Wednesday, December 30, 2009

అంశుమంతుడు(సూర్యుడు) , Amshumantudu(Sun)



భగవాన్ నామము స్మరించు. దానివల్ల సమస్త పాపాలు , కామ క్రోధాలు నిర్మూలమవుతాయి . భాగవన్నామము , భగవంతుడు వేరుకావు . చేతులను చరుస్తూ ఉదయం , సాయంకాలమున హరి(హర)నామ సంకీర్తన చేయండి . మీ పాపాలు , బాధలన్నీ మిమ్మల్ని వదిలి పలాయనమౌతాయి . చెట్టుక్రింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టుమీది పక్షలు ఎగిరిపోతాయికదా. చప్పట్లు కొడుతూ హరి (హర) నామము చేస్తే మీ శరీరం అనే చెట్టునుండి పాపాలనే పక్షులు ఎగిరి పోతాయి .
- శ్రీ రామకృష్ణ పరమహంస .

  • శాస్త్రపరిజ్ఞానము అంతగా అభివృద్ధి చిందని పూర్వకాలములో ద్వాపరయుగాంతములో వేదవ్యాసుడు సూర్యుని దేవుని గా బావించమని జనులను ఉద్భోదించాడు అని అనుకోవచ్చును . . నిత్యజీవతం లో మానవునికి ఉపయోగపడే ప్రతిదీ భవవాన్‌ స్వరూపమనే భోదించాడు . భగవంతునకు భక్తునకు ఉన్న సంభందం . అలా అన్ని ఆరోగ్య సూత్రాలు ఆద్యాత్మికం గా లింక్ పెట్టి భోదించాడని ఇక్కడ గ్రహించాలి .
మార్గశిర మాసం లో అంశుమంతుడనే సూర్యుడు తన రధం లో సంచరిస్తూ ఉంటాడు . కశ్యపమహర్షి , ఊర్వశి అనే అప్సరస , రుతసేనుడనే గంధర్వుడు , మహాశంఖమనే సర్పం , తారక్ష్యుడు అనే యక్షుడు , విద్యుచ్చత్రువు అనే రాక్షసుడు , ఆయన వెంట ఉంటారు . ఆయన చీకట్లను పారద్రోలడం లో , శత్రువులను సంహరించడం లో సమర్ధుడు , సకల జగత్తుకు శుభప్రదుడు . మునీశ్వరులు ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు . అటువంటి అంశుమంతుడు అనే ఈ ఆదిత్యుడు తొమ్మిదివేల కిరణాలతో శోభిల్లుతూ ఆకుపచ్చ వర్ణంతో ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి .

ఒక సారి వైశంపాయనుడు వ్యాసమహర్షి ని ఈ విధం గా అడిగాడు ... ఓ మహర్షి ! ప్రతి రోజు ఆకాశం లో ఉదయించే ఆ తేజశ్శాలి ఎవరు? దేవతలు , మహర్షులు సిద్ధులు , మానవులంతా ఆ మహాపురుషుని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన గురించి చెప్పండి .. అని అడుగగా ఈ విధం గా వివరించారు .

" ఓ వైశంపాయనా ! యితడు బ్రహ్మ స్వరూపం నుండి ఉద్భవించాడు . ఉత్స్క్రుస్తమైన బ్రహం తేజోరూపుడు . సాక్షాత్ బ్రహ్మమయుడే . ఈ భగవానుడు ధర్మ , అర్ధ , కామ , మోక్షము అనే నాలుగు పురుశార్ధఫలాలనిస్తాడు . ఇదే సూర్యుని యొక్క సత్యమయ స్వరూపము . లోకములయోక్క ఉత్పత్తి , పాలన ఈయన వల్లే జరుగుతాయి . ఈయన లోకరక్షకుడు . ద్విజులు మొదలైనవారు ఈ మహాత్ముని ఆరాధించి మోక్షాన్ని పొందుతారు .

సంద్యోపాసన సమయం లో బ్రహ్మవేత్తలైన బ్రాహ్మినులు తమ భుజాలను పైకెత్తి ఈ దివ్యపురుశున్నే సేవిస్తారు . ఈయన్ని ఆరాదిస్తే సమస్త దేవతలను ఆరాదిన్చినట్లే .సూర్యమండలం లో ఉన్న సాధ్యదేవిని పపాసిన్చిద్విజులంతా స్వర్గాన్ని , మోక్షాన్ని పొందుతున్నారు . సుర్యోపాసన వలనే మనుష్యులు రోగాలనుంచి విముక్తులవుతున్నారు . ఈ స్వామిని పుజించేవారికి ఎన్నడు అంధత్వము దారిద్రియము , దు:ఖము , శోకాలు కలుగవు అని తెలియజేషారు  వ్యాసమహర్షి .

సూర్యుడు ఆధునిక శాస్త్రము :
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి

సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకు?

సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు . అసలు సూర్యుడు అంత ఎర్రగా ఎందుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం.!
భూమి వాతావరణంలో సూర్యుడి కిరణాలు మన కంటికి చేరేంతదాకా అవి ప్రయాణించే దూరాలు మారుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాలు మన కంటికి చేరేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాలి. దూరంగా భూమి, ఆకాశం కలసినట్లు కనిపించే క్షితిజ రేఖకు దగ్గరగా సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయాల్లో దగ్గరగా ఉండటం వల్లనే సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

అదే మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు మన నడినెత్తిపైన ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరంపాటు ప్రయాణించి మన కంటిని చేరుతాయి. అలాంటి సమయాల్లో సూర్యుడి రంగు మామూలుగానే ఉంటుంది. అయితే... వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, తక్కువగా చెదిరిపోయే ఎరుపు రంగు మన కంటికి ఎక్కువగా చేరుకోవడం వల్ల... సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.

  • ఆదర్శ ప్రత్యక్ష దైవం... సూర్యభగవానుడు
ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందుతుంటారని తెలిపే కథాంశం మత్స్యపురాణంలో కనిపిస్తుంది. ఈ కథాంశంలో సూర్యుడు తన శక్తినే చంద్రుడికిచ్చి అతని వల్ల లోకాలన్నింటికీ మేలు చేయిస్తుంటాడనే ఖగోళ సంబంధమైన శాస్త్ర విషయం ఇమిడి ఉంది. సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. ఆ అమృతమే చంద్రుడిలో కళాక్షయ రూపంలో కనిపిస్తుంటుంది. అమృతాన్ని తాగటం వల్ల దేవతలకు కలిగే తృప్తి పదిహేను రోజులపాటు మాత్రమే ఉంటుంది. మనిషి మిగిలిన కాలంలో స్వాహాకారాలతో దేవతలను, స్వధాకారాలతో పితృదేవతలను తృప్తి పరచాల్సి ఉంటుంది. దీనికోసం అన్నం అవసరం అవుతుంది. యజ్ఞం చేసేటప్పుడు స్వాహా అని మంత్రాలకు చివర పలకటం, పితృదేవతలకు సమర్పించేటప్పుడు స్వధా అని మంత్రాల చివర పలకటం వల్ల యజ్ఞ సమయంలో కుండంలో నుంచి హవ్యం దేవతలకు, కవ్యం పితృదేవతలకు చేరుతుంటుంది. సూర్యుడు భూమి మీద అన్నానికి సంబంధించిన పంటలు పండించటానికి తన కిరణాలను ప్రసరింపచేసి ధాన్యం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంటాడు. ఈ కారణం వల్లే సూర్యుడు దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు ఆరాధ్యుడవుతున్నాడు. సూర్యుడు తన కిరణాల్లో నిలుపుకొన్న దేవ, పితృ, మనుష ఆహార జన్యతృప్తే సూర్య రథానికి ఉన్న చక్రం అని చెబుతారు. ఆ చక్ర శక్తి వల్లే సకల సృష్టి చైతన్యం ప్రాప్తిస్తోంది. సూర్యుడు పచ్చని గుర్రాలను పూన్చిన రథంలో ప్రయాణిస్తుంటాడు. ఈ పచ్చదనం లోకకల్యాణ సూచకం. దినస్పతి అని కీర్తిని అందుకుంటున్న సూర్యుడు అహోరాత్రులు తన ఏక చక్ర రథంపై సప్త ద్వీప సమస్త సముద్ర ఘటికమైన ఈ పృథ్వీ చక్రాన్ని అంతటిని చుట్టి వస్తుంటాడు. ఆయన అధిరోహించిన రథానికున్న గుర్రాలు సప్త ఛందోరూపాలుగా ఉంటాయి. సూర్యుడి సంకల్పాన్ని అనుసరించి కామరూపంతో, కామగమనంతో ఆ గుర్రాలు మనోవేగంతో ప్రయాణిస్తాయి. ఒకసారి రథానికి పూన్చితే మళ్లీ మళ్లీ ఆ గుర్రాలను విప్పటం, పూన్చటం చేయాల్సిన పని ఉండదు. నిరంతరం అవి అవిశ్రాంతంగా లోకకల్యాణం కోసం సూర్యభగవానుడితో పాటు సంచరిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ గుర్రాలు కొద్దిగా ఎర్రడాలు రంగుతో కనిపిస్తాయి. ఎన్ని యుగాలు గడిచినా ఈ గుర్రాల్లో మాత్రం మార్పు ఉండదు. వాటికి వేద విజ్ఞానం అంతా అవగతమై ఉంటుంది. సృష్టిలో కర్మఫలాలను అనుసరించి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వారికి ఎలాంటి మేలు చేసిపెట్టాలో వాటికి తెలిసి ఉంటుంది. ఈ గుర్రాల్ని కల్పం ప్రారంభంలో ఒకసారి పూన్చితే మళ్ళీ కల్పాంతంలో మహాప్రళయం సంభవించే వరకూ అవి అలా సూర్యరథాన్ని మోసుకుని పోతూనే ఉంటాయి. సూర్యుడు తన కిరణాల శక్తికి మారు రూపాలైన వాలఖిల్యులు అనే చేతి బొటనవేలు అంత పరిమాణంలో ఉండే రుషులు తన వెంట నడుస్తుండగా ఆ వెనుక మిగిలిన మహర్షులంతా వేద మంత్రాలను స్తుతిస్తుండగా గంధర్వ, అప్సరస గణాలు గీత, నృత్యాలతో సేవిస్తుండగా తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు. ఆ ప్రయాణమంతా ఓ అద్భుత సుందర దృశ్యంగా ఉంటుంది. ఈ సూర్యుడి ప్రయాణ క్రమాన్ని వివరించి చెప్పటంలో ఒక అవిశ్రాంత సేవాతత్వం భగవానుడిలో ఇమిడి ఉందని తెలిపే ఈ కథాంశం ఆవిర్భావ లక్ష్యం. భగవంతుడిని ఆరాధించేవారు ఆయనలానే అలా నిరంతరం సేవాదృక్పథంతో ముందుకు నడవాలని చెప్పటం ఈ కథాంశంలో కనిపించే సందేశం.

సూర్య దేవాలయాలు-->* కోణార్క్, ఒరిస్సా , * అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్-* అకరం, నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ .--- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
  • సూర్యుని ఎందుకు ఆరాధించాలి?

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసా నికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

-ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సేర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన.

పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందన డానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

-వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహా నికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యా త్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు.

సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.

ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమ స్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకో వడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.

-సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు.సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి . సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది.


మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.

సిద్ధాంతి డా వి.జి. శర్మ=శతాబ్ధి పంచాంగకర్త=శ్రీజ్ఞాన సరస్వతి జ్యోతిష్యాలయము-చిలకలగూడ, సికింద్రాబాద్‌(August 30, 2012)@Surya Telugu daily paper.

  • ==============================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: