Monday, October 12, 2009

అమావాస్య , New moon day (No moon day)


అమావాస్య,పౌర్ణమి ఏర్పడే విధానము -----------పౌర్ణమి రోజు చంద్రుడు------------అమావాస్య రోజు చంద్రుడు

అమావాస్య
  • చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. అధి దేవత - చంద్రుడు . నెలకొక అమావాస్య చొప్పునాసంవత్సరానికి 12 అమావాస్ల్య్లుంటాయి . కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి . అమావాస్య కాలమానంలో చీకటి రోజు ... చంద్రుడుని చూడలేని రోజు . . . అయితే భూమండలం లో కొంతమందికే చీకటి , సగానికి చంద్రుడుకనిపిస్తాడు ... ప్రతివానికి ఏదో ఒక రోజు అమావాస్య వస్తుంది ... ఉంటుంది (చీకటి రోజు .. కష్టాలతో కూడుకున్న రోజు) .
  • అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకుముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, సమయంలో పితృదేవతలకు-అర్ఘ్యమివ్వడంవంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

  • అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. తర్వాతఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే-ఆగిపోతారని పండితులు అంటున్నారు. అందుచేతఅమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు.

  • పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు -- దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులుచెబుతున్నారు. రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయనివిశ్వాసం.
స్థూలంగా చెప్పాలంటే, తిథులు అంటే చంద్రుడి కళలు (Phases). వీటిల్లో అమావాస్య, పౌర్ణమి అంటే అందరికీ తెలుస్తుంది. భూమినుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా (నూట ఎనభై డిగ్రీల దూరంలో) ఉంటే అది పూర్ణిమ. ఇద్దరూ కలిసి ఉంటే (ఒకే డిగ్రీలో ఉంటే) అది అమావాస్య.

అమావాస్య నుంచీ పున్నమి వరకూ వచ్చే తిథుల్ని శుక్ల పక్షం అంటారు. మళ్ళా పున్నమి నుంచీ అమావాస్య వరకూ వచ్చే తిథులు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం. శుక్ల పక్షపు తిథుల్నే శుధ్ధ తిథులని కూడా అంటారు. శుక్ల అంటే తెల్లని అని అర్ధం. కృష్ణ అంటే నల్లని అని అర్ధం.

పితృదేవతలు - అమావాస్య-- అనే పేరు ఎలా వచ్చింది ?:

పితృదేవతలనేవారిని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు అనేక పురాణాల్లో ఎదురవుతుంటాయి. ఈ పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుందీ కథాసందర్భం.
ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. అసలీ పితృదేవతలకు, అమావాస్యకు ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవతాగణాలు ఎన్ని? ఎలా ఉంటాయి? అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాలను గురించి తెలియచెప్పే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది. పితృదేవతలు ఏడుగణాలుగా ఉంటాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం నుంచి భ్రష్ఠులయ్యారు. ఇలా భ్రష్ఠులైన కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు కూడా ఆరాధించడం విశేషం. ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.
అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో... అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.

రచన / డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


ముఖ్యమైన కొన్ని అమావాస్యలు :

మహాలయ అమావాస్య" నాడు శ్రాద్ధ కర్మలు చేయండి:

  • ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజునశ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు. ఇందులో మహాలయము అంటే.. భాద్రపదబహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.

సోమవార అమావాస్య

సోమవారాల్లో వచ్చే అమావాస్యను సర్వ అమావాస్య, సోమవార అమావాస్యగా పిలుస్తారని పండితులు అంటున్నారు. సర్వ అమావాస్య రోజున గంగానది, తుంగభద్రవంటిపుణ్యతీర్థాల్లో స్నానమాచరించేవారికి కోటి జన్మల పుణ్యఫలంసిద్ధిస్తుందని పురాణాలుచెబుతున్నాయి.-అంతేగాకుండా.. తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రంతిరువణ్ణామలై ఆలయాన్ని సోమవారం వచ్చే సర్వఅమావాస్యనాడు దర్శనం చేసుకునే వారికి అష్టైశ్వర్యాలుచేకూరుతాయని విశ్వాసం. తిరువణ్ణామలైఆలయంలోపౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ చేసే ఆనవాయితీ ఉంది. అయితే సర్వ అమావాస్య రోజునతిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణచేసే వారికి వెయ్యిమార్లు గిరిప్రదక్షిణ చేసినంత ఫలితందక్కుతుందని పురోహితులుఅంటున్నారు. అమావాస్యరోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, శివునికి నేతిదీపంవెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరచేందుకు అర్ఘ్యమివ్వడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చునని పండితులు అంటున్నారు.


దీపావళి అమావాస్య :

  • రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగనుమనం జరుపుకుంటున్నాం.

  • ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచిపొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడవిరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. పరంపర నేటికీ కొనసాగుతున్నది.

  • మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

  • నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

  • ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చేసందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడినిఅందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.


పోలాల అమావాస్య


  • ముత్తైదువలు అత్యంత భక్తిశ్రద్దల పోలాల అమావాస్యను ఘనంగా జరుపుకొంటారు. ఐదోతనం, సంతానప్రాప్తి, సౌభాగ్యం, కడుపు చలువ కోసం మహిళలు ప్రతిఏటా శ్రావణమాస ఆఖరి రోజు అమావస్య రోజున పోలాలఅమావస్యనుజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పార్వతీదేవి ప్రతిరూపమైన పోలేరమ్మ కంద మొక్కపైఉంటారని ఆచల్లనితల్లి ఆశీస్సుల కోసం ఈరోజున కందమొక్కను పూజిస్తారు. శ్రావణమాసం ఆఖరి రోజు అమావస్యరోజున మహిళలువేకువఝామునే లేచిఅభ్యంగన స్నానాలు ఆచరించితమ పెరట్లో ఉన్న కందమొక్కను పవిత్రంగాతెచ్చి పసుపు, కున్కుమలతో పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగాలని, పిల్లలు ఉన్నవారు కడుపుచలవ కోసం పూజలు చేస్తారు. పోలాల అమావస్య కధను చదువుకుని అక్షంతలు జల్లుకుంటారు. అమ్మవారికివాశినపోలు, పొట్టెంకల బుట్టలుతో పాటు తొమ్మిది రకాల కాయగూరలతో వండిన కలాగాయపులుసును అన్నంతోకలిపి నైవేద్యంగా పెడతారు. చలువ కోసం రజకులకు నైవేద్యాన్ని వాయనంగా అందచేస్తారు. ముత్తైదువలుఅత్యంత పవిత్రంగా పోలాల అమావస్యను భావిస్తారు. చల్లని తల్లి, కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పవల్లి, ఐశ్వర్యప్రదాయిని అయిన పార్వతీదేవికి ప్రతిరూపమైన పోలేరమ్మ తమ వెన్నంటి ఉంటూ ఐదోతనాన్ని, సంతానప్రాప్తిని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ నోము నోచుకుంటారు . పూజించిన మొక్కకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం తిరిగి తమ ఇంటి పెరట్లో నాటారు.

చుక్కల అమావాస్య :

శ్రావణ మాసం అమావాస్య రోజు నుండి మొదలు అగును. ఆ అమావస్యనే చుక్కల అమావాస్య అని
కూదా అందురు. కొంతమంది స్త్రీలకు చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు. ఈ వ్రతం ఐదు ఏళ్ళు చేసుకుంటారు. దీనికి దీపస్తంభ వ్రతము అని కూడా పేరు ఉంది.

నాగోబా జాగోరే!--పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజు

ఆ రోజు అమావాస్యరోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునేరోజు. అయితే అదిలాబాద్‌ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. ఆనందం పండు వెన్నెలై వీరి గుండెల్లో వెల్లివిరిసే రోజు. ప్రతి ఏడాది అంబరాన్నంటే సంబరం రోజు. అదే నాగోబా జాతర రోజు.
ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజు అదిలాబాద్‌ గిరిజనులు నాగోబా జాతర జరుపుకుంటారు. ఈ అమావాస్యకు రెండు వారాల ముందు నుంచే గిరిజనుల్లో సంబరం మొదలవుతుంది. సరిగ్గా ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన 'నాగోబా' (శేష నారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడతాడని ఇక్కడి గిరిజనుల నమ్మకం. అమావాస్యనాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యకాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కన్పిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. అందుకే ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనులే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు నాగోబా దేవాలయానికి వచ్చి ఆ రోజు సంబరం చేసుకుంటారు. నాగోబా జాతర ఇక్కడి గిరిజనుల సంస్కృతికి నిలువటద్దంగా చెప్పుకోవచ్చు. గిరిజనులకు ఇంతటి ఆరాధ్యమైన 'నాగోబా' దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య పర్వదినాన గిరిజనులంతా తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించటానికి ఈ గ్రామానికి కదిలిరావడం వల్ల ఇది ప్రముఖ జాతర స్థలంగా మారింది. అమావాస్య రోజు ఉదయం అయిదు గంటల నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు నాలుగు రోజులపాటు ఘనంగా జరుగుతాయి.

మనరాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి లక్షలాదిమంది గిరిజనులు ఈ స్థలానికి చేరుకోవడం వల్ల ప్రభుత్వం ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి సంవత్పరం అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు గిరిజనుల స్థితిగతులను అవగాహన చేసుకోవటానికి, సమస్యలను తెలుసుకోవటానికి ఈ జాతరకు తరలిస్తారు. రెవిన్యూ,
వ్యవసాయం, పౌర సంబంధాల, భూసౌర పరిరక్షణ, పశుసంవర్ధక, గిరిజనాభివృద్ధి సంస్థ, పట్టు పరిశ్రమలు, స్త్రీ శుశు సంక్షేమం, అటవీశాఖ, వన్యప్రాణి విభాగం వంటి అనేక ఇతర శాఖల ప్రదర్శనలు, గిరిజనుల అభివృద్ధి, ఛాయాచిత్ర ప్రదర్శనలతో జాతర అద్భుతంగా కనిపించేలా జిల్లా యంత్రాంగమంతా కెస్లాపూర్‌లో రూపుదిద్దుకుంటుంది. వందలాది సంవత్సరాల చరిత్ర వున్న నాగోబా జాతర వివరాలను వారి ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే బహు విచిత్రంగా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. కాని ఈ జాతర సందర్భంగా వారి ఆచారాలు నియమాలను చూస్తే వారంటున్నది నిజమన్న భావన కలుగుతుంది.

కొన్ని వందల సంవత్సరాల క్రితం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు. మూల పురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈ నాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోలా, కుడ్మేల్‌, వూరు, పెందూర్‌, నెడ్మ, మెస్రిం అనే ఏడుగురు సోదరులుండేవారు. ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లు ఇంటి పేర్లుగా మారాయి. ఏడు ఇళ్ళ పేర్లుగల గిరిజనులకు ఆరాధ్యదైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాదిగా కేస్లాపూర్‌ గ్రామంలో వెలసిన వారి కులదైవం శ్రీ 'నాగోబా' పూజా ఇత్యాది కార్యక్రమాల నిర్వహణా బాధ్యత మెస్రీంకు అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడానికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే 'మెస్రం' వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మెస్రం. రెండవది భూయ్యాడే మెస్రిం. ఈ రెండు శాఖలవారు నాగోబానే ఆరాధ్యదైవంగా భావించిన రెండవశాఖ వారికి పూజా బాధ్యతలు అప్పగించారు. రానురాను ఈ శాఖవారి వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిపోయింది. అయినా పూజలు నిర్వహించేది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మెస్రిం వంశస్తులకే దక్కింది.

పూజా విధానం

ప్రతి సంవత్సరం నాగోబా దేవతను పూజించడానికి నెలముందు నుంచే గిరిజనుల పడే శ్రమ నాస్తికులకు చాదస్తం అనిపించినా ఆస్తికులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వివిధ వృత్తుల ఆధారంగా 17శాఖలుగా చీలిన మెస్రం వంశస్తులలోని కటోడా దివాకర్‌ గాయికి, ఘాడియా సంకేపాయిలర్‌ వాడే శాఖలవారు కేస్లాపూర్‌ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు. ఇదే వంశంలోని మిగతా శాఖల వారు వారి వెంట వెడితే వెళతారు. ఒకవేళ అత్యవసర పనులుంటే వెళ్ళకపోవచ్చు. కాని మిగతా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్ళాలన్నది నియమం. పై 7 శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరి కలశం తీసుకుని గోదావరి నదికి బయలుదేరుతారు. వారికి ముందుగా వరధాన తెగ, వాయద్య గాండ్రు వాయిస్తూ ఉంటే వెనుక నుండి గిరిజనులు వెడుతుంటారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు అతి భయంకరంగా అరణ్యం గుండా నడిచి వెళ్ళి గోదావరి జలం కలశం ద్వారా తీసుకుంటారు. ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవ ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు.
జలంతో నిండిన కలశాన్ని 40 కిలోమీటర్ల దూరంలోని 'పూసినగూడ' గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్ల కు తరలివెళ్ళి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి వెడతారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తరువాత కేస్లాపూర్‌కు 8కి.మీ. దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్రవెళ్ళి పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్‌ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ (ఇది పూర్వం గిరిజనుల రాజధాని) చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం ఈ మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు. మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా హాజరై నాగదేవతను పూజిస్తుంటారు.

సన్నగిల్లిన 'దర్బార్‌' ప్రాభవం

జాతర సందర్భంగా కేస్లాపూర్‌లో నిర్వహించే గిరిజన దర్బార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. జాతరకు జిల్లాకు చెందిన గిరిజనులందరూ పెద్ద ఎత్తున హాజరు కావడంతో సుమారు 1942 ప్రాంతంలో ఇక్కడికి అధికార యంత్రాంగాన్ని రప్పించి గిరిజనుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాటును ప్రొఫెసర్‌ హేమండార్ఫ్‌ ఏర్పాటు చేయడం వల్ల ఈ దర్బారును అప్పటినుంచి యథావిధిగా కొనసాగించడం జరుగుతోంది. ఈ దర్బారుకు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్‌.పి.లతోపాటు, ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి ఇతర అధికార యంత్రాంగం హాజరై గిరిజనుల సమస్యలను పరిష్కరించడం జరుగుతోంది. రానురాను ఈ దర్బారు నిర్వహణ లాంఛనంగానే కొనసాగుతుంది తప్ప తమ సమస్యను పరిష్కరించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్రక్క విమర్శలు వస్తున్నా అధికారుల్లో ఏమాత్రం స్పందన కలగడం లేదు. దర్బారుపై గిరిజనులకున్న నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. దర్బారుకు పూర్వపు వైభవం సమకూర్చటానికి అధికారం ఘణం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

No comments: