Wednesday, December 30, 2009

గురువాయూరప్ప , Guruvayurappa


  • Guruvayur Temple --- courtesy with : wikipedia.org
భగవాన్ నామము స్మరించు. దానివల్ల సమస్త పాపాలు , కామ క్రోధాలు నిర్మూలమవుతాయి . భాగాన్నామము , భగవంతుడు వేరుకావు . చేతులను చరుస్తూ ఉదయం , సాయంకాలమున హరి(హర)నామ సంకీర్తన చేయండి . మీ పాపాలు , బాధలన్నీ మిమ్మల్ని వదిలి పలాయనమౌతాయి . చెట్టుక్రింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టుమీది పక్షలు ఎగిరిపోతాయికదా. చప్పట్లు కొడుతూ హరి (హర) నామము చేస్తే మీ శరీరం అనే చెట్టునుండి పాపాలనే పక్షులు ఎగిరి పోతాయి . - శ్రీ రామకృష్ణ పరమహంస .



కృష్ణుని గురువాయురప్ప అంటారు మలయాళీలు . గురవయ్యారులోని కృష్ణమందిరం అత్యంత పురాతనమైనది . ఆ విగ్రహం వెనక యుగయుగాల కధ ఉంది . తన భక్తురాలికి వరం గా కృష్ణుడే స్వయం గా అందించిన మహిమాన్వితమైన విగ్రహం అది .
ద్వాపర యుగాంతం ప్రళయం సృస్తించిన భగవాన్ శ్రీకృష్ణుడు కలియుగ ఆరంభం వరకు తన విగ్రహాన్ని క్షేమం గా ఉంచమని ఉదావకునికి అందించాడు . ఉదావకుడు ఆ విగ్రహాన్ని గురువు , వాయువుల చేతిలో కలియు ఆరంభం లో పెట్టాడు . ఆ విగ్రహ్హాన్ని ఎక్కడ ప్రతిస్తించాలా ? అని వెతుకుతున్న గురువు , వాయువులకు తగిన ప్రదేశం శివ పార్వతులు చూపించారు . ఆ విధం గా గురు , వాయువుల చేత ప్రతిస్తిమ్పబడిన విగ్రహం కాబట్టి గురువాయురప్ప అయ్యాడు శ్రీకృష్ణుడు . తన భక్తుల పేరునే తానూ ధరించటం చాలా ఆనందమన్నాడు శ్రీకృష్ణుడు . ఆ ప్రదేశమే " గురువాయుర్ " అయ్యింది .


===================================================================

Visit My Website - > Dr.Seshagirirao

No comments: