని ప్రతిరోజూ ధరిస్తే అన్ని పనులు నెరవేరుతాయి. ఇంకా గరిక రసం తాగితే దేహంలోని సమస్త వ్యాధులు నయం అవుతాయి.

గరిక పూజ ప్రత్యేకత

వినాయకుడు మనకున్న దేవతలలో అయోనిజుడు. పార్వతి రూపు దిద్దిన పిండిబొమ్మ. ఆయన జన్మ సహజ ప్రక్రియలో జరగలేదు. ఆయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలులేవు. అందుకే పార్వతి చేతిలో ప్రాణ పోసుకున్న పిల్లవాడిని లోకం పార్వతీసుతుడు అని పిలిచింది. శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగుతలతో ప్రాణాలు తెచ్చుకున్నాక గజాననుడు అయ్యాడు. శివుడి కుమారుడు కుమారస్వామితో పోటీపడి గణాధిపత్యం దక్కించుకున్నాక గణనాథుడు, గణేశుడు, గణపతి అని పేరు తెచ్చుకున్నాడు. పెద్ద పొట్ట ఉన్నందున లంబోదరుడని, విఘ్నాలకు అధిపతి అయినందున విఘ్ననాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరే వినాయకుడిగా మారింది. ఈయనకు 21 రకాల పత్రులతో పూజ చేసినా వాటిలోకెల్లా అత్యవసరమైనది, అతిముఖ్యమైనది, వినాయకుడికి ఎంతగానో నచ్చినది దూర్వార పత్రం. దాన్నే తెలుగులో గరిక అంటారు. ఏమిటి ఈ గరిక ప్రత్యేకత

పూర్వం సంయమిని పురంలో ఒక మహౌత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బైటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగుతీశారు. ఆయన వారినందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కాని ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు. కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికీ ఇదే చికిత్సగా పనికివస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80 వేల మంది రుషులు అక్కడికి వచ్చారు. ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితో తాపోపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించే వారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం.

గడ్డిపోచే కదా అని తేలికగా తీసేయకండి...గణేశుని మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెబుతున్నారు. గరిక వక్రతుండ మహాకాయుడిని ఎలా మెప్పించిందో చెప్పేందుకు ఉదంతం ఉంది. అది శివపార్వతుల పెళ్ళి జరిగే రోజు. పెళ్ళికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తాడని భావించి హిమవంతుడు హడావుడి పడ్డాడు. జగం మెచ్చిన, జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెపðకున్నాడు. మందీ మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా పదిమంది కూడా వెంటలేకుండా చాలా మామూలుగా వచ్చాడు. పదిమంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుని చూసి హిమవంతుడు నీరసపడ్డాడు. ఇలాంటి వాడినా పర్వతరాజు కూతురు పార్వతి పెళ్ళి చేసుకుంటోంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడ్డాడు. కడుపులో బాధ ఆపుకోలేక బైటికే అనేశాడు. పెళ్ళి కొడుకు హంగూ ఆర్భాటం ఇంతేనా ఎంత మంది వచ్చిపడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలా ఏర్పాట్లు చేశాను అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే కాని ఈ పిల్ల వాడికి కాస్త తిండి పెట్టించండి..ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురంటున్నాడు అని వినాయకుడిని చూపించాడు. ఈ పిచికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనక...ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్ళకు పురమాయించాడు. పెళ్ళి వారి కోసమని వండిన అన్న మంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. విస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, ఉపðలు, పపðలు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. పందిట్లోకి వచ్చి పందిరి పైకపðగా పరచిన తాటాకులు, పందిరికి కట్టిన మామాడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానాగోల చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబోరు ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అపðడు శివుడు కలుగజేసుకుని ఇంత చిన్నపిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు..ఇంకో పదిమందిని తీసుకువస్తే ఏం చేసే వాడివి అని ప్రశ్నించాడు. తన అహంకా రానికి సిగ్గుపడి ముపðతప్పే మార్గం చూపమని వేడుకుంటాడు. ఆయనకు గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్ని తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్కా అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు. నిజంగానే వినాయకుడు ఠక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కాని ఇరవై ఒక్క గడ్డిపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్టు గరికపోచకు ఎలా ఆగిపోయాడు వెనకటికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని, ధనేతరాన్ని త్రాసులో వేసి విఫలమవుతే రుక్మిణి తులసి దళం ఒకటి వేసి తులతూచలేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు.

తులసిదళానికి అంత అమోఘమైన శక్తి ఉందని తెలిసి కూడా హిమవంతుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అప్పటికి ఇంకా ఆ ఉదంతం జరిగి ఉండకపోవచ్చునని కొందరు ఠక్కున సమాధానం చెబుతారు. కానీ దీనికీ ఒక కారణం ఉంది. వెనకటికి తులసీదేవి ఇంకా పెళ్ళి చేసుకోని రోజులలో వినాయకుడిని చూసి వెూహించి వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పటికి ఇంకా వినాయకుడికి పెళ్ళిమీద గాలి మళ్ళలేదు. అదే చెప్పి ఆమె కోరికను కాదన్నాడు. అందుకు అలిగిన తులసి నీకు మంచి ప్రవర్తన లేని అమ్మాయితో పెళ్ళవుగాక అని శపించింది. దీనికి ప్రతిగా రాక్షసుని పెళ్ళి చేసుకుని మొక్కగా పడిఉండమని శపించాడు. అది విని తులసి బోరున విలపించింది. దానికి వినాయకుడు జాలిపడి విష్ణుమూర్తితో వివాహమవుతుందని, ఆయనకు అత్యంత ప్రీతి పాత్రురాలిగా ఉంటావని వరమిస్తాడు. తాను వివాహానికి అంగీకరించనందున తన పూజకు తులసి పనికిరాదని అంటాడు. అయితే తులసి పట్ల చివరిలో ప్రసన్నుడైనందున ఒక్క వినాయకచవితి నాడు తన పూజలో వినియోగించవచ్చునని వరమిస్తాడు. అందుకని తులసిని సాధారణ రోజులలో వినాయకపూజలో వినియోగించరు. ఒక్క వినాయకచవితినాడు మాత్రమే ఉపయోగిస్తారు.

-వి.విజయలక్ష్మి
  • =========================================
Visit My Website - > Dr.Seshagirirao ->-http://dr.seshagirirao.tripod.com

Sunday, August 14, 2011

ఆత్మ-మృత్యువుపై యుద్ధం , Soul-battle against death.



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -ఆత్మ-మృత్యువుపై యుద్ధం - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


మనిషి అమరత్వాన్ని సాధించగలడా?..మృత్యువును జయించగలడా? చిరంజీవిగా ఎల్లకాలం ఈ పుడమిపై వర్థిల్లగలడా?

జమదగ్ని కుమారుడు పరశురాముడు, బలిచక్రవర్తి, విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్ధామ, ద్రోణాచార్యుని బావమరిది కృపాచార్య వంటివారు చిరంజీవులని, ఈ భూమి ఉన్నంతవరకు వారు ఊపిరితోనే ఉంటారని చెబుతున్న మన పురాణాలు ఎంతవరకు నిజం? అసలు అమరుడై జీవించాలనే కోరిక మనిషికి ఎలా కలిగింది? అది ఎంతవరకు సాధ్యం? అలా మనుషులను అమరులుగా మార్చేందుకు ఎక్కడైనా పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిచిగాన్‌లోగల క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్2.

క్రయోనిక్స్ అంటే?
మరణించినవారి శరీరాలను భద్రపరిచే ప్రక్రియనే క్రయోనిక్ అంటారు. 200 డిగ్రీల కంటే తక్కువ శీతల స్థితిలో ఆ శరీరాలను భద్రపరిచి మరణం ఎందుకు సంభవించిందనే విషయంపై పరిశోధనలు జరుగుతాయి అక్కడ. భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి జరిగి 3్ఫ్యచర్ సైన్స్2ద్వారా మరణించిన వ్యక్తులను తిరిగి తికించేందుకు అవకాశం కలగవచ్చనే ఆశాభావంతో క్రయోనిక్ శాస్తవ్రేత్తలు అలుపెరుగక పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మిలియనీర్లు మరణం తర్వాత జీవితంకోసం తమ శరీరాలను క్రయోనిక్ ఇనిస్టిట్యూట్‌కు అప్పగించాలని తమ వారసులను కోరి తనువులు చాలించారు. అలాంటి వారిలో అనేకమంది మృత శరీరాలు ప్రస్తుతం క్రయోనిక్ ఇనిస్టిట్యూట్‌లో భద్రపరచబడ్డాయి. వాటిపై ఎడతెగని పరిశోధనలు జరుగుతున్నాయి. మరణించిన వారి శరీరాలపై పరిశోధనలుచేసే క్రయోనిక్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ఆ మరణాలు ఎందుకు సంభవించాయనే విషయం తెలుసుకోవడానికి, మృత్యువుపై గెలుపుకోసం పరిశోధించే క్రమంలో మానవ ఆర్గాన్స్, టిష్యూస్, సెల్స్, సెల్యులర్ కాంపోనెంట్స్‌పై దృష్టి సారించి అన్వేషణ సాగిస్తున్నారు. మరణించిన వారిని తిరిగి బతికించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న క్రయోనిసిస్టులు అన్ని రుగ్మతలు తప్పకుండా తగ్గించబడతాయని అంటున్నారు. ఏజింగ్... వృద్ధాప్యాన్ని కూడా త్వరలోనే తాము జయిస్తామని, అప్పుడు ఎవరూ ముసలివారు కారని బల్లగుద్దిమరీ చెబుతున్నారు. తమ పరిశోధనలు ఫలించి త్వరలోనే మానవులు ఎప్పటికీ యూత్‌గాను, హెల్దీగాను ఉండిపోయేలా మందులు రూపొందించేరోజు ఎంతో దూరంలో లేదని వారంటున్నారు. అయితే మరణించిన వారిని బతికించాలని చూస్తున్న క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యుల చర్యల పట్ల చాలామంది పరిశోధకులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన మనిషి తిరిగి బతకడం అనేది అసంభవమని అంటున్నారు. దీనిపై క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు మాట్లాడుతూ 1885లో లార్డ్ కెల్విన్ అనే శాస్తక్రారుడు ఫ్లయింగ్ మెషీన్ల రూపకల్పన అనేది అసంభవమని అన్నాడని, అయితే ఆయన అభిప్రాయం పొరపాటని నిరూపిస్తూ ఫ్లయింగ్ మెషీన్లు చక్కగా రూపొంది విమానాలు తయారుచేయబడ్డాయని, మనుషులు వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఖండాంతరాల మధ్య హాయిగా ప్రయాణిస్తున్నారని అంటున్నారు. అలాగే 3ప్యూచర్ సైన్స్2 మరణించిన వారిని కూడా బతికిస్తుందని వారంటున్నారు. జీవులను పోలిన జీవులను మానవ ప్రయత్నం ద్వారా రూపొందించే 3క్లోనింగ్2 ప్రక్రియ కూడా సాధ్యంకాదని ఎంతోమంది అన్నారని, అయితే నేడు క్లోనింగ్ కూడా అందుబాటులోకి వచ్చిందని వారు చెబుతున్నారు.

క్రయోనిక్స్ ఎటువంటి వారిని స్వీకరిస్తారు?
క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌లో భద్రపరిచి భవిష్యత్తు కాలంలో ప్రాణం పోసేందుకు క్రయోనిక్స్ స్వీకరించే మృత్యు శరీరాలకు కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. మరణం తథ్యమని తేలి మరికొన్ని క్షణాల్లో గుండె ఆగిపోయే వాళ్లను, మనిషి మరణించినా... మెదడు ఇంకా మరణించకుండా ఉండే వ్యక్తులను, మనిషి మరణించినా సెల్స్, మెదడు అప్పటికి ఇంకా మరణించకుండా ఉండే వారినే క్రయోనిక్స్ భవిష్యత్‌లో తిరిగి బతికించేందుకు స్వీకరిస్తారు. మరణించి చాలా సమయం అయితే శరీరంలోని సెల్స్, మెదడు ఇక పనిచేయవని, రక్తం గడ్డకట్టుకుపోతుంది కనుక అటువంటి వారిని తాము స్వీకరించినా ప్రయోజనం ఉండదని వారంటున్నారు.
అన్నీ బాగున్నాయని క్రయోనిస్టులు భావిస్తే అలా సేకరించిన శవంలోని బాడీ వాటర్ మొత్తాన్ని వారు ముందు తొలగిస్తారు. అప్పుడు ఆ శవంలోకి వారు 3క్రియోప్రొటెక్టెంట్స్2 అనబడే ద్రవాన్ని ఎక్కిస్తారు. దీంతో
రక్తనాళాలు చైతన్యాన్ని కోల్పోకుండా బతికి ఉన్న మనిషికి ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడైతే మరణించిన మనిషి శరీరంలోకి క్రిప్టోప్రొటెక్టెన్స్ ఎక్కిస్తారో అప్పటినుంచి అతిశీతలంవల్ల శవం తాలూకు టిష్యూలు ఎలాంటి డామేజ్ లేకుండా ఉండగలుగుతాయి. క్రిప్టోప్రొటెక్టెన్స్ వల్ల బతికి ఉన్న మనిషి ఎలా ఉంటాడో అలాగే మరణించిన వారు కూడా ఉంటారని, వారిపై పరిశోధనలు కొనసాగుతాయని క్రయోనిక్స్ చెబుతున్నారు.

సోల్!
ఆత్మ ఉంటుందని కొందరు... ఉండదని కొందరు వాదిస్తున్న సమయంలో క్రయోనిక్స్ మాత్రం ఆత్మ అనేది కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. హ్యూమన్ ఎంబ్రియోజే మనుషుల తాలూకు ఆత్మ అని, దానిని లిక్విడ్ నైట్రోజన్‌లో భద్రపరిస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందని వారంటున్నారు. ఫ్యూచర్ సైన్స్ అభివృద్ధి సాధించిన తర్వాత మరణించిన వారిపై పరిశోధనలవల్ల వారెందుకు మరణించినదీ, అందుకు వాడవలసిన మందులను కనిపెట్టి తగిన రిపేర్‌తో స్వస్థత చేకూర్చిన తర్వాత తిరిగి వారి శరీరాల్లోకి హ్యూమన్ ఎంబ్రియోజ్‌ను చేరిస్తే వారు చక్కగా బతికి నిద్రనుంచి మేల్కొన్నట్టు మేల్కొంటారని అంటున్నారు.

క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్-ఎప్పుడు మొదలయింది?
1976లో రాబర్ట్ ఎట్టింగర్ అనే పరిశోధకుడు క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించాడు. ఎట్టింగర్‌నే 3్ఫదర్ ఆఫ్ క్రయోనిక్స్2 అంటారు. మిచిగాన్‌లోని క్లింటన్ టౌన్‌లో ఉన్న క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ (సిఐ)లో ఎంతోమంది తమ పేర్లను ఇప్పటికే నమోదుచేసుకున్నారు. తాము అమితంగా ఇష్టపడేవారి పేర్లను నమోదుచేసి ఉంచారు. వారు చివరి క్షణంలో క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులకు సమాచారం
అందజేస్తే వీరెళతారు. క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఎవరైతే చేరాలని అనుకుంటున్నారో వారి మృత శరీరాన్ని తీసుకొచ్చి భద్రపరిచి తిరిగి బతికే అవకాశవం కల్పించేందుకు కృషిచేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ అనేది ఒక హాస్పిటల్ వంటిది. ఇది ప్రభుత్వ అనుమతితో నడుస్తోంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, వలంటీర్లతో ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో విస్తరించి ఉంది. ఇది నాన్‌ప్రాఫిటబుల్ సంస్థ. ఇది ప్రతి రెండు మాసాలకు ఒకసారి 3లాంగ్‌లైఫ్2 పేరుతో ఒక మ్యాగజైన్‌ను కూడా ప్రచురిస్తోంది. ఇందులో క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ సాధించిన ప్రగతి, ఫలితాలు ఇస్తున్న పరిశోధనల వివరాలు, కొత్త సభ్యుల వివరాల వంటివి ఉంటాయి. క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌కు చేర్చబడ్డ మృత శరీరాలను వారు ఇక్కడుండే కంప్యూటర్ కంట్రోల్‌డ్ లిక్విడ్ నైట్రోజన్ కూలింగ్ బాక్సులో భద్రపరుస్తారు. తర్వాత ఆ బాక్స్ వాక్యూమ్ ఛాంబర్‌కు తరలించబడుతుంది. అక్కడుంటే ఆ శరీరం ఏ స్థితిలో అయితే అక్కడికి చేర్చబడిందో అదే స్థితిలో వందల సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. అప్పుడు దానిపై ఎనే్నళ్లయినా పరిశోధనలు చేయవచ్చు. ఎంత కాలానికైనా దానిని తిరిగి బతికించే వీలు ఉంటుందని క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు, పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం వంద వరకు అక్కడ శవాలు భద్రపరచబడ్డాయి.

ఇక్కడ ఎవరు చేరవచ్చు?
క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌లో చేరి తిరిగి ప్రాణం పోసుకోవాలని కోరుకునేవారు ముందుగా మెంబర్‌షిప్ తీసుకోవాలి. అందుకుగాను అటువంటివారు గానీ, వారి తరఫువారు గానీ 28,000 డాలర్లు ముందుగా
చెల్లించాలి. తర్వాత ఏడాదికి 195 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మరణంపై మనిషి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇప్పటికే ఎంతోమంది శ్రీమంతులు క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌కు పెద్దఎత్తున విరాళాలు పంపడంవల్ల ఈ ఇనిస్టిట్యూట్ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తేలిగ్గా నడుస్తోందని, మానవులందరి తరఫున తాము మృత్యువుపై యుద్ధం చేస్తున్నామని క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు, శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి త్వరలోనే వారు మృత్యువుపై విజయం సాధించాలని, మనుషులకు అమరత్వాన్ని ఆపాదించగలగాలని కోరుకుందాం.

Source :
- బాబు-- Andhrabhoomi--August 14th, 2011 Sunday magazine.

  • =================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Monday, July 4, 2011

అమర్‌నాథ్‌ గుహ,అమర్నథ్ యాత్ర ,Amaranath Cave,Amaranath yatra



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -అమర్‌నాథ్‌ గుహ,అమర్నథ్ యాత్ర (Amaranath Cave,Amaranath yatra )- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--



మంచు కొండ మీద ఓ గుహ... భారత దేశంలోనే పెద్దది... ఉన్నది 12,000 అడుగుల ఎత్తున... అక్కడికి వెళ్లడమే ఎంతో కష్టం... అయినా లక్షలాది మంది దర్శిస్తారు... అదే అమర్‌నాథ్‌!

ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే
అమర్‌నాథ్‌ గుహ! జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని మంచు కొండపై, సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ గురించిన పురాణ కథ ఇది. దేశంలోనే అతి పెద్ద గుహగా 75 అడుగుల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో ఉండే ఇందులో ఏటా జూన్‌, ఆగస్టుల మధ్య కాలంలో మంచు శివలింగాకారంలో ఏర్పడడం ఓ భౌగోళిక అద్భుతం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన
ఇక్కడికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

అమర్‌నాథ్‌ గుహ బుటామాలిక్‌ అనే ఓ ముస్లిం బాలుడి వల్ల బయటపడడం ఒక విశేషం. తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ మంచు కొండ ఎక్కినప్పుడు తొలిసారిగా దీన్ని చూశాడని చెబుతారు. ఇప్పటికీ ఆ బాలుడి వంశస్థులు అక్కడే ఉంటారు. అమర్‌నాథ్‌ సంబంధించిన ప్రస్తావన క్రీస్తుపూర్వం 34 నుంచి అనేక గ్రంథాలు, చారిత్రక ఆధారాలలో కనిపిస్తుంది. భక్తులు పహల్గామ్‌ అనే ఊరి నుంచి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు కొండ ఎక్కుతారు.

జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు, పహల్గామ్‌లో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్‌వరి వద్ద నెలవంకని, శేష్‌నాగ్‌ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్‌ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ణి వద్ద పంచ భూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్‌నాథ్‌ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు.

అమర్‌నాథ్‌ గుహకి పైభాగంలో ఉండే రామకుండం అనే సరస్సు నుంచి బొట్టు బొట్టుగా పడే నీరు గడ్డకడుగూ ఏడడుగుల ఎత్తయిన శివలింగంగా ఏర్పడుతుంది. దీని ఎత్తు చంద్రుని హెచ్చుతగ్గులను బట్టి మారుతుందని చెబుతారు.

ఇంకా పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి - ఆమర్ నాథ యాత్ర

మూలము : ఈనాడు దినపత్రిక
  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

Friday, July 1, 2011

శతాక్షి , శాకంభరి , Shatakshi , Shakambari



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -శతాక్షి , శాకంభరి , (Shatakshi , Shakambari)- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


జగన్మాత రూప విశేషాల్లో ఆకుకూరలు, కాయలు, పండ్లులాంటివి చేత పట్టుకుని ఉన్న ఓ రూపం కనిపిస్తుంటుంది. అనేక పక్షులతో కరుణారస వీక్షణాలతో మరో రూపం కనిపిస్తుంటుంది. పరాశక్తి అనగానే దనుజ సంహారం కోసం అనేకానేక బాహువులలో అనేకానేక అస్త్ర శస్త్రాలను కలిగి ఉండాలి కదా? ఈ రూపాలేమిటి ఇంత సౌమ్యంగా ఉన్నాయి... వీటి విశేషాలేమిటి అని తెలుసుకోవాలంటే దేవీ భాగవతం ఏడో స్కంధం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడాల్సిందే.

పూర్వం హిరాణ్యక్షుడి వంశంలో రురుడు అనే ఓ రాక్షసుడుండేవాడు. ఆ రురుడికి మహాదుష్టుడైన దుర్గముడు అనే పుత్రుడుండేవాడు. దుర్గముడికి లేచింది మొదలు దేవతలను, మునులను, రుషులను,
సత్పురుషులను ఎలా సంహరించాలన్నదే ఆలోచన. సాధ్యమైనంతవరకూ తన బలంతో దేవతలందరినీ కష్టాల పాలు చేస్తూనే ఉండేవాడు. అయినా వాడికి తృప్తి కలగలేదు. ఒకేసారి దేవతలను, మనులను
అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. వెంటనే కపట బుద్ధితో బ్రహ్మదేవుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాక్షసుడు తనకు నాలుగు వేదాలు కావాలని అన్నాడు. భక్తులకు వరాలనివ్వటమే తప్ప ఇంకేమీ ఆలోచించని, సత్యమార్గాన్నే అనుసరించే బ్రహ్మ నాలుగు వేదాలను అప్పగించి అంతర్థానమయ్యాడు. ఆ మరుక్షణం నుంచే ఆ రాక్షసుడి దురాగతాలకు అంతులేకుండా పోయింది. వేదాలన్నీ వాడి సొంతం కావటంతో వేద పండితులకు వేదాలు గుర్తురాకుండా పోయాయి. దాంతో వారంతా మూర్ఖులయ్యారు. స్నాన సంధ్యాదులు, నిత్య హోమాలు, శ్రాద్ధజపాలు, యజ్ఞయాగాలు జరిపేవారే కరవయ్యారు. ఎవరకీ వేదాలలోని ఒక్క మంత్రమూ గుర్తుకు రాకుండా పోయింది. దాంతో సర్వత్రా అనర్థం ప్రాప్తించింది. యజ్ఞాలు జరగకపోవటంతో హవిర్భాగాలు అందక దేవతలు క్షీణించి పోసాగారు. దాంతో దుర్గముడు స్వర్గం మీదకు దండెత్తాడు. దేవతలంతా చెల్లా చెదరయ్యారు. భూమండలంలో జననష్టం, జంతునష్టం ఎక్కువైంది. బావులు, చెరువులు, నదులు అన్నీ ఇంకిపోయి అనావృష్టి అధికమైంది. ఇక అలాంటి సమయంలో ఎలాగో ఒక్క ఆలోచన మెరుపులాగా తట్టిన కొందరు దేవతలు, పండితులు హిమగిరికి వెళ్ళి అక్కడ పరాంబికను ఆర్తితో కీర్తించారు. అలా వారంతా కీర్తించగానే భువనేశ్వరి అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడామెకు అనేకానేక కన్నులయ్యాయి. ముందుగా ఆ తల్లి వారందరికీ భక్ష్య భోజ్యాలను ఇచ్చింది. ఆమె చేతుల్లో కూరగాయలు, తియ్యని ఫలాలు ఉన్నాయి. వాటిని అందరికీ పంచి పెట్టింది. ఆమె చేతుల్లోనే పశువుల మేత ఉంది. దాన్ని పశువులకు ఇమ్మని వారికిచ్చింది. ఆ తల్లి కరుణారస వీక్షణాలు సోకి అంతటా పచ్చదనం వెల్లివిరిసింది. నదులు, బావులు, చెరువులు అన్నీ నిండాయి. అలా తన బిడ్డలను శాంతపరిచింది. శాకములను చేతిలో ధరించి అవతరించినందుకు ఆనాడు ఆమెను శాకంభరి అని దేవతలు స్తుతించారు. అధిక సంఖ్యలో కన్నులున్నందుకు శతాక్షి అని ప్రస్తుతించారు. శాకంభరి అవతరించిందని దుర్గమూసురుడు తెలుసుకుని ఆ శతాక్షి మీదకు వేయి అక్షౌహిణుల సేనలతో దండెత్తాడు. ముందుగా ఆ శివాదేవీ తన బిడ్డల చుట్టూ రక్షగా తన తేజోమయ చక్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత దేవీ ఆ రాక్షసుడితో పోరుకు సిద్ధమైంది. ఆ సమయంలోనే ఆమె ముఖం నుంచి కాళిక, తారిణి, బాల త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజాదేవీ, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్ర బాహుక అనే అనేకానేక తీవ్ర శక్తులు ఉద్భవించాయి. ఆ శక్తులన్నీ రణరంగంలో రాక్షససేనకు ఎదుర్కొన్నాయి. మృదంగ, శంఖ, వీణాధ్వనులు మిన్నుముట్టాయి.

దుర్గమాసురుడు ఆ శక్తులతో పదిరోజుల పాటు భీకరంగా యుద్ధం చేశాడు. పదకొండో రోజున రక్తమాల్యాంబరాలను ధరించి రక్తగంధాన్ని పూసుకొని పెద్ద సంరంభంతో యుద్ధానికొచ్చి వీరోచితంగా పోరాడాడు. చివరకు ఆ పరాశక్తి చేతుల్లో హతమయ్యాడు. దాంతో లోకాలన్నీ ఆనందించాయి.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు







  • ===========================================
Visit My Website - > Dr.Seshagirirao ->-