Friday, December 17, 2010

పంచ కేదారాలు , Pancha kedArAlu




పంచ కేదారాలు

కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరవాత పాడవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్టితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణం లో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు.
అవి వరసగా
  • 1.కేదారినాధ్,
  • 2.తుంగ నాధ్,
  • 3.రుద్ర నాధ్,
  • 4.మధ్య మహేశ్వర్,
  • 5.కల్పేశ్వర్.
నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. ఖాట్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి.

కేదారినాధ్

ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాడవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లొంగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిదియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు.

తుంగనాధ్
పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శిటా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు.

రుద్రనాధ్
పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనది గా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

మధ్య మహేశ్వర్
పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.

కల్పనాధ్
పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భకులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.


  • ===================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: