Friday, October 29, 2010

Homam ,హోమము



హోమము : మనలోని మలినాన్ని ప్రకృతి సహజము గా తొలగించే విధానాలలో హోమము ఒక పద్దతి . హోమము - దైవప్రీతి, దైవానుగ్రహము, గ్రహశాంతి మొదలైన వాటికోసము అగ్ని లో మూలికలు, నెయ్యి హోమద్రవ్యాలు వేస్తూ చేసే క్రతువు. క్రతువంటే యజ్ఞము .

యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడము యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి"(వేసినవి) అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.

పంచభూతాలలో అగ్ని ఒకటి . ఇది ప్రకృతి సహజముగా లభించే శక్తి అయినా కాలక్రమేనా అగ్నిని రాజేయడం మనిషి కనుక్కునాడు . సుదూరములో ఉండే అగ్ని గోళాన్ని ఆరంభమునుండీ గమనించిన మానవుడు ఈ భూలోకాన్నంతా నడిపిస్తున్న ప్రత్యక్ష దైవము గా సూర్యభగవానుని కొలిచే సాంప్రదాయాన్ని ఆనాడే ఆరంభించాడు . గోళమైనా సూర్యుని ... తెలియక , అంతపాటి శాస్త్రవిజ్ఞానము లేక దేవునిగా కొలిచేడు ... ఆరాదించాడు . సూర్యోదము , సూర్యాస్తమయము రెండూ ఎన్నిసార్లు చూసినా తనివితీరని అపురూప దృశ్యాలే ... ఆ మధురమైన దృశ్యాన్ని తిలకిస్తూ తమ జీవితాలకు ఆధారంగా నిలుస్తున్న ఆ భగవంతునికి ఉదయం , సాయంత్రం సమయాల్లో నమస్కరించి దన్యవాదాలు తెలియజేయడం మానవుని కనీస ధర్మముగా భావించాడు . అలా ప్రారంభమయినదే సూర్యనమస్కార సంప్రదాయము . రెండుపూటలా ప్రతిరోజూ చేయడం శరీరానికి మంచి వ్యాయమము ఎంతో ఆరోగ్యదాయకము . ఏ రోగము దరిచేరదు .

సూర్యుని నుండి ఉష్ణము , కాంతి అందుకునే మానవునికి దానికి మూలమైన అగ్నిని అర్ధము చేసుకునేందుకు కొంచం సమయం పట్టినది . అడవులలో చెట్ల రాపిడికి పుట్టి అడవులనే దహించివేసి భీబత్సవాన్ని సృస్టించిన అగ్నిని చూసి భయపడి దానికి దేవతా స్థానము కల్పించి పూజించడం ప్రారంచాడు ... తన ఇంట వెలుగునిచ్చే దేవుడిగా ప్రార్ధనలు చేసి కొలువసాగాడు . ఇంటనే హోమాలను నిర్వహించడం మొదలుపెట్టేడు . హోమములో ఎటువంటి పుల్లలు వాడాలి .. వాటి ప్రయోజనం ఏవిటి అనేది కాలక్రమేనా అర్ధము చేసుకున్నాడు . ఆ విధంగా హోమము హిందూధర్మ శాస్త్రము లో ఒక సంస్కృతి ... సాంప్రదాయం గా మారినది .

హోమ సామగ్రి :
హోమము చేయడం అనేది చాలా సులభమే . వాడె వస్తువులు సులువుగా దొరికేవే .
  • పిరమిడ్ రూపములొ ఉండే ఒక రాగి పాత్ర ,
  • ఆవు పిడకలు ,
  • స్వచ్చమైన ఆవు నెయ్యి ,
  • పాలిష్ చెయ్యని బియ్యము (దంపుడు బియ్యము),
  • సూర్యోదయము , సూర్యాస్తమయము వచ్చునట్లు గా ఉన్న ప్రదేశము (చోటు),
  • ఎండు మామిడి పుల్లలు ,
  • కర్పూరము ,
  • పూజా సామగ్రి ,
  • తాటాకుల విసనకర్ర ,
  • ఔషద మొక్కలు , గంధం చెక్కలు , సువాసం ద్రవ్యాలు కొన్ని ,
హోమం లో రకాల్ని బట్టి మిగతా వస్తువులు వాడుతారు .

హోమ శక్తి : ఔషధ ఉపయోగాలు :
హోమము చేయడం ఛాందసవాదం గా కొంతమంది పరిగణిస్తారు . కాని వాస్తవానికి దానివలన కలిగే ఆరోగ్య నియంత్రణ , కాలుష్య నివారణా ప్రయోజనాలు ఎన్నో నిక్షిప్తంచేసి ఉన్నాయి . హోమము లో ఉన్నది అగ్ని శక్తి . ఆరోగ్యము కోసం నీటిని మరిగించడానికి అగ్నిశక్తి ని వాడుతాము .
  • హోమము చేయు చోటు లో వెలుతురుకి చుట్టు ప్రక్కలకు క్రిమికీటకాలు చేరవు .
  • హోమాగ్నితో వచ్చే వేడికి హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి .
  • హోమాగ్ని వేదికి కొన్ని హానికర రసాయనాలు మంచి గా మారుతాయి ,
  • మనసులో గూడుకట్టుకొన్న ఒత్తిడులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది ,
  • ప్రదక్షిణలు చేయడం ఒకరకమైన వ్యాయామము వలన ఉపయోగము ,
హోమము నుండి వెలువడే వేడి
  • చర్మాన్ని మెరుగుపరుస్తుంది ,
  • రక్తాన్ని శుబ్రపరుస్తుంది ,
  • మెదడు కణాలకు కొత్త శక్తినిస్తుంది ,
  • శరీరములో ఉన్న రోగకారక సూక్ష్మజీవులను సంహరిస్తుంది ,
  • హోమము నుండి వచ్చే వాయులులు పీల్చడం వలన ఊపిరితిత్తులు సుద్ది అవుతాయి ,

హోమము వలన కలిగే నష్టాలు:
  • మితిమీరిన పొగ వలన కలిగే అనారోగ్యము ... ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ప్రాణ సంకటమే ,
  • పొగవలన కళ్ళు మండటము , ఎర్రబారిపోవడమూ జరుగును ,
  • ఎక్కువ వేడి తగిలి చర్మము కందిపోవడము ,
  • నెయ్యి ,పేడ , బూడిద లో కూదినటువంది తీర్దాలు త్రాగడం వలం ఎసిడిటీ ప్రోబ్లమ్స్ రావడము ,
  • సమయము వృదా చేయడము ,
మన:సంతృప్తి కి మించిన శక్తి , మందు మరేదీ లేదు . ఆత్యాద్మిక సంతృప్తి ఆరోగ్యప్రదాయిని . ఈ ఆచార వ్యవహారాలు ఇలాగే జరగనీ .. జరగడం అవసరము ఆరోగ్యకరమైన మానవాలికి .
ఒరిగేదేమీ లేక పోయినా మన పురాతన ఆచార సాంప్రదాయాలను తరువాత తరాలవారికి కనుమరుగయిఫోకుండా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూఉండాలి . అది మన కనీష ధర్మము .
  • ================================================
Visit My Website - > Dr.Seshagirirao

Sunday, October 24, 2010

Ramleela , రామ్‌లీలా





రామ్‌లీలా దశకంఠుడి హతమే ... దస్‌-హరా

రామ్‌లీలా రామకథను ప్రదర్శించే సంగీత నాటకకరూపకం. శరన్నవరాత్రుల్లో ఉత్తరభారతమంతటా ఈ రూపకాన్ని ప్రదర్శిస్తారు. రామ్‌లీలాకు 16వ శతాబ్దపు అవధి భాషలో ఉన్న రామాయణం, రామచరిత మానస్‌ ఆధారం. రామకథ జనజీవన స్రవంతిలోకి నైతికవిలువల్ని అంతర్వాహినిగా ప్రవహింపచేస్తుంది.జగన్మాత యుగయుగాన వివిధ రూపాల్లో దుష్టుల్ని శిక్షించి,శిష్టుల్ని కాపాడింది.రామాయణంలో రాముడు దశకంఠుడిని అంతమొందించి సీతమ్మకు విముక్తి ప్రసాదిస్తాడు.అమ్మవారి ఆరాధనోత్సవాల్లో దుష్ట సంహార ఘట్టాన్ని సామాన్య ప్రజానీకానికి తెలియజేయడం ఎంతో ప్రాముఖ్యమున్న అంశం.దేశవిదేశాల్లో ప్రదర్శిస్తున్న రామ్‌లీలా గురించి ఓ కథనం...

దానవుడైన రావణుడిపై దేవదేవుడి అవతారమైన శ్రీరాముడి విజయం వేడుకలే దసరా అని ప్రతీతి.భారతీయ పవిత్ర కావ్యం రామాయణేతిహాసం... సత్యయుగంలో శ్రీరామావతారం శ్రీమహావిష్ణువు ఏడవ అవతారంగా పేర్కొన్నది. శ్రీరాముడు వేల సంవత్సరాల క్రితం అయోధ్యలో జన్మించాడట. ఈ అయోధ్య నేటి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. పరమాత్మ అవతారమైన రాముడు పిత్రువాక్యపరిపాలనకు కట్టుబడి 14 ఏళ్ళు వనవాసం చేశాడు. భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో అరణ్యవాసంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు.ఇందులో ప్రధాన ఘట్టమే సీతాపహరణ. లక్ష్మణుడు, హనుమంతుడు, అశేష వానరసేనతో రాముడు దశకంఠుడితో యుద్ధం చేస్తాడు.
రావణుడిని ఓడించి సీతను రావణుడి చెరనుండి విడిపించాడు. కనుక దసరాను ‘దస్‌-హరా’ అని కూడా అంటారు. దస్‌-హరా అనగా... పదితలల రావణడి అంతంగా చెప్పుకోవచ్చు. రామకథను వివరించే రామ్‌లీలాను మహాముని తులసీదాస్‌ ప్రారంభించాడని భావిస్తారు. ఆయన రాసిన ‘రామచరితమానస్‌’ ఆధారంగానే ఈనాటికీ రామ్‌లీలాను ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమి వేడుకల్లో భాగంగా రామ్‌లీలా ప్రదర్శిస్తారు. రాముడి జన్మదినమైన శ్రీరామనవమినాడు కూడా ప్రదర్శిస్తారు. రామచరితమానస్‌ కావ్య కర్త మహాముని తులసీదాసు శిష్యుల్లో ఒకడైన మేఘ భగత్‌ క్రీ.శ1625లో రామ్‌లీలా ప్రదర్శనలు న్విహించాడని భావించడానికి చారిత్రక ఆధారాలున్నాయి.

అంతకు పూర్వమే ఈ ప్రదర్శనలు జరిగాయనడానిి కూడా ఆధారాలు లేకపోలేదు. క్రీ.శ. 1200- 1500మధ్య మొదటిసారి రామ్‌లీలా ప్రదర్శించినట్టు కొందరు విద్వాంసులు భావిస్తున్నారు. మొగలాయి చక్రవర్తి అక్బర్‌ రామ్‌లీలా ప్రదర్శన తిలకించినట్లు కొందరంటారు. 16వ శతాబ్దంలో మహాముని చైతన్య మహాప్రభు జీవిత చరిత్ర‘‘ చైతన్య చరితామృతం’’ రాసిన కృష్ణదాస్‌ కవిరాజ్‌ పూరీలో నిర్వహించిన నాటకంలో తను హనుమంతుడి పాత్ర పోషిస్తూ తన్మయత్వంలో ఓలలాడినట్లు ప్రస్తావించాడు. కనుక రామచరిత మానస్‌కు పూర్వమే రామాయణం నాటకాలు వేసేవారని రుజువవుతోంది.

సంస్కృతంలో ఉన్న వాల్మీకీ రామాయణానికి భిన్నంగా విశాల జనబాహుళ్యం మాట్లాడే వాడుకభాషైన ‘‘అవధి’’లో రాసిన తులిసీదాసు రామాయణం వచ్చిన తరువాతే ఉత్తరభారతంలో రామ్‌లీలా బహుళ ప్రచారంలోకి వచ్చిందని నిర్ధారించవచ్చు. అసలు రామ్‌లీలా ప్రదర్శనే ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. వివిధరకాల మతపమైన ఆచారాలు నిర్వహించేట్లు ప్రేరేపిస్తుంది. వేషభాషలు, ఆభరణాలు, మాస్కులు, తలపాగాలు మేకప్‌ అలంకరణల దృష్ట్యా రామలీలా సుసంపన్నమైన నాటక కళ కూడా.మంత్రవాద్యాలతో సంభాషణలశైలిలో ఈ ప్రదర్శన అట్టహాసంగా నిర్వహిస్తారు. స్థానిక జానపద గీతాలను పోలినవి రామ్‌లీలాలో ఉపయోగిస్తారు. రామ్‌లీలాలో పనిచేసే వృత్తిపరమైన బృందాన్ని ‘మండలి’ అని పిలుస్తారు.

ఉత్తర భారతంలో రావణుడిపై పరమాత్ముడైన శ్రీరామచంద్రుడి విజయోత్సవంగా చాలామంది ఈ ఉత్సవాన్ని జరుపుకుంటుంటారు. రావణుడిని రాముడు సంహరించే ఘట్టాన్ని జానపద నాటక రూపంలో ‘రామ్‌ లీలా’ ప్రదర్శిస్తారు. పరమాత్మ స్వరూపుడైన శ్రీరాముడు దశకంఠుడైన రావణాసురుడిని సంహరించడం ఒక క్రీడ, ఒక లీలే కదా! ప్రధానంగా భారతీయ సంప్రదాయబద్ధమైన, జానపద ఫక్కీలో ఉన్న పౌరాణిక నాటకం ఆరుబయట రాత్రి వేళ ప్రదర్శిస్తారు. దాదాపు నవరాత్రుల పొడుగునా ఉత్తర భారతీయులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. రామ్‌లీలా ప్రదర్శించే ప్రాంతాన్ని బారస్‌ అంటారు.
ఔత్సహికులైన నటులకు ఈ నాటకం ద్వారా తమ ప్రతిభాపాటవాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. దృశ్యాలు మారేప్పుడో, నాటకంలో ఉత్కంఠభరిత మలుపులొచ్చినపుడో తెరవెనుకనుంచి గాయకుడొకడు పాటలు పాడతాడు. నాటకంలో మధ్యమధ్యలో వచ్చే ఈ కథనాలు, గీతాలు సాధారణంగా గోస్వామి తులసీదాసు రామాయణం పై ఆధారమైనవి. అవధీ భాషలో ఉంటాయి. కానీ తరచూ ప్రేక్షకుల స్పందనను బట్టి భాష శైలి మారుతుంటాయి. సంగీతవాయిద్యాలకు అనుగుణంగా నాటకం సాగుతుంది.ఆరుబయట పండుగ వాతావరణం వుంటుంది. ఎలాంటి కట్టుదిట్టాలూ వుండవు. నాటకం నడుస్తుండగా ప్రేక్షకులు వ్యాఖ్యానాలు చేస్తూ ఈలలేస్తూ ఆనందోత్సాహాల్లో ఓలలాడుతారు.

పరమాత్మ రాముడు రావణుడిని సంహరించే ఘట్టాన్ని స్థానిక నటీనటులు ఎంతో రమణీయంగా ప్రదర్శిస్తారు. తరచూ ప్రేక్షకులు ఏ వర్గాలకు చెందిన వారో నటులూ వారిలో వారే అయివుంటారు.దశకంఠుడైన రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు ల పెద్దపెద్ద దిష్టిబొమ్మలను ఆరుబయట వుంచుతారు. వీటికి దూరంగా కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అదే రావణరాజ్యం లం... నేటి శ్రీలంక.రాముడు సీతను కాపాడే క్రమంలో ముఖ్య ఘట్టాలను రామాయణంలో వివరించినట్లు ప్రదర్శిస్తారు.చిన్న పిల్లలు వానర సైనికులుగా రామచంద్రుడిగా వానరసేనాధిపతి హనుమగా వేషాలు ధరిస్తారు.దిషిబొమ్మలను వాటివాటి స్థానాల్లో వుంచిన తరువాత స్థానిక నటీనటులు రాముడిగా సీతగా లక్ష్మణుడిగా వేషాల్లో వస్తారు. రాముడి వేషంలో వున్న నటుడు రావణుడి నాభిని గురిచూచి అగ్నిబాణం వేస్తాడు. ఆ నిప్పు క్రమంగా ఇతర బొమ్మలకు కూడా అంటుకుంటుంది.

దిష్టిబొమ్మలను పేలుడు పదర్థాలతో కుక్కుతారు. చెవులుతూట్లుపడేలా దిష్టిబొమ్మలు పేలుతుండడం చూచి ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడతారు. విజయోత్సాహాలతో ఉర్రూతలూగుతారు. ఆ తరువాత శ్రీరాముడు సీతాదేవిని రక్షించి తన రథంపై తీసుకుపోయే దృశ్యం వచ్చేసరికి కరతాళధ్వనులు మిన్నంటుతాయి. దిష్టిబొమ్మలు దగ్ధమవుతూ అక్కడ గుమిగూడిన వారు తమలో ఉన్న చెడును సంహరించుకోవాలన్న సందేశాన్నిస్తాయి. సుగుణాలను సదాచారాన్ని అమలు చేయాలని ప్రబోధిస్తాయి.చెడుకు రూపమైన రావణుడి సంహారం ఎప్పుడూ మన మనసుల్లో మెదులుతుండాలన్నదే ఇక్కడ ప్రధాన సందేశం. శక్తి, సామ్రాజ్యం రాక్షసత్వాన్ని రక్షించలేకపోయాయి.

తినుబండారాలు, బొమ్మలు ఎన్నో రకాల వినోదాలతో ఈ సందర్భంలో తిరునాళ్ళు జరుగుతుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. పల్లెప్రజలు దూర ప్రాంతాలకు సుదీర్ఘ ప్రయాణాలు చేసి మరీ రామ్‌లీలా తిలకిస్తారు. ఇతివృత్తం హిందూ సాంప్రదాయానికి సంబంధించి నదైనప్పటికీ... హిందూయేతరులను కూడా ఆకట్టుకుంటుంది. ప్రజలనుంచి సేకరించిన నిధులతో ఈ నాటకం ప్రదర్శిస్తారు.రామ్‌లీలా సంఘాలు వెలుస్తాయి. హిందువులున్న అన్ని దేశాల్లో రామ్‌లీలా ప్రదర్శిస్తారు.ఉత్తర మధ్య భారతంలోనే కాక ఇండియా బయట భారత ఉపఖండంలోని నేపాల్‌, పాకిస్తాన్‌, ఫిజి, మారిషస్‌, దక్షిణాఫ్రికా, గయానా, సూరినామ్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, గ్రేట్‌ బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రామ్‌లీలా ప్రదర్శనలు నిర్వహిస్తారు.

ప్రపంచమంతటా వివిధ రీతుల్లో ప్రదర్శితమైనందువల్ల రామ్‌లీలా విశ్వ ఖ్యాతినార్జించుకుంది. భారతీయ సంతతి నివసించే ఆఫ్రికా,అనేక ఆగ్నేయాసి యా దేశాల్లో విశేష ప్రజాదరణ పొందింది. 2005లో యునెస్కో మానవజాతి మౌఖిక వారసత్వ సంపదలో రామ్‌లీలా ఒక కళాఖండం అని ప్రకటించింది. ఆ తరువాత యునెస్కో కోసం భారత ప్రభుత్వం ఐ.జి.ఎన్‌.సి.ఎ (ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌) సంయుక్తంగా ‘‘రామ్‌లీలా-ది ట్రెడిషనల్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఆఫ్‌ రామాయణ’’ రెండు గంటల నిడివి ఉన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాయి.‘‘రామ్‌నగర్‌ రామలీలా’’, అవధ్‌,బ్రజ్‌, మధుబని,అయోధ్య రామ్‌లీలా సంప్రదాయాలపై ఈ లఘుచిత్రా న్ని రూపొందించారు.

లక్నోకు 20 కిలోమీటర్ల దూరాన బక్షి కా తాలాబ్‌ వద్ద 1972 నుంచీ మరో వినూత్న పంథా రామ్‌లీలా ప్రదర్శిస్తున్నారు. ఈ కొత్త తరహా రామ్‌లీలాలో రాముడు,లక్ష్మణుడు,హనుమంతుడి వంటి ప్రముఖ పాత్రలు ముస్లిం యువకులు ధరిస్తున్నారు. మత కలహాలు చెలరేగే ప్రాంతంలో ఇదొక సామరస్య ధోరణిగా పేర్కొనచ్చు. నాలుగు రోజుల రామ్‌లీలా దసరా రోజున మొదలవుతుంది. లక్నో ఆకాశవాణి ఈ రూపకాన్ని ‘‘ఉస్‌ గావ్‌ఁ కి రామ్‌లీలా’’ రేడియో నాటకంగా తయారు చేసింది.2000 సంవత్సరంలో మత సామరస్య పురస్కారం గెలుచుకుంది.

రామ్‌లీలా ... విభిన్న ధోరణులు
రామ్‌లీలాను ఒక్కో ప్రాంతంలో ఒక్కో శైలిలో ప్రదర్శిస్త్నురున ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే రామ్‌నగర్‌లో వారణాసిలో వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. అయోధ్య, రామ్‌నగర్‌,వారణాసి,బృందావన్‌,అల్మోరా, సత్నా, మధుబని రామ్‌లీలా ప్రదర్శనలు ప్రామాణికమైనవని 2008 యునెస్కో నివేదిక ప్రకటిస్తోంది. కుమాఁవ్‌ శైలి రామ్‌లీలా ఉదయ్‌ శంకర్‌ రూపొందించాడు. సంగీత నాటక ధోరణిలో సాగే ఈ శైలిని మోహన్‌ ఉప్రేతి, బ్రిజేంద్ర లాల్‌ షా కొనసాగిస్తున్నారు.

చిత్రకూట్‌లో 5 రోజుల పాటు జరిగే రామ్‌లీలాది ఓ అరుదైన శైలి. ఇందులో రాముడు- భరతుల కలయిక ఇతివృత్తం ప్రధాన ఘట్టం . ఆగ్రాకు చెందిన రామ్‌ భరత్‌ రామ్‌లీలాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన సంప్రదాయం. ఢిల్లీ నగరమంతటా ఎన్నో రామ్‌లీలా ప్రదర్శనలు నిర్వహిస్తారు. వీటిలో చరిత్రాత్మక ఎర్రకోట ఆరుబయట రామ్‌లీలా గ్రౌండ్స్‌లో ప్రదర్శించేది పాతకాలం నాటిది. మొగలాయి చక్రవర్తి బహదుర్‌ షా జఫర్‌ ఈ రామ్‌లీలాను ప్రారంభించాడు. మొట్టమొదటిసారి లవ్‌-కుశ్‌ రామ్‌లీలా కమిటీ నిర్వహించిన రామ్‌లీలా వేడుకలను 100దేశాల్లో టెలీవిషన్‌ ద్వారా టెలీకాస్ట్‌ చేసింది.

  • =========================================
Visit My Website - > Dr.Seshagirirao

Saturday, October 23, 2010

జగన్మాత ఆవిర్భావం , Birth of Durgamata




శిష్టజన రక్షణి దుర్గామాత

సుమారు అన్ని వతారాలు దానవ సంహారము కొరకే అన్నట్లు కథలు ఉన్నాయి . తపస్సు చేసిన వారికి ... బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు వరాలివ్వడము ముందు వెనక ఆలోచించక -- వాటి ప్రభావమువలన దేవదానవ సోదర యుద్ధము ... తత్ఫలితము సురులు అతీత శక్తులుగా అవతారాలు ఎత్తడమే మన పురాణాల కథలు అన్నీ. ఆకోవకు చెందినదే దుర్గామాత అవతారము :

చిద్రూపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలు ఎత్తవలసి వచ్చింది. దుర్గగా పిలవబడటానికి ముందు ‘శతాక్షి’ పేరుతో స్తుతింపబడింది. హిరణ్యాక్షుని వంశంలో ‘రురుడు’ అనే రాక్షసునికి దుర్గముడు అనే కొడుకు పుట్టాడు. దుష్టుల హృదయాలు దురాలోచనలతోనే నిండి ఉంటాయి కదా! వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత, గర్తింపు, ఏదో సాధించాలనే తపన ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఎంత వక్రమార్గమైనా, ఎంత దుర్మార్గంతో నిండినదైనా మానరు. రాక్షసాంశతో పుట్టిన ఈ దుర్గముడికి వేదాలు దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. వాటిని అపహరిస్తే దేవతల బలం తగ్గుతుందని అతని ఆలోచన. వేదాలను పొందాలంటే ఏం చెయ్యాలి? అని ఆలోచించాడు. బ్రహ్మ ద్వారా పొందటం తేలిక అని నిర్ణయించుకున్నాడు.

బ్రహ్మను గూర్చి హిమాలయాల్లో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అతని ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దుర్గముడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ‘‘దుర్గమా! ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు బ్రహ్మ, ‘‘వేదాలు, వేదమంత్రాలు నా ఆధీనంలో ఉండాలి’’ అన్నాడు దుర్గముడు. బ్రహ్మ ‘‘తథాస్తు’’ అన్నాడు. ఇక ఏముంది! వేదాలు, వేద మంత్రాలు అపాత్రుని ఆధీనంలోకి వచ్చాయి. భూమిపైన రుషులు స్నాన, సంధ్య, జపాదులు మరిచిపోయారు. యజ్ఞయాగాదులను మానేశారు. దేవతలకు హవిర్భాగాలు చెందక వాళ్ళు శక్తి హీనులయ్యారు. ఆదను చూసుకొని దుర్గముడు అమరావతిపై దండెత్తాడు. మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైనా దండెత్తాడు. దేవతలు వాడి ధాటికి తట్టుకోలేక పారిపోయి కొండ గుహల్లో తలదాచుకున్నారు.జగజ్జననిని ప్రార్థిస్తూ జీవించారు.

అదిశక్తిని, ఆ శ్రీలత కల్పవల్లిని ఆదరించమని అనేక విధాల ప్రార్థించారు, ప్రాధేయపడ్డారు. జగదంబ కరుణించి వారి ముందు ప్రత్యక్షమయ్యింది.

చైత్రమాసం, నవమి, భృగువాసరాన దేవతల ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి నాలుగు వైపులా నాలుగు వేదాలూ స్తుతించాయి. కోటి సూర్య ప్రకాశంగా ఉండి, కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరజిమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణకాంతులను వెదజల్లుతోంది. పైన గానీ ప్రక్కన గానీ మధ్య లో గానీ పల్చబారలేదు. ఆద్యంతాలు లేవు. కరచరణాద్యవయవాలు లేవు. స్ర్తీ రూపం కాదు. పురుషరూపం కాదు. ఉభయమూ కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసకబడ్డాయి. కళ్ళు నులుముకుని, ధైర్యం తెచ్చుకుని తేరిపార చూశారు.

అప్పటికి ఆ దివ్య తేజస్సు స్ర్తీ మూర్తిగా రూపు ధరించింది. రాశీభూత సౌందర్యం. తామర మొగ్గలను పరిహసిస్తున్న పీనకుచ ద్వంద్వం. చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనులు (మేఖల), మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాశులు పొదిగిన కంఠపట్టిక. చిన్న మొగలిరేకును ముడుచుకున్న కొప్పు. విశా లమైన కటిప్రదేశం. పొట్టమీద సన్నని నూగారు. కర్పూర తాంబూలంతో ఎరుపెక్కి, సువాస నలు విరజిమ్ముతున్న నోరు.

మెరిసిపోతున్న బంగారు లోలాకులతో తళకులీనుతున్న నున్నని చెక్కిళ్ళు. అష్టమినాటి చంద్రరేఖలాంటి నుదురు. దట్టమైన కనుబొమ్మలు. ఎర్ర కలువల్లాంట నేత్రాలు. కొనదేరిన ఎత్తయిన ముక్కు, మధురాధరం. మల్లె మొగ్గల్లాంటి పలువరుస, మెడలో ముత్యాల దండలు. రత్నకిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ. జడలో మల్లికామాలతీ పుష్పాల దండ. నుదుట మూడవ కన్నులా ఎర్రని కుంకుమ బొట్టు. పాశాంకుశ వరదాభయహ స్తాలు. ఎర్రని చీరకట్టుకుని దానిమ్మపువ్వు రంగులో ధగధగలాడుతున్న జగన్మాత... సర్వ శృంగారవేషాఢ్య, సర్వదేవనమస్క్టృత, సర్వాశాపూరిక సర్వమత సర్వమోహినీ ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది.

దేవతాకృత దేవీస్తుతి...
జగన్మాత రూపం దర్శించిన దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనందబాష్పాలు అడ్డుపడి చూడలేకపోతు న్నారు. కొంతసేపటికి తేరుకుని మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని జగదంబికను స్తుతించారు.

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్‌
తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషూ జుష్టాం
ఓం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే! ఓం సుతరసి తరసే నమః
దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి
సానో మంత్రేషమూర్జం దుహానాం ధేనుర్వాగస్మానుపసుష్టూతైతు
కాళరాత్రీ! బ్రహ్మసుతా! వైష్ణవీ! స్కందజననీ! సరస్వతీ! అదితీ! దక్షదుహితా! పావనా! శివా! నమోనమః, మహాలక్ష్మీ! సర్వశక్తి! నిన్ను తెలు సుకుంటున్నాం, మమ్మల్ని నడిపించు. విరాట్‌స్వరూపిణీ! సూత్రాత్మమూర్తి! అవ్యాకృతరూపిణీ! శ్రీబ్రహ్మమూర్తి! నమోనమః
మహాలక్షై్మచ విద్మహే సర్వశక్యై చ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్‌

దేవీ! నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యమైపోతుంది. తెలుసుకోక పోతే రజ్జు సర్పభ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది. చిదేకస్వరూపిణీ! అఖండానంద రూపా! వేదతాత్పర్యభూమికా! పంచకోశా తిక్తా! అవస్తాత్రయసాక్షిణీ! త్వంపదలక్ష్యార్థా! ప్రత్యగాత్మ స్వరూపిణీ! ప్రణవరూపా!హ్రీంకారమూర్తీ! నానామంత్రాత్మికా! కృపాసింధూ! నమోనమః.దేవతలు గద్గద స్వరాలతో చేసిన స్తుతులకు మహాదేవి సంతృప్తి చెందింది. మత్తకోకిల కంఠాన్ని సవరించి... ‘‘నేను భక్తులపాలిటి కల్పవృక్షాన్ని కదా! అడగండి ఏమి కావాలో నేనుండగా మీకు, నా భక్తులకు, దిగులు ఏమిటి? దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. దేవతలారా! తెలుసుకోండి, ఏమి కావాలో అడగండి’’ అని పలికింది.
వేదాలు తిరిగి మాకు వచ్చేలా అనుగ్రహించమన్నారు.వారందరికీి తన చేతుల్లో వున్న ఆహార పదార్థాలు శాకములు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అనాటి నుండి ‘శతాక్షి’, ‘శాకంబరి’ పేర్లతో విరాజిల్లుతోంది. వేగుల ద్వారా దుర్గముడికి ఈ సమాచారం మొత్తం తెలిసింది. అప్పుడు అతడు సేనా సమేతుడై హిమాలయాలు చేరుకున్నాడు. అక్కడ వున్న రుషులు, దేవతలను బాధించసాగాడు. వారిపై శస్త్రాస్త్రాలను వేసి బాధించాడు. వారు ‘‘మాతా! జననీ! రక్షించు!రక్షించు’’ అని అంటూ ‘శతాక్షి’ని వేడుకున్నారు.

దుర్గముడు దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. జగజ్జనని ‘భయపడకండని’ వారికి అభయమిచ్చింది. ఒక చక్రమును పైన ప్రయోగించి, అందరికీ గొడుగు అయ్యేలా చేసింది. అప్పుడు దుర్గముడు విడిచిన ఏ బాణమూ వారిమీద పడలేదు, వారిని బాధించలేదు. దుర్గముడికి, దేవికి భీకర సంగ్రామం జరిగింది.సూర్యమండలం బాణాల పంజరంలో మూసినట్లయింది. బాణాల రాపిడివల్ల అగ్ని పుట్టింది. ఆ ప్రాంతం విద్యుల్లతలా మిణుగురు పురుగులు తిరుగుతున్నట్లుగా అయ్యింది. అలా పది రోజులు ఆ సంగ్రామం కొనసాగింది. అందరూ చనిపోయినా దుర్గముడు ఒక్కడే మిగిలాడు. పదకొండవ రోజున దుర్గముడు శతాక్షీిదేవి రథానికి ముందు నిలిచి అస్త్రాలను ప్రయోగించటం మొదలు పెట్టాడు. రెండు జాముల యుద్ధం భయంకరంగా సాగింది.

శతాక్షి తీవ్రమైన పదిహేను అస్త్రాలను తీసింది. రెండు బాణాలతో దుర్గముడి కళ్ళను, నాలుగు శరాలతో గుర్రాలను, ఒక కోలతో జెండాను, వెండితో దుర్గముడి భుజాలను, ఒక శరంతో సారథిని పడగొట్టింది.నిప్పులు కురుస్తున్నట్లు వున్న వాడియైన చూపులతో ఐదు బాణాలను దుర్గమునిపై వేసింది.ఆ ధాటికి తట్టుకోలేక దుర్గముడు తూలి, కూలి రక్తం కక్కుతూ శతాక్షి ముందు పడిపోయాడు. ఆ రాక్షసుని ముందు నిలుచున్న శతాక్షీ దేవి శరీరంలోకి ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది.ఆ రాక్షసుని తేజస్సు అమ్మలో లీనమయ్యింది. పగ, ద్వేషంతో... ఆ పరమేశ్వరి, జగన్మాతను ఎదిరించిన దుర్గముడు ముక్తి పొందాడు.
--------------------------------------

‘‘జగన్మాతా! ముల్లోకాల్లో నీకు తెలియని దంటూ ఏమైనా ఉన్నదా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయిం బవళ్ళు హింసిస్తున్నాడు. శివుడికి వారసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుడిని చంప గలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసుగదా! ఇంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మా కు దారి చూపించు. నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించే భక్తులం మేము. ప్రాణ రక్షణ కోసం నిన్ను ప్రార్ధిస్తున్నాం. ఇంతకన్నా మాకు కోరదగినది ఇంకొకటి లేదు’’ అని వేడుకున్నారు.

పార్వతిగా అవతరణ...
‘‘దేవతలారా! భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమ వంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపిం చండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనస్సులో నన్నే ధ్యానిస్తుంటాడు. మీలాగానే నా భక్తుడు. అతడి ఇంట్లో కూతు రుగా జన్మించడం నాకు చాలా ఆనందదా యకం’’ అని పలికింది. జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నా డు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్ళల్లో ఆనందబాష్పాలు. గొంతు జీరవోయింది. ‘‘హే సచ్చిత్‌ స్వరూపిణి! ధన్యోస్మి. అనుగ్రహ విశే షం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది.

లేక పోతే స్థాణువునూ, జడము నూ అయిన నేనే మిటి, నీకు తండ్రిని కావడ మేమిటి! మరో నూరు జన్మలు ఎత్తితే మాత్రం ఈ భాగ్యం నా కు లభిస్తుందా? నూరు అశ్వ మేధాలు చేసి నా, వేల సంవత్సరాలు తపస్సు చేసినా, ఇంత టి మహావైభవం నాకు దక్కేనా? ఆహా! జగన్మా త నాకు కన్నకూతురు అయ్యిం దంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరు గులేదు.అహో!హిమాలయుడా! ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ ప్రశంసలు కురి పిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటలున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మి ంచిందని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులెవరో ఈ పర్వతరూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదుగానీ ఇటువంటి దేవతలూ మహా తపస్వులూ నివసించడానికి నేను కారణమవు తున్నాను. ఇది చాలు ఈ జన్మకు అని మురిసి పోతున్న నాకు ఎంతటి గొప్పవరం ఇచ్చావు తల్లీ! ధన్యుణ్ణి, ధన్యుణ్ణి, ఇది నా అర్హత కాదు. కేవలం నీ కృప’’ అని మురిసిపోయాడు.

  • source : Surya telugu news paper 15/10/2010. (దసరా)
  • ========================================
Visit My Website - > Dr.Seshagirirao

బెజవాడ కనకదుర్గ , Bejawada Kanakadruga



విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ గురించి ఎన్నో ఆసక్తిదాయక కథనాలున్నాయి. ఇంద్రకీలుడు తనకు శాశ్వతత్వం ప్రసాదించమని దేవిని కోరాడట. పర్వత రూపంగా మారితే, తాను దానిమీద నివాసమేర్పరచుకుంటానని కనకదుర్గ చెప్పిందంటారు.

సముద్రం వైపు పయనిస్తున్న కృష్ణవేణికి ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డొచ్చిందని మరోకథ. తనకు కొంచెం దారిమ్మని కృష్ణానది ప్రార్థించడంతో కనకదుర్గమ్మ కరుణించిందని చెబుతారు.

బెజ్జం మార్గం ద్వారా కృష్ణవేణి ముందుకు పయనమైంది. అందువల్లే ఈ ఊరు బెజ్జంవాడ అని పేరు కలిగి అదే తరవాతి రోజుల్లో బెజవాడగా రూపాంతరం చెందిందంటారు. తాను చేసిన సహాయానికి ప్రతిగా కృష్ణవేణమ్మ ముక్కు పుడకను కనకదుర్గాదేవి అరువు తీసుకుందనీ, అది తిరిగి ఇవ్వక్కర్లేకుండా తాను కొండమీదకు లంఘించి అక్కడ ఆవాసం ఏర్పరచుకుందనీ అంటారు. కృష్ణవేణి ఇందుకు ప్రతిగా ఒక శపథం చేసిందనీ, కలియుగాంతానికి తాను కొండమీదకెగసి తన ముక్కుపుడక తీసుకుంటానన్నదనీ దానికి కొనసాగింపు. కృష్ణవేణి ముక్కుపుడకతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అలరారుతున్నదని ఎందరో భక్తులు విశ్వసిస్తారు.

బ్రహ్మ ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఒక శివలింగం ప్రతిష్ఠించి మల్లెపూలతో అర్చించిన కారణంగా ఇక్కడున్న స్వామికి మల్లేశ్వరుడు అని పేరు కలిగిందని ఒక ఐతిహ్యం. స్వామికి వామపక్షాన ఉండాల్సిన ఆ దేవి దక్షిణం వేపు ఉండి ఎంతో శక్తిమంతురాలయిందంటారు.

పాశుపతాస్త్రం కోసం అర్జునుడు ఈ పర్వతం మీద తీవ్ర తపస్సు చేశాడని పురాణగాథ. వేటగాని రూపంలో ఉన్న పరమశివుడితో పోరాడి ఆ అస్త్రం సాధించాడు. అర్జునుడికి విజయుడనే పేరొచ్చింది. అందువల్ల ఈ నగరానికి విజయవాడ అని పేరు ఏర్పడిందంటారు.

పల్లవ రాజైన మాధవవర్మ ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో దేవి తన ఆశీస్సులను ఈ నగరంపై వర్షించిందని చెబుతారు. దానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. రాకుమారుడు రథారూఢుడై వెళుతూ ఉండగా అతని రథంకింద పడి ఒక బాలుడు మరణించాడు. శోకతప్తురాలైన అతని తల్లి మాధవవర్మను ఆశ్రయించి ధర్మం ప్రసాదించాల్సిందిగా వేడుకుంది. ధర్మమూర్తిగా పేరు గడించిన మాధవవర్మ మరేమీ యోచించకుండా తన కుమారునికి మరణదండన విధించాడు. అతని నిష్పాక్షికతకు, ధర్మపరాయణతకు అచ్చెరువందిన దుర్గాదేవి నగరంపై పసిడి వర్షం కురిపించి రాజకుమారుని తిరిగి బతికించిందంటారు. అప్పటినుండి కనకదుర్గ పేరు బహుళ ప్రచారంలోకి వచ్చిందని పెద్దల మాట.

ఆది శంకరాచార్యులవారు ఈ ప్రాంతాలకు వచ్చేంతవరకు ఇక్కడి శక్తిస్థలంలో జంతు వధ జరుగుతుండేదంటారు. శంకరులవారు దేవి ఉగ్రరూపాన్ని శమింపజేయడం కోసం దేవాలయంలో శ్రీ చక్రప్రతిష్ఠ చేశారని, ఆనాటినుంచి బలులు పోయి అమ్మవారికి కుంకుమార్చనలు జరగనారంభించాయనీ భక్తుల విశ్వాసం. కొండపై ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లే మెట్లన్నీ పసుపు కుంకుమాదులతో అలరారుతూ భక్తుల కాంక్షలకు ప్రతిరూపంగా కనబడుతూ ఉంటాయి. నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి వేనవేన కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. విజయదశమి నాడు కృష్ణానదిలో తెప్పోత్సవం వీక్షకులకు నయనానందకరం!

- డాక్టర్‌ మాచిరాజు వేణుగోపాల్‌

స్థలపురాణము :

అమ్మ :
శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి... వేదమాత... అమ్మలగన్నయమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండ కోటి బ్రహ్మాండనాయికైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వ రులను తన ఆధీనం చేసుకుంటూ షోడశా క్షరీ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీ చక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్ర హంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి. రక్షాశక్తి, మంత్రశక్తి, ప్రాణ శక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగె్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిప రాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తు లు దేవిలో నిండి నిబిడీకృతమై ఇంద్రాది దేవతలచే పూజలందు కొంటూ ఇంద్రకీలాద్రిపై స్వయం భువైన అమ్మలగన్నయమ్మ బెజ వాడ శ్రీ కనకదుర్గమ్మ.

దసరా నవ రాత్రులు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా వున్న భక్తులకు, ప్రజలకు గుర్తుకు వచ్చేది బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవా లు. ఈ ఉత్సవాలను యేటా దేవ స్థానం వారు అత్యంత వైభోపేతం గా నిర్వహించటం ఆనవాయితీ. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో రెండవ స్థానం కలిగి, శ్రీ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రశస్తమైన కృతయుగం నాటి కోవె ల, అతి ప్రాచీనమైన శక్తిపీఠం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. సృష్టి, స్థితి, లయ కారిణియై న త్రిశక్తి స్వరూపిణి దుర్గమ్మ. దయామృత వర్షిణి జగన్మాతను మనసారా ఆరాధించి చరణా ల్ని ఆశ్రయిస్తే మనకున్న దుర్గ తుల్ని నాశనం చేసి పద్ధతుల్ని ఆయురా రోగ్య ఐశ్వర్యలను ప్రసాదిస్తుంది. శరన్నవ రాత్రులు ఎంతో విశిష్టమైనవి, శుభప్రదమైనవి, మంగళక రమైనవి, వివిధాలంకార భూషితయైన అమ్మ వారిని దర్శించి, ఆ తల్లికి అత్యంత ప్రీతి పాత్ర మైన కుంకుమార్చనలో స్వయంగా పాల్గొని, ఆ దుర్గాదేవి కరుణా కటాక్ష వీక్షణాన్ని పొందవచ్చు.

శ్రీ కనకదుర్గా దేవి ‘అమృత నిలయం’ క్షేత్రం, తీర్థం, అధిష్టాన దైవపరంగా అగ్రశ్రే ణికి చెందిన ఈ సుందర ఆలయానికి యుగ యుగాల ఘన చరిత్ర, తరతరాల తరగని కీర్తి అమరి యున్నాయి. విజయవాటి కాపురి ఇంద్రకీలాద్రిపై స్వయంభూవుగా వెలసిన శ్రీ కనకదుర్గాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కి అని పద్మపురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తపురాణం, దేవీభాగవతం అద్భుతమైన తీరులో అభివర్ణించాయి.

శ్రీ కనకదుర్గ క్షేత్ర వైభవం :
పూర్వం రంభు, కరంభులనే వారు సంతా నం కోసం ఈశ్వరుని కృపకై తపస్సు చేశారు. కరంభుడు నీటిలోనూ, రంభుడు చెట్ట్డుపైన తపస్సు చేశారు. అది చూసి ఇంద్రుడు కోపం పట్టలేక మొసలి రూపంలో వచ్చి కరంభుని తినివేశాడు. దానితో రంభుడు తన తలని నరుక్కుని ఈశ్వరునికి అర్పించడంతో శివుడు ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకోమంటా డు. మూడు జన్మల వరకు నువ్వే నా కొడుకు గా పుట్టాలని రంభుడు కోరుకుంటాడు.

ఈశ్వరుడు తథాస్తు అని దీవించి అంతర్థాన మవుతాడు. దానితో ఆనందంగా రంభుడు తిరిగి పోతుండగా మార్గ మధ్యలో ఒక మిహ షి కనిపిస్తుంది. ఆమెతో కామకలాపాలు సాగి స్తాడు. అప్పుడు శివుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశిస్తాడు. ఆమెకు పుట్టి న వాడే మహిషాసురుడు. అతడు పెరిగి పెద్ద వాడై తన తండ్రి సోదరుడికి జరిగింది తెలిసి ఉగ్రుడై ఇండ్రుడి మీదకు దండెత్తి జయించి స్వర్గాధిపత్యం పొందుతాడు. ముల్లోకాలను గడగడలాడిస్తాడు.

కాత్యాయన మహర్షి ఆశ్ర మానికి వెళ్ళి స్ర్తీ రూపం ధరించి బాధిస్తూవుం డటంతో ఆ మహర్షికి కోపం వచ్చి స్ర్తీ చేతిలోనే హతమవుతావని శపిస్తాడు. మహిషాసురుడి దురాగతాలు ఎక్కువైపోతుం డటంతో ఆ పరాశక్తిని ప్రార్థిస్తాడు. ఆమె ఉగ్రచండీ రూపమెత్తి మహిషాసురుని సంహ రిస్తుంది. మరో జన్మలో రుద్రకాళీ రూపంలో మహిషాసురుణ్ణి సంహరించింది. స్కందపురా ణంలో సహ్యాద్రి ఖండంలో ఈ తల్లి విజయ గాధలున్నాయి. ఈ మహాతల్లి దుష్టులపాలిట సింహ స్వప్నం. ఈ అమ్మే సరస్వతి, మహా కాళి, మహాలక్ష్మీ, బాల త్రిపుర సుందరి, లలి తాత్రిపురసుందరి, రాజరాజేశ్వరీ, కుండలినీ మహాశక్తి ఈ కనకదుర్గే.

ఆలయ స్థల పురాణ విశేష గాథ:
ఇంద్రకీలాద్రి పర్వత పాదభాగాన్ని తాకుతూ పరవళ్ళు తొక్కే కృష్ణవేణి చెంతగల ఈ పర్వతానికి ఈ పేరు రావడానికి ఐతిహ్యం వుంది. పూర్వం కీలుడు అనే యక్షుడు ఆది పరాశక్తి అయిన దుర్గా దేవి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చిన అమ్మవా రు కాలుణ్ణి వరం కోరుకోమనగా పరమ సంతోషంతో జగన్మాతను అనేక విధాల స్తుతించి ‘‘అమ్మా! నీవు ఎల్లప్పుడూ నాపై నివసించి వుండు’’ అని వరం కోరుకుంటా డు. అందుకా దుర్గాదేవి ‘‘ఓ యక్షా! నీవు పరమ పవిత్రమైన ఈ కృష్ణా నది ఒడ్డున పర్వత రూపాన్ని ధరించు.

కృతయుగంలో అసుర సంహా రానంతరం నేనే నీ పర్వతం మీద కొలువుంటాను’’ అని వరం ప్రసా దించింది. కీలుడు పర్వత రూపాన్ని పొంది దేవి ఆవిర్భావం కోసం ఎదురు చూడసాగాడు. తదుపరి కృతయుగంలో దుష్ట దనుజుడైన మహిషాసురుణ్ణి సంహరించాక ఆ దుర్గాదేవి కీలుడి కిచ్చిన మాట ప్రకా రం మహిషాసుర మర్దినీ స్వరూపంతో కీలాద్రి మీద ఆవిర్భవిం చింది. స్వర్ణమయకాంతులతో సూర్య సమప్ర భలతో ప్రకాశిస్తున్న ఆ మహిషాసురమర్దని కొలువున్న కీలాద్రి పర్వతం మీదకి ఇంద్రాది దేవతలంతా వచ్చి నిత్యం దేవికి పూజలు చేయసాగారు. ఆనాటి నుంచి ఈ కీల పర్వ తం ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. దుర్గా దేవి కనకవర్ణంతో అవతరించడం వల్ల ఈ పర్వతం కనకాచలమైంది.

స్వర్ణశిఖరం చారిత్రక నేపథ్యం:
రుద్రకాంతం అనబడే త్రితల విమానంతో 156 అడుగుల ఎత్తులో శ్రీ కనకదుర్గాలయం నిర్మించబడింది.ఇంద్రకీలాద్రి వాసినయైన అమ్మవారికి ఎదుట గుడికట్టించింది ఎవరో తెలిపే చారిత్రక ఆధారాలు ప్రస్తుతం మనకు కనిపించవు. అయితే శ్రీ కృష్ణ దేవారాయలు పరిపాలన చేసే కాలంలో మహా మాండలికు డైన సింగమదేవ రాజు వేయించిన శాసనంలో ఈ ఆలయానికి మరమ్మతుల జరిపి, ముఖ మండపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆల యంపైకందం అనే విభాగంలో నాలుగు దిక్కు ల్లో మహిషాసురమర్దినిగా, మహాకాళి, షోడశ భుజ దుర్గాదేవి, మహాసరస్వతీ దేవి శిల్పాలు అందంగా మలచబడ్డాయి. అమ్మవారి ఆలయ శిఖరం మీద నుంచి స్థూపం వరకు పూర్తి బంగారపు పూతతో మహాపద్మాన్ని ఏర్పాటు చేశారు.బంగారు ఆలయ శిఖరాలు తిరుమల శ్రీనివాసుని తరువాత బెజవాడ కనకదుర్గమ్మ కే ఉన్నాయి.

అమ్మవారి శ్రీ చక్రం
శ్రీ చక్ర అధిష్టానదేవత శ్రీ దుర్గాదేవి. ఈ దుర్గాదేవి మహిషాసుర సంహారానంతంరం, అదే స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా రౌద్రరూపంతో వెలసింది. ఆనాటి వీర శాక్తే యులు దేవికి వామాచార పద్ధతిలో జంతు బలులు, నరబలులు నివేదించి పూజలు చేసే వారు. దాంతో దేవీ మూర్తి మరింత ఉగ్రరూ పాన్ని ధరించింది. దానివల్ల పూజల్లో ఏ చిన్న తప్పు జరిగినా కొండ క్రింది ఉన్న బెజవాడలో ఏదో ఒక ఉపద్రవం వచ్చిపడుతూ ఉండేది. ఈ స్థితిని గమనించిన జగద్గురువు ఆదిశం రాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మార్చి ఇక్కడ తమ మంత్రశక్తితో శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్టించారు. నిత్యార్చనలు, కుంకుమార్చనలు అన్నీ దేవి మూలవిరాట్‌కి కాక అమ్మవారి ప్రతిరూపమైన శ్రీ చక్రానికే జరుగుతుంటాయి.తరతరాలుగా పూజలం దుకునే శ్రీ చక్రం ఎంతో మహిమోపేతమైంది.

అలాంటిది ఆ పర్వతం మీద పరమేశ్వరుణ్ణి కూడా కొలువు వుండేలా చేయాలనే సత్సం కల్పంతో బ్రహ్మదేవుడు పరమ నిష్టతో శతా శ్వమేథయాగాన్ని చేయగా, అతని భక్తి శ్రద్దల కు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లంగ స్వరూ పంతో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు. ఇంద్రకీలాద్రి మీద దివ్యజ్యోతిర్లింగ స్వరూ పుడై నిలిచిన జటాజూటధారి బ్రహ్మను అను గ్రహించాడు. ఆ విధంగా బ్రహ్మచే ప్రథమం గా మల్లికా పుష్పాలతో అర్పించబడిన కారణం గా ఆ స్వామికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చిం ది. కాలక్రమంలో కలిప్రభావం వల్ల జ్యోతి ర్లింగం అంతర్నిహితమై ఉండటాన్ని చూసిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో మల్లేశ్వర లింగాన్ని పునః ప్రతిష్టించారు. ఆనాటి నుంచి మల్లేశ్వర స్వామి కూడా ఎంతో వైభవంతో జనులందరి చేత అర్చింపబడ్డాడు.

అమ్మవారి అలంకార అంతర్యం
ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి దశమి వర కు వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్స వాలు ప్రతి ఏడాది జరుగుతాయి. అధిష్టాన దేవతకు ఒక్కొక్కరోజు ఒక్కో అవతారంతో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి పదవ రోజు విజయదశమి చేస్తారు. తిథుల హెచ్చు తగ్గుల వల్ల ఒక్కొక్కసారి 11 రోజులు దసరా ఉత్సవాలు చేయాల్సి వస్తోంది. తొలి రోజు స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవీగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా, ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, ఆరవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా, ఏడవ రోజున శ్రీ మహా లక్ష్మీ దేవిగా, అష్టమినాడు శ్రీదుర్గాదేవిగా, నవమినాడు శ్రీమహి షాసురమర్దినీ దేవిగా అలంకరిస్తారు. విజయదశమి నాడు అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు.

స్వాతి వారపత్రిక -15/10/2010
  • ==================================================
Visit My Website - > Dr.Seshagirirao

Wednesday, October 20, 2010

Navadurgalu , నవదుర్గలు










హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కధనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

గొవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత "నవదుర్గ". గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు.

నవదుర్గలు -మహిమలు

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటేతి, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.


1.శైలపుత్రి:
' వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్'

కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.
హిమవంతుడు తపస్సు చేసి , ఆమెను కుమార్తెగా కోరగా అతనికి జన్మించినది .

2.బ్రహ్మచారిణి:
'దధనా కరపద్మాభ్యం అక్షమాలా కమండలా
దేవీ ప్రేదతు మయీ బ్రహ్మే చారిణ్యనుత్తమా '

ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.
శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఎకాగ్రత కలుగుతుంది .


3.చంద్రఘంట:
'పిండజ ప్రవరారూఢ చండకో పాస్త్రకైర్యుతా
ప్రసాదం తమతేహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా'

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

4.కూష్మాండ రూపం:
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '

జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .

5.స్కందమాత:
'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.


6.కాత్యాయిని:
'చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ '

దేవతల కార్యార్దము కతుడు అనే మునిపుంగవుని ఆశ్రమం లో ఒక జన్మలో పుట్టి అక్కడే పెరగడం వల్ల ... ఈనామము . కాత్యాయనీ మాత వింధ్యాచలవాసిని. ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేదవిద్య అబ్బుతుంది .

7.కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '

మృత్యువు కే భయకారిణి , ప్రళయకాలములో యముణ్ణి కూడా నశింపజేయగలదీ అయిన మూలశక్తి ... ఈమె . కాళరాత్రీ దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు గల మరో నామం శుభంకరి.

8.మహాగౌరి:
'శ్వేతే వృషే సమారూఢా శ్వేతంబరధరా శుచిః
మహాగౌరి శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా!'

పుట్టుకతోనే నల్లని రంగుగల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలు్స్తాడు . దాంతో ఆమె శివుమితో పంతగించి , బ్రహ్మ గుఎఇంచి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్ల్ని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది . అష్టమశక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

9.సిద్ధిధాత్రి:
'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.


  • ఈ వ్యాసము వికిపెడియా నుండి సేకరించబడి కొత్త సమాచారముతో తిరిగి రాయడం జరిగినది .

For full details >see in telugu wikipedia - Navadurga
  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao.com

అష్టాదశ శక్తి పీఠాలు ( శక్తిపీఠాలు ) , Astadasa Shakti peetas



  • శక్తిపీఠాలు :


హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు .
  • అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

  • అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు...

  • 1.శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

  • 2.కామాక్షి
సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

  • 3.శృంఖల
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

  • 4.చాముండి
హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

  • 5.జోగులాంబ
మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

  • 6.భ్రమరాంబిక
విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

  • 7.మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

  • 8.ఏకవీరాదేవి
మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

  • 9.మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

  • 10.పురుహూతిక
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

  • 11.గిరిజాదేవి
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

  • 12.మాణిక్యాంబ
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

  • 13.కామాఖ్య
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

  • 14.మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

  • 15.సరస్వతి
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

  • 16.వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

  • 17.మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

  • 18.విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

...ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.

  • - courtesy ... Eenadu sunday magazine.17/10/2010.
  • ===================================
Visit My Website - > Dr.Seshagirirao.com

Tuesday, October 19, 2010

ఆశ్వయుజ మాసం , Aswayuja Month

7. ఆశ్వయుజ మాస వైభవం

అశ్వినీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిందే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ నెలలో వైశిష్ట్యం.

ఆశ్వయుజం శరత్కాలంలో వస్తుంది. ఇది వర్షాలు తగ్గి ప్రకృతి కాంత కొత్త శోభను సంతరించుకునే కాలం. పుచ్చపువ్వులా వెన్నెల కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. 'ఆకాశ లక్ష్మి చుక్కలనే ముత్యాల దండల్ని ఆకాశగంగలో కడగడానికి సిద్ధం చేసిన కుంకుడు కాయ నురుగు తెప్పల్లా తెల్లగా ఉన్నాయి శరత్కాల మేఘాలు' అంటాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యదలో. ఈ నెలలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు దక్షిణాభిముఖుడవుతాడు. సూర్యుడు శక్తి కారకుడైతే, చంద్రుడు మనఃకారకుడు.

శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి. ఆశ్వయుజ పాడ్యమినుంచి తొమ్మిది రోజులపాటు దేవిని పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలను తొమ్మిదిరోజులపాటు వేడుకగా నిర్వహిస్తారు. దేశంలో ఉత్తరాదిన రామలీలా ఉత్సవాలు చేస్తారు. మహాలయా పితృపక్షం ముగియగానే దేవతారాధన జరపడం అనేది, ఆ పితృదేవతలను తమకు ప్రసాదించిన ఆదిపరాశక్తిని కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో త్రిమాతారూపంగా పూజించడం. అది ఒక యోగం. సమస్త జగత్తును పాలించేది ఆదిపరాశక్తి. ఆ పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, సరస్వతి, పార్వతియై లోకాలకు సమస్త సౌభాగ్యాలు, విద్య, శక్తి ప్రసాదిస్తున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో కలశస్థాపన చేస్తారు. ఈ కలశాన్ని తొమ్మిది రోజులు పూజించి పదో రోజున ఉద్వాసన చెబుతారు. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమినాడు వాగ్దేవి సరస్వతీపూజ. వేదమాతృకగా, జ్ఞానభూమికగా, సమస్త విద్యావాహికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం.

ఒక సంప్రదాయం ప్రకారం నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని 'శైలపుత్రి'గా పూజిస్తారు. రెండోరోజు తపోనిష్ఠతో పరమేశ్వరుని మెప్పించిన 'బ్రహ్మచారిణి'ని సేవిస్తారు. మూడో రోజు 'చంద్రఘంటాదేవి'. నాలుగోరోజు కూష్మాండదేవి. అయిదోరోజు 'స్కందమాత' అని, ఆరో రోజు 'కాత్యాయని' వ్యవహరిస్తారు. ఏడోరోజు దేవిని 'కాళరాత్రిదేవి'గా అర్చిస్తారు. ఎనిమిదో రోజు 'మహాగౌరి' అయితే, తొమ్మిదోరోజు 'సిద్ధిధాత్రి'గా కొలుస్తారు. దేవీ నవరాత్రుల్లో 'కుమారిపూజ' చేసే ఆచారమూ ఉంది.

పదోరోజు 'విజయదశమి'. దాన్ని విజయానికి సంకేతంగా భావిస్తారు. విజయదశమినాడు శ్రీరాముడు రావణుని సంహరించాడని విశ్వాసం. అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలు తీయించి కౌరవవీరులను ఓడించాడని మహాభారతం విరాటపర్వ ఉదంతం. విజయదశమినాటి శమీపూజ ప్రసిద్ధమే.

ఆశ్వయుజ బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు. బహుళ తదియ అట్లతదియ. స్త్రీల పండుగ. ఆశ్వయుజ బహుళత్రయోదశి 'ధనశ్రయోదశి'. లక్ష్మీపూజ చేస్తారు. చతుర్దశినాడు సత్యకృష్ణులు నరకాసురుని వధించిన దినంగా 'నరక చతుర్దశి'గా భావిస్తారు. అమావాస్యనాడు 'దీపావళి'. నరకాసురవధ కాకుండా బలిచక్రవర్తి గౌరవార్థం దీపావళి జరిపినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. దీపావళినాడు విక్రమార్కుని పట్టాభిషేకం జరిగిందనే ఒక గాథ ప్రచారంలో ఉంది. సూర్యుడు దీపావళినాడు తులారాశిని పొందుతాడని, ఆ రోజు లోకులు దివిటీలతో తమ పితృదేవతలకు మార్గదర్శనం చేయాలని 'ధర్మసింధు' చెబుతోంది.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
  • ========================================
Visit My Website - > Dr.Seshagiriraohttp://dr.seshagirirao.tripod.com

Telugu months importence , తెలుగు నెలలు వాటి విశిస్టత


తెలుగు నెలలు (తెలుగు మాసములు) :తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

  • [Eclips+-3.png]
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).


తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము


ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

----------------------------------------------------------------------------------------------

  • =======================================
Visit My Website - > Dr.Seshagirirao

Thursday, October 7, 2010

Annamayya Taallapaaka , తాళ్ళపాక అన్నమయ్య



భగవంతుని చేరే నవవిధ భక్తి మార్గాల్లో 'కీర్తనం' ప్రధానమైనది. నామ సంకీర్తనంతో సర్వపాపాలు తొలగిపోతాయని భాగవతంలో వ్యాసుడు చెప్పిన విధం మనకు తెలిసినదే!

తన సంకీర్తనలతో శ్రీనివాసునికి పదపుష్పాలతో పట్టాభిషేకం చేసిన కారణజన్ముడు తాళ్ళపాక అన్నమయ్య. తెలుగువారికి, తెలుగు జాతికి అచ్చ తెలుగులో పాట పాడుకునే యోగ్యత కల్పించినవాడు అన్నమయ్య. సాక్షాత్తు శ్రీహరి ఖడ్గమైన 'నందకాంశ'తో జన్మించాడనే ఘనతను కలిగిన ఆ శ్రీహరి దాసుడు 32,000 అద్భుత సంకీర్తనలను తేట తెలుగులో, ప్రౌఢ సంస్కృతంలో రచించాడు. అవతారాలు ఎన్నైనా భగవంతుడొక్కడే అన్న నానుడికి నిదర్శనంగా- తాను ఏ దైవాన్ని కీర్తించినా, ఆ దైవంలో సప్తగిరుల్లో కొలువైన వేంకటేశ్వరునే దర్శించాడు. తాను సృజించిన వసివాడని సంకీర్తనా కుసుమాలకు ఎన్నటికీ తరగని 'వేంకట' పదమకరందాన్ని అలమిన భక్త శిఖామణి ఆయన. తిరుమలగిరుల్లో శిలయైనా, కోనేటి అలయైనా అన్నమయ్య పదాల్లో ఒదిగి మనోజ్ఞమైన భక్తి భావాలకు ప్రతీకలుగా నిలిచాయి.

అన్నమయ్య సంకీర్తనలు అధ్యాత్మ, శృంగార సంకీర్తనలనే రెండు విభాగాలుగా లభించాయి. అన్నమయ్య రాసిన ప్రతి సంకీర్తన ఆపాత మధురమే కాదు. ఆలోచనామృతం కూడా! ఎంతో విశదంగా చదువుకున్న పండితులకూ అర్థంకాని వేదాల సారాన్నీ, పురాణాల ప్రాశస్త్యాన్నీ అచ్చ తెలుగు భాషలో తెలుగువారికి అందించిన గొప్పదనం పదకవితా పితామహునికే చెల్లింది.

అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా లోక నీతిని, జీవన నీతినీ ఉద్బోధించాడు. దాదాపు ఆరు శతాబ్దాలకు పూర్వమే సమాజంలోని కట్టుబాట్లను, కులమత భేదాలను నిరసించాడు.

జోలపాటలతో, లాలిపాటలతో సేద తీర్చాడు. వసంతం పాటలతో ప్రకృతి సౌందర్యాన్నీ, పల్లెపట్టుల సౌభాగ్యాన్నీ మన కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు. కోలాటం పాటలు, సువ్వి పాటలు, జాజర గీతాలతో- అలసిన జానపదుల సేద తీర్చాడు.

అన్నమయ్య రాసిన 'చందమామ రావో జాబిల్లి రావో', 'జో అచ్చుతానంద జోజో ముకుంద' పాటలు పసిపిల్లలకు పాడి వినిపించని తల్లి తెలుగునాట ఉంటుందా! సరళమైన శైలిలో పల్లెపదాలతో అధిక సంకీర్తనల రచన చేయటంతోనే అన్నమయ్య సంకీర్తనలు పండిత, పామర జనరంజకమయ్యాయి. ఎంతోమంది భాగవతోత్తముల కోవలోనే అన్నమయ్య తన సంకీర్తనల గానాన్ని 'వేంకటపతి' ఘనతతోనే నింపాడు. అమ్మవారి, అయ్యవారి అమలిన శృంగారాన్ని సంకీర్తనా శిల్పాలుగా మలచాడు. తనపై సంకీర్తనలు చెప్పమని కోరిన పెనుగొండ సంస్థానాధీశుడు సాళువ నరసింగరాయల అభ్యర్థనను తోసిపుచ్చటమే కాక, 'ఆ హరిని కీర్తించిన నాలుక సామాన్యులను కీర్తించుటయా! ఇది జరగని పని' అంటూ ఆ ప్రభువు కొలువునే వదులుకున్నాడు. అన్నమయ్య ప్రతి సంకీర్తనా ఒక అమృత గుళిక! ఏడు కొండల్లో కోనేటి రాయనికి అందించిన కర్పూర కళిక. ఆయన సంకీర్తనల్లో 13000 సంకీర్తనలు దాదాపుగా మనకు లభ్యమయ్యాయి. మిగిలినవి దొరకకపోవడం మన తెలుగు జాతి దురదృష్టం! అయినా, అన్నమయ్య చెప్పినట్లు- ఒద్దికై భక్తజనుల్ని రక్షించడానికి ఒక్క సంకీర్తనే చాలు!

అలతి పదాలతో అనంతమైన భక్తిభావాన్ని రంగరించిన అన్నమయ్య సాక్షాత్తు 'అప్పని వరప్రసాది!'

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

పూర్తి వివరాలకోసము ... వికీపిడియాను చూడండి ..-> అన్నమయ్య
  • =============================================
Visit My Website - > Dr.Seshagirirao

Wednesday, October 6, 2010

పంచభూత లింగములు ,Panchabhuta Lingas



1.భూమి , 2.ఆకాశము , 3.గాలి , 4.నీరు , 5.అగ్ని . అనేవి పంచభూతాలు . ఇక్కడ భూమి అంటే మట్టి - జీవి జన్మకు వేదిక . . . భూమి చుట్టూ ఉన్న శూన్యప్రదేశమే - ఆకాశము ... ఇక భూమి పైన ఉన్న ప్రకృతివాతావరణము లో ప్రతి జీవికి కావలసిన గాలి , నీరు , అగ్ని/శక్తి (ఆహారము) జీవపరిణామ క్రమములో వాటంతటవియే సమకూర్చబడ్డాయి . జీవి + పంచభూతాలు కలిస్తేనే ప్రకృతి . ఒకదానినుండి ఒకటి ఉద్భవించాయి . అలా ఉద్భవిస్తూనే ఉంటాయి . వీటికి అంతము లేదు ... అంతరాయమూ ఉండదు . భూగోళము ఉన్నంతవరకూ ఇలా జరగవలసినదే . వీటిలో ఏ ఒక్కదానికి అంతరాయము కలిగినా ప్రకృతిలో జీవి (ప్రాణి) నశించి భూమి ఉనికే ప్రశ్నార్దకము ?. E=mc^2 . పంచభూతాలలో ఎవరికి వారే గొప్ప . ఒకరు కంటే ఇంకొకరు గొప్ప , తక్కువ అని చెప్పడం అవివేకము . జీవపరిణామ క్రమములో జీవి అవసరార్దము వాటికవే జనించాయి . అందుకే వాటిని స్వయంభువులు అని అంటారు . ఒక భూతము పై ఆదారపడి ఇంకొక భూతము జనించి ఒకదాని గమనము పై ఇంకొకటి అదారపడుతూ ప్రతి జీవిలోనూ ఈ పంచభూతాలు నిలయమై ఉంటూ్ ప్రకృతి సజావుగా నడుస్తూ ఉన్నది . పంచభూతాలను దేవుడనుకోండి , దెయ్యమనుకోండి , మనిషనుకోండి , మాననుకోండి ... అంతటా , అన్నిటా ఉండేవి .. ప్రకృతికి కారకాలు ... మట్టి , గాలి ,నీరు , అగ్ని , ఆకాశము .

తొలి రోజుల్లో మానవుని విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందని కాలములో అన్నింటిని అతీత శక్తులు గాను , దైవాలుగాను భావించి పంచభూతాలను లింగాలుగాను , అంగాలుగాను ఊహించి పూజించి మనోశక్తిని , మానసిక ఉల్లాసాన్ని పొందేవాడు . ఆ కోవలోనివే ఈ పంచభూత లింగాలు .

పంచభూత లింగములు : పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము , ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభూత లింగములు అంటారు .

1. పృధ్వీ లింగము :

తమిళనాడులో (కంచి) లో ఏకాంబరనాధ లింగము (పృధ్వీ లింగము) పంచ లింగాలలో ఒకటి. ఈ కాంచీపురంను కంజీవరం అని కూడా అంటారు . కాంచీపురంలో విష్ణు కంచి , శివ కంచి అని రెండు భాగాలుగా ఉంది . అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు .

2. జల లింగము :

తమిళనాడులోని జంబుకేశ్వరమున జలలింగము ఉంది. ఈ జలలింగము జంబుకేశ్వరస్వామిగా పిలవబడును. జంబుకేశ్వరం తిరుచునాపల్లికి చాలా దగ్గరలో ఉంది. జంబుకేశ్వరము పురాతన కాలము నాటి శివ క్షేత్రము. ఈ గుడిలో నిరంతరం ఊరే నీటి వూట ఉంది . ఇక్కడున్న నేరేడు చెట్టుని జంబువృక్షమని అంటారు. జంబుకేశ్వరంనుండి శ్రీరంగం సుమారు 01కి. మీ దూరం . కావేరి నది శ్రీరంగం , తిరుచునాపల్లి నగరం చుట్టూ ప్రవహిస్తుంది .

3. తేజో లింగము :

తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి "అరుణాచలే్శ్వర స్వామి"అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ .

4. ఆకాశ లింగము :

తమిళనాడులో మద్రాసుకు సుమారు 240కి. మీ దూరంలో ఆకాశలింగము ఉంది. శివుడు ప్రళయ రుద్రతాండవం చేస్తున్న విగ్రహం అతి పెద్దది (నటరాజ స్వామి). ఈ చిదంబర క్షేత్రంలో మహావిష్ణువుఆలయం మరియు శివాలయం (నటరాజ స్వామి) ఒకే చోట కనపడతారు . విల్లుపురం నుంచి తంజావూరు వెళ్లే మార్గంలో ఉంది .విల్లుపురం నుంచి చిదంబరం దూరం 83కి. మీ మాత్రమే.

5. వాయు లింగము :

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతికి సుమారు 65కి.మీ దూరంలో శ్రీ కాళహస్తి యందు వాయులింగము ఉంది. ఈ స్వామిని సాలెపురుగు, కాళము, హస్తిలు అకుంఠిత భక్తితో పోటాపోటీగా ఆర్చించి చివరకి మోక్షము పొందాయి .

  • ==========================================
Visit My Website - > Dr.Seshagirirao

Monday, October 4, 2010

ananthapadmanabha vratam , అనంతపద్మనాభ వ్రతం



అనంత పద్మనాభ చతుర్దశి
భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతం అనంత పద్మనాభ చతుర్దశి. ఇది కేవలం వ్రతమేకానీ ఉత్సవం మాత్రం కాదు. సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ఇది ప్రధానమైందని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. కష్టాలలో కూరుకొనిపోయి ఉన్నప్పుడు బయట పడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది. వనవాస కష్టాలను అనుభవిస్తున్న కాలంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అలా ఎంతో పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తుండటం విశేషం. ఎవరీ అనంతుడు, అనంతపద్మనాభస్వామి? అనే సందేహాలు ఈనాటి వారికొచ్చినట్టుగానే ఆనాడు ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఓ చక్కటి సమాధానం చెప్పాడు. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే ఎవరో తెలుసుకోగలిగాడు ధర్మరాజు.
వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. వ్రత సంబంధమైన పూజను గమనిస్తే అనంతపద్మనాభ అవతారం కళ్ల ముందు మెదలాడుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజించటం కనిపిస్తుంది. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క, ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. ఈ విషయాలన్నిటినీ పరిశీలించి చూస్తే అనంతపద్మనాభ వ్రతం తొలుత యమునా నది పరిసర ప్రాంతాలలో ఆవిర్భవించి ఆ తర్వాత దేశం అంతటా విస్తరిల్లి ఉంటుందన్నది పండితుల భావన. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్లకొకసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు, పిండి వంటలు, పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే.

ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.

వ్రతానికి సంబంధించి కథను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని, ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి దర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు. అనంతపద్మనాభ వ్రతాన్ని ఎలా చేయాలి? తోరాన్ని ఎలా తీసుకోవాలి? పూజా ద్రవ్యాలు లాంటివి ఏమేమి వాడాలి అనే విషయాలన్నీ బాగా తెలిసిన పండితుడితో చెప్పించుకొని ఆయన సహాయంతో వ్రతాన్ని చేసుకొని పుణ్య ఫలాలను పొందాలంటున్నాయి వ్రత గ్రంథాలు.

వ్రతవిధానము :
ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .

  • =========================================
Visit My Website - > Dr.Seshagirirao