Sunday, August 14, 2011

ఆత్మ-మృత్యువుపై యుద్ధం , Soul-battle against death.అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -ఆత్మ-మృత్యువుపై యుద్ధం - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


మనిషి అమరత్వాన్ని సాధించగలడా?..మృత్యువును జయించగలడా? చిరంజీవిగా ఎల్లకాలం ఈ పుడమిపై వర్థిల్లగలడా?

జమదగ్ని కుమారుడు పరశురాముడు, బలిచక్రవర్తి, విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్ధామ, ద్రోణాచార్యుని బావమరిది కృపాచార్య వంటివారు చిరంజీవులని, ఈ భూమి ఉన్నంతవరకు వారు ఊపిరితోనే ఉంటారని చెబుతున్న మన పురాణాలు ఎంతవరకు నిజం? అసలు అమరుడై జీవించాలనే కోరిక మనిషికి ఎలా కలిగింది? అది ఎంతవరకు సాధ్యం? అలా మనుషులను అమరులుగా మార్చేందుకు ఎక్కడైనా పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిచిగాన్‌లోగల క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్2.

క్రయోనిక్స్ అంటే?
మరణించినవారి శరీరాలను భద్రపరిచే ప్రక్రియనే క్రయోనిక్ అంటారు. 200 డిగ్రీల కంటే తక్కువ శీతల స్థితిలో ఆ శరీరాలను భద్రపరిచి మరణం ఎందుకు సంభవించిందనే విషయంపై పరిశోధనలు జరుగుతాయి అక్కడ. భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి జరిగి 3్ఫ్యచర్ సైన్స్2ద్వారా మరణించిన వ్యక్తులను తిరిగి తికించేందుకు అవకాశం కలగవచ్చనే ఆశాభావంతో క్రయోనిక్ శాస్తవ్రేత్తలు అలుపెరుగక పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మిలియనీర్లు మరణం తర్వాత జీవితంకోసం తమ శరీరాలను క్రయోనిక్ ఇనిస్టిట్యూట్‌కు అప్పగించాలని తమ వారసులను కోరి తనువులు చాలించారు. అలాంటి వారిలో అనేకమంది మృత శరీరాలు ప్రస్తుతం క్రయోనిక్ ఇనిస్టిట్యూట్‌లో భద్రపరచబడ్డాయి. వాటిపై ఎడతెగని పరిశోధనలు జరుగుతున్నాయి. మరణించిన వారి శరీరాలపై పరిశోధనలుచేసే క్రయోనిక్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ఆ మరణాలు ఎందుకు సంభవించాయనే విషయం తెలుసుకోవడానికి, మృత్యువుపై గెలుపుకోసం పరిశోధించే క్రమంలో మానవ ఆర్గాన్స్, టిష్యూస్, సెల్స్, సెల్యులర్ కాంపోనెంట్స్‌పై దృష్టి సారించి అన్వేషణ సాగిస్తున్నారు. మరణించిన వారిని తిరిగి బతికించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న క్రయోనిసిస్టులు అన్ని రుగ్మతలు తప్పకుండా తగ్గించబడతాయని అంటున్నారు. ఏజింగ్... వృద్ధాప్యాన్ని కూడా త్వరలోనే తాము జయిస్తామని, అప్పుడు ఎవరూ ముసలివారు కారని బల్లగుద్దిమరీ చెబుతున్నారు. తమ పరిశోధనలు ఫలించి త్వరలోనే మానవులు ఎప్పటికీ యూత్‌గాను, హెల్దీగాను ఉండిపోయేలా మందులు రూపొందించేరోజు ఎంతో దూరంలో లేదని వారంటున్నారు. అయితే మరణించిన వారిని బతికించాలని చూస్తున్న క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యుల చర్యల పట్ల చాలామంది పరిశోధకులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన మనిషి తిరిగి బతకడం అనేది అసంభవమని అంటున్నారు. దీనిపై క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు మాట్లాడుతూ 1885లో లార్డ్ కెల్విన్ అనే శాస్తక్రారుడు ఫ్లయింగ్ మెషీన్ల రూపకల్పన అనేది అసంభవమని అన్నాడని, అయితే ఆయన అభిప్రాయం పొరపాటని నిరూపిస్తూ ఫ్లయింగ్ మెషీన్లు చక్కగా రూపొంది విమానాలు తయారుచేయబడ్డాయని, మనుషులు వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఖండాంతరాల మధ్య హాయిగా ప్రయాణిస్తున్నారని అంటున్నారు. అలాగే 3ప్యూచర్ సైన్స్2 మరణించిన వారిని కూడా బతికిస్తుందని వారంటున్నారు. జీవులను పోలిన జీవులను మానవ ప్రయత్నం ద్వారా రూపొందించే 3క్లోనింగ్2 ప్రక్రియ కూడా సాధ్యంకాదని ఎంతోమంది అన్నారని, అయితే నేడు క్లోనింగ్ కూడా అందుబాటులోకి వచ్చిందని వారు చెబుతున్నారు.

క్రయోనిక్స్ ఎటువంటి వారిని స్వీకరిస్తారు?
క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌లో భద్రపరిచి భవిష్యత్తు కాలంలో ప్రాణం పోసేందుకు క్రయోనిక్స్ స్వీకరించే మృత్యు శరీరాలకు కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. మరణం తథ్యమని తేలి మరికొన్ని క్షణాల్లో గుండె ఆగిపోయే వాళ్లను, మనిషి మరణించినా... మెదడు ఇంకా మరణించకుండా ఉండే వ్యక్తులను, మనిషి మరణించినా సెల్స్, మెదడు అప్పటికి ఇంకా మరణించకుండా ఉండే వారినే క్రయోనిక్స్ భవిష్యత్‌లో తిరిగి బతికించేందుకు స్వీకరిస్తారు. మరణించి చాలా సమయం అయితే శరీరంలోని సెల్స్, మెదడు ఇక పనిచేయవని, రక్తం గడ్డకట్టుకుపోతుంది కనుక అటువంటి వారిని తాము స్వీకరించినా ప్రయోజనం ఉండదని వారంటున్నారు.
అన్నీ బాగున్నాయని క్రయోనిస్టులు భావిస్తే అలా సేకరించిన శవంలోని బాడీ వాటర్ మొత్తాన్ని వారు ముందు తొలగిస్తారు. అప్పుడు ఆ శవంలోకి వారు 3క్రియోప్రొటెక్టెంట్స్2 అనబడే ద్రవాన్ని ఎక్కిస్తారు. దీంతో
రక్తనాళాలు చైతన్యాన్ని కోల్పోకుండా బతికి ఉన్న మనిషికి ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడైతే మరణించిన మనిషి శరీరంలోకి క్రిప్టోప్రొటెక్టెన్స్ ఎక్కిస్తారో అప్పటినుంచి అతిశీతలంవల్ల శవం తాలూకు టిష్యూలు ఎలాంటి డామేజ్ లేకుండా ఉండగలుగుతాయి. క్రిప్టోప్రొటెక్టెన్స్ వల్ల బతికి ఉన్న మనిషి ఎలా ఉంటాడో అలాగే మరణించిన వారు కూడా ఉంటారని, వారిపై పరిశోధనలు కొనసాగుతాయని క్రయోనిక్స్ చెబుతున్నారు.

సోల్!
ఆత్మ ఉంటుందని కొందరు... ఉండదని కొందరు వాదిస్తున్న సమయంలో క్రయోనిక్స్ మాత్రం ఆత్మ అనేది కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. హ్యూమన్ ఎంబ్రియోజే మనుషుల తాలూకు ఆత్మ అని, దానిని లిక్విడ్ నైట్రోజన్‌లో భద్రపరిస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందని వారంటున్నారు. ఫ్యూచర్ సైన్స్ అభివృద్ధి సాధించిన తర్వాత మరణించిన వారిపై పరిశోధనలవల్ల వారెందుకు మరణించినదీ, అందుకు వాడవలసిన మందులను కనిపెట్టి తగిన రిపేర్‌తో స్వస్థత చేకూర్చిన తర్వాత తిరిగి వారి శరీరాల్లోకి హ్యూమన్ ఎంబ్రియోజ్‌ను చేరిస్తే వారు చక్కగా బతికి నిద్రనుంచి మేల్కొన్నట్టు మేల్కొంటారని అంటున్నారు.

క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్-ఎప్పుడు మొదలయింది?
1976లో రాబర్ట్ ఎట్టింగర్ అనే పరిశోధకుడు క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించాడు. ఎట్టింగర్‌నే 3్ఫదర్ ఆఫ్ క్రయోనిక్స్2 అంటారు. మిచిగాన్‌లోని క్లింటన్ టౌన్‌లో ఉన్న క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ (సిఐ)లో ఎంతోమంది తమ పేర్లను ఇప్పటికే నమోదుచేసుకున్నారు. తాము అమితంగా ఇష్టపడేవారి పేర్లను నమోదుచేసి ఉంచారు. వారు చివరి క్షణంలో క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులకు సమాచారం
అందజేస్తే వీరెళతారు. క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఎవరైతే చేరాలని అనుకుంటున్నారో వారి మృత శరీరాన్ని తీసుకొచ్చి భద్రపరిచి తిరిగి బతికే అవకాశవం కల్పించేందుకు కృషిచేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ అనేది ఒక హాస్పిటల్ వంటిది. ఇది ప్రభుత్వ అనుమతితో నడుస్తోంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, వలంటీర్లతో ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో విస్తరించి ఉంది. ఇది నాన్‌ప్రాఫిటబుల్ సంస్థ. ఇది ప్రతి రెండు మాసాలకు ఒకసారి 3లాంగ్‌లైఫ్2 పేరుతో ఒక మ్యాగజైన్‌ను కూడా ప్రచురిస్తోంది. ఇందులో క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ సాధించిన ప్రగతి, ఫలితాలు ఇస్తున్న పరిశోధనల వివరాలు, కొత్త సభ్యుల వివరాల వంటివి ఉంటాయి. క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌కు చేర్చబడ్డ మృత శరీరాలను వారు ఇక్కడుండే కంప్యూటర్ కంట్రోల్‌డ్ లిక్విడ్ నైట్రోజన్ కూలింగ్ బాక్సులో భద్రపరుస్తారు. తర్వాత ఆ బాక్స్ వాక్యూమ్ ఛాంబర్‌కు తరలించబడుతుంది. అక్కడుంటే ఆ శరీరం ఏ స్థితిలో అయితే అక్కడికి చేర్చబడిందో అదే స్థితిలో వందల సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. అప్పుడు దానిపై ఎనే్నళ్లయినా పరిశోధనలు చేయవచ్చు. ఎంత కాలానికైనా దానిని తిరిగి బతికించే వీలు ఉంటుందని క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు, పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం వంద వరకు అక్కడ శవాలు భద్రపరచబడ్డాయి.

ఇక్కడ ఎవరు చేరవచ్చు?
క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌లో చేరి తిరిగి ప్రాణం పోసుకోవాలని కోరుకునేవారు ముందుగా మెంబర్‌షిప్ తీసుకోవాలి. అందుకుగాను అటువంటివారు గానీ, వారి తరఫువారు గానీ 28,000 డాలర్లు ముందుగా
చెల్లించాలి. తర్వాత ఏడాదికి 195 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మరణంపై మనిషి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇప్పటికే ఎంతోమంది శ్రీమంతులు క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్‌కు పెద్దఎత్తున విరాళాలు పంపడంవల్ల ఈ ఇనిస్టిట్యూట్ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తేలిగ్గా నడుస్తోందని, మానవులందరి తరఫున తాము మృత్యువుపై యుద్ధం చేస్తున్నామని క్రయోనిక్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు, శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి త్వరలోనే వారు మృత్యువుపై విజయం సాధించాలని, మనుషులకు అమరత్వాన్ని ఆపాదించగలగాలని కోరుకుందాం.

Source :
- బాబు-- Andhrabhoomi--August 14th, 2011 Sunday magazine.

  • =================================
Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments: