Saturday, October 10, 2009

దసరా, dasara
దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక పేరు వచ్చింది. కొందరు పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతిమూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలనుఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులునవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒకఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. రోజుప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.

ఈ దసరా పండుగ ఎప్పటినుండి ప్రారంభవయినదో ఖచ్చితముగా చెప్పలేము . ఋషులు , మునులు వారి వారి ఊహాగానకు అందుబాటులో ఉన్న రీతిలో ఒక్కక్కరు ఒక్కోరీతిలో చెప్తూవస్తూఉన్నారు . ప్రతి మాసానిదీ ఒక విశిష్టత.. ప్రతి మాసంలోనూ ఒక పండుగ..ప్రతి రోజూ ఒక కొత్తదనం.. అలాంటి మన పండుగలలో దసరా ఒకటి.. మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో శరన్నవరాత్రులు విభిన్న రీతుల్లో జరుగుతాయి. చివరి రోజైన దసరా మరింత సంబరంగా జరుగుతుంది.. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత.. అలాంటి కొన్ని ప్రత్యేకతలను మనం తెలుసుకుందాం..

1.ఆంధ్రప్రదేశ్‌లో...

పచ్చనిపైర్లకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్‌.. మూడు సంస్కృతులను మిలితం చేసుకుని ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారిక్కడ.. ఆశ్వీయుజ శుక్లపాడ్యమితో మొదలైన ఈ ఉత్సవం దశమినాడు వ్రతోద్యాపనతో ముగుస్తుంది.. తొమ్మిది రోజులపాటు జాతరలు, ఉపవాసాలు జరుగుతాయి.. దుర్గమ్మను ప్రతిరోజూ ఓ అలంకారంతో అర్చిస్తారిక్కడ.. మరో విశేషం ఏమిటంటే రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతంలో దుర్గమ్మను 'బతుకమ్మ'గా ఆరాధిస్తారు.. బతుకమ్మ పండగ మన రాష్ట్రంలో తప్ప దేశంలోని మరే ప్రాంతంలోనూ కానరాదు.. ఇది మనకో విశిష్టత..

2 తమిళనాడులో

'భరతనాట్యం'కి పుట్టిల్లు తమిళనాడు. అంతేకాదు శక్తిపీఠమై వెలసింది కామాక్షి ఇక్కడ. తమిళనాడు నవరాత్రులలోని తొమ్మిది రోజులు ప్రతి ఇంటా బొమ్మలకొలువులు దర్శనమిస్తాయి. సర్వాంగ సుందరంగా రంగవల్లులతో తీర్చిదిద్ది బొమ్మల కొలువును పెడతారు. దసరా రోజు గంగ నృత్యాలతో వీధులు కళకళలాడుతాయి.

3 కర్నాటకలో

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన చాముండేశ్వరీ. కర్నాటకలోని నేటి 'మైసూరు' నాటి 'మహిమ్మతి పురం' లో ఉంది. మైసూరు దసరా ఉత్సవాలు జగత్ప్రసిద్ధి గాంచినది. వీటిని 'వడయార్‌' రాజవంశీయులు నేటికీ ఘనంగా నిర్వహిస్తున్నారు. వీరు తమ కులదేవతయైన శ్రీచాముండేశ్వరీ దేవిని పూజించి అర్చిస్తారు. పండుగ నాటి తొమ్మిది రోజులు 'దర్బార్‌' నిర్వహించడం వీరి ప్రత్యేకత. దసరానాడు మల్ల-యుద్ధ ప్రదర్శన, అంచారి ఉత్సవం చూడడానికి రెండు కన్నులు చాలవు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం దసరాను తమ రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించుకుంది.

4 మహారాష్ట్రలో..

మహారాష్ట్రుల ఆరాధ్యదేవత 'తుల్జాభవాని' వీరు గణశ నవరాత్రుల లాగానే దేవీ నవరాత్రులను కూడా విశేషంగా నిర్వహిస్తారు. వీరు అంబాబాయిగా కీర్తించి పూజిస్తారు. 'గోంథళ్‌' పేరిట జరిపే జాగరణ ఎంతో చిత్రంగా ఉంటుంది. అమ్మముందు దివిటీ వెలిగించి ఆమెను భజిస్తారు. పూజ ముగిసేవరకు దివిటీ ఆరకుండా జాగ్రత్తపడతారు.

5 మధ్యప్రదేశ్‌లో..

మహాకాలుడు వేంచేసియున్న నగరి ఉజ్జయిని. ఇది భారతదేశములోని మధ్యభాగంలో ఉన్నది. ఇక్కడ ఉత్సవాలు దేవి పేరిట జరిగినప్పటికీ ఇది 'రామలీల' ఉత్సవంగానే ప్రసిద్ధి పొందింది. రాముడు రావణుని మీద విజయం సాధించినందుకు సంకేతంగా ఇచ్చటి వారు దసరా నిర్వహిస్తారు. పండుగ నాటి రాత్రి రావణ, కుంభకర్ణ, మేఘనాథ విగ్రహాలను బాణాసంచా అమర్చి కాలుస్తారు. అవి పేలిన తర్వాత రావణ పరిహరం రావణుడు విధించబడినందుకు ఆనందంతో ఒకరినొకరు అభినందించుకుంటారు.

6 గుజరాత్‌లో..

సుందర నృత్యాలకు ఆలవాలమైన గుజరాత్‌ రాష్ట్రంలో నవరాత్రి నిర్వహిస్తారు. అంబేమాను ఒక కుండలో ప్రతిష్టించి ఆరాధిస్తారు. ఒక కుండను అందంగా అలంకరించి దానిలో జ్యోతిని వెలిగిస్తారు. అలా ఉన్న కుండను 'గర్బ' అని పిలుస్తారు. ఆ కుండను అమ్మ ప్రతిరూపంగా భావించి అర్చిస్తారు. దేవిముందు ఆడవారు ఒక వృత్తంగా ఏర్పడి 'గార్బా' నృత్యాన్ని ప్రదర్శిస్తారు. మేళతాళాల మధ్య జరిగే ఈ నృత్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వాయిద్యాల హోరు పెరిగే కొద్దీ నాట్యం జోరు పెరుగుతుంది. వీరు మాతను ఆశాపురా, దశాయా, ఖోఢియార్‌యాగా ఆరాధించి తరిస్తారు.

7 పంజాబ్‌లో..

ఔత్తరాహులైన పంజాబు వాసులు వైష్ణోదేవిగా, మాతారాణీగా కొలుస్తారు. ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసాలతో ఏడు రోజుల వరకు ఉంటారు. అష్టమి తిథినాడు తొమ్మండుగురు కన్యలను ఆహ్వానించి వారిని దేవి ప్రతిరూంగా భావించి పూజిస్తారు. వారికి పూరి, హల్వా మొదలగు భక్ష్యాలతో ఎర్రని చునరీ సమర్పించి వ్రతోద్యావపన చేస్తారు.

8 పశ్చిమబెంగాల్‌లో..

శక్త్యోపాసనలో పశ్చిమబెంగాల్‌ మొట్టమొదటి స్థానంలో ఉంది. బెంగాల్‌లో జరిగే పూజ విలక్షణమైనది. అమ్మ వారు వీరి ఇంటి ఆడపడుచు. శ్మశానవాసియైన శివుడు తన భార్య అయిన గిరిజను మూడు రోజుల కొరకు పంపిస్తాడని అలా దుర్గమ్మ తన బిడ్డలైన గణశ్‌, కార్తీకేయ, లక్ష్మీ, సరస్వతులతో వేంచేస్తుందని ప్రతీతి. వీరు దుర్గాపూజను మూడు రోజులుగా జరుపుకుంటారు. దేవిని ఆహ్వానించే వేళ 'ఆగమని గీతికల'ను ఆలపిస్తారు. ఆమెతో కష్టసుఖాలను పంచుకుంటారు. అష్టమి నవమి తిథుల మధ్య వేళ మహిషుని సంహరించిన దేవికి సంధి పూజ చేసి దశమి నాటి వేళ మళ్ళీ మెట్టినింటికి సాగనంపుతారు. పంపే వేళ వీడ్కోలుగా 'నిగమనీ గీతికలు' పాడతారు.

9 రాజస్థాన్‌లో..

రాజపుత్రుల జన్మస్థానమైన రాజస్థాన్‌ విజయ దశమి నాడు శక్తిదేవతయైన జగన్మాతను పూజీస్తారు. నేటి వేళ వీరులు తమ విజయం కొరకు తమ ఆయుధాలను అమ్మ వారికి సమర్పిస్తారు. విలక్షణలు ఎన్నైనా... ప్రత్యేకతలు ఎన్నున్నా... ఆరాధన ఒకటే... ఎలాగైతే అన్ని నదులూ చివరికి సముద్రంతో సంగమిస్తాయో అలాగే పూజావిధి యేదైనా ఆ జగదంబకే చెందుతుంది. నవహంగులతో నవరాత్రిని జరిపి ఆనందిద్దాం..

పూర్తీ వ్యాసము కోసం ఇక్కడ క్లిక్ చేయండి -> దసరా /విజయదసమి / నవరాత్రోత్సవము

No comments: