Tuesday, September 13, 2011

మొగ్గ దోసిళ్ళ నోము ,Mogga Dosilla Nomu



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -మొగ్గ దోసిళ్ళ నోము ,Mogga Dosilla Nomu - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


కథ
ఒక బ్రాహ్మణ బాలిక సవతి పోరునూ, దరిద్రాన్నీ భరించలేక... ప్రతిరోjజూ శివలింగం ముందు దు:ఖిస్తుండగా, ఒకనాడు శివదేవుడు ప్రత్యక్షమై "అమ్మాయి! గతంలో నువ్వు మొగ్గ దోసిళ్ళ నోము నోచి ఉల్లంఘించడం వల్లనే నీకీ కష్టం వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆ నోమును యాధాప్రకారం ఆచేరిస్తే, సవతి తల్లి పోరూ తప్పుతుంది. సర్వ దరిద్రాలూ తొలిగిపోతాయి ” అని చెప్పాడు.

అది విన్న బాలిక ఆ విధంగానే చేయగా ఏడాది గడిచేసరికి సవతి తల్లికి మనసు మారి, ఆ కన్యను ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. అంతలోనే సంపన్నుల యింటి సంబంధం వచ్చి, ఆమెకు ధవంతుడైన యువకునితో వివాహం జరిగి దరిద్రమూ తొలగిపోయింది.

విధానం
ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఒక పళ్ళెంలో పసుపు పోసి, దానిమీద మూడు దోసిళ్ళ నీరు పోసి, దానిని వంటికి రాసుకుని శివుణ్ణి స్మరించాలి. పై కథ చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఏడాది తరువాత ఉద్యాపన చేయాలి.

ఉద్యాపనం
మూడు దోసిళ్ళ పువ్వులూ, మూడు దోసిళ్ళ పగడాలు, మూడు దోసేళ్ళముత్యాలూ తీసుకుని శివాలయానికి వెళ్లి , శివుడికి వాటిని ధారబోసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి.

  • ==================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: