శ్రీమన్నారాయణుని దశావతారాల గురించి అందరికీ తెలుసు... కానీ పార్వతీపరమేశ్వరుల దశావతాతాల గురించి చలా మంది వినివుండరు . అవేమిటో చదవండి ->
అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.
ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశ అయిన పుత్రుడు యేసు రూపములో అవతరించెనని క్రైస్తవులు భావిస్తారు.
ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం. ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం. ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకధల ప్రధాన ఇతివృత్తం.
అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.
- ప్రధమావతారము : మాహాకాళుడు , ఈయన అర్ధాంగి " మాహాకాళి" వీరిరువురూ భక్తులకు ముక్తినిచ్చే దైవాలు
- ద్వితీయావతారము : తారకావతారము , " తారకాదేవి " ఈయన అర్ధాంగి . సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు .
- తృతీయావతారము : బాలభువనేశ్వరావతారము - సహచరి " బాలభువనేశ్వరీ దేవి " సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు .
- చతుర్ధావతారము : షోడశ విశ్వేశ్వరుడు - " షోడశ విద్యేశ్వరి " ఈయన భార్య . భకులకు సర్వసుఖాలు ఇస్తారు .
- పంచమ అవతారము : భైరవ అవతారము - భార్య " భైరవి " ఉపాసనాపరులకు కోరికలన్ని ఇచ్చే దైవము భైరవుడు .
- ఆరవ అవతారము : భిన్నమస్త -- భిన్నమస్తకి ఈయం పత్నీ.
- ఏడవ అవతారము : ధూమవంతుడు -- ధూమవతి ఈయన శ్రీమతి .
- ఎనిమిదవ అవతారము : బగళాముఖుడు -- బగళాముఖి ఈయన భార్య .. ఈమెకు మరో పేరు బహానంద .
- తొ్మ్మిదవ అవతారము : మాతంగుడు -- మాతంగి ఈయన భార్య .
- దశావతారము : కమలుడు -- కమల ఇతని అర్ధాంగి .
- ===============================
1 comment:
sir chala baga chepparu sivuni avatharalu kosam avathralu ok mari vatiki gala karnalu emiti anedhy mari viavarinchagalarani prardahna...
Post a Comment