భగవానుడు గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, సాధువులను, వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములను ధరించుచుండెను. భగవానుడు ఏ రూపమును ధరించిననూ ఆ రూపము యొక్క గుణ దోషములు తనకు అంటవు.
భగవంతుడు ప్రాక్వుత గుణయుక్తులు, ఉచ్ఛనీచాలు జీవుల మధ్య అవతరించినను తాను గుణరహితుడయ్యే అని శుక మహర్షి తెలుపుతున్నాడు.
నైమితిక ప్రళయము సంభవించినది. భూమి మొదలగు లోకములన్నియు జలమయమైనవి. ఆ సమయంలో బ్రహ్మదేవునికి నిద్రవచ్చెను. ఆ సమయంలో ఆయన నిద్రించుచుండగా నోటి నుండి వేదములు జారిపడగా హయగ్రీవుడను రాక్షసుడు వేదములను అపహరించెను. అంతట జగదీశ్వరుడు, ప్రభువు అయిన శ్రీహరి ‘శఫరి’ అను ‘మత్స్య రూపము’ను ధరించి హయగ్రీవుని వద్ద నుండి వేదములను గ్రహించి బ్రహ్మదేవునికి ఇచ్చెను.
for full details -> see wikipedia Macchavataaram
- ===============================
No comments:
Post a Comment