Monday, February 18, 2013

Maha Kumbh Mela , మహా కుంభ మేళాఅన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --కుంభమేళా-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --దేశం నలుమూలల నుంచేకాక ప్రపంచమంతటి నుంచీ తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కుంభమేళా. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రస్తుతం జరుగున్న కుంభమేళా మార్చి వరకు కొనసాగుతుంది. ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం.  హిందూ సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా భావిస్తారు. మనదేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ. ప్రయాగః అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగ, యమున, సరస్వతీ నదులు ఈ క్షేత్రంలోనే సంగ మించడం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరొచ్చింది. దేశం నలుమూలల నుంచేకాక ప్రపంచమంతటి నుంచీ తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కుంభమేళా. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రస్తుతం జరుగున్న కుంభమేళా మార్చి వరకు కొనసాగుతుంది. ప్రాణికోటి మను గడకు నీరే ఆధారం. కనుక దీన్నిబట్టి నది నీటిని, అందులోనూ గంగానదినే మనం ప్రధమంగా స్మరిస్తాం. సమస్త దేవతలు నివసించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ.

పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానదీ నీటి ప్రత్యేకత. విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమిపైకి వచ్చిందని, దీనిలో స్నానం చేస్తూ అన్నీ పాపాలు పోతాయని హిందువుల భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తుంటాయి. వీటికి అంతర్వాహినిగా సరస్వతీ నదిగా కూడా ప్రవహిస్తుంది. అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమ తీరంగా పిలుస్తుంటారు. పర్వదినాల్లో ఈ నదిలో స్నానం ఆచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాక కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.

కుంభమేళా ప్రాశస్త్యం

కుంభమేళాకు హిందూపురాణాల్లో ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అసురుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువును ఆశ్రయిస్తాడు. అమృతం కోసం
సాగర మధనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు. దేవ, దానవులు సముద్ర మధనం చేస్తూండగా అమృత కలశం ఒకటి బయటకు వస్తుంది. అమృతం కోసం దేవ
దానవులు పన్నెండు రోజులు, పన్నెండు రాత్రులు (మనుష్యుల ప్రకారం 12 సంవత్సరాలు) ఘోర యుద్ధం చేశారు. దీన్ని రాక్షసులు తాగితే అజేయులవుతారని భావించిన దేవతలు
మహా విష్ణువును ప్రార్థించగా, స్వామి మోహిని అవతారం ఎత్తుతారు. విష్ణువు చేతిలోని కలశం నుంచి నాలుగు అమృత చుక్కలు అలహాబాద్‌, హరిద్వార్‌, ఉజ్జయిని నాసిక్‌లలోని
పుణ్యనదుల్లో పడ్డాయని భాగవతం, విష్ణుపురాణం, మహాభారతం, రామాయణం తదితర పురాణాల కథనం. మరో కథ కూడా ఉంది. సాగర మధనంలో ఉద్భవించిన అమృత కలశాన్నిమోహిని అవతారం లోని విష్ణువు తన వాహనమైన గరుడుడి కిచ్చి భద్రపరచ మంటాడు. గరుడుడు కలశాన్ని తీసుకెళ్తుండగా నాలుగు చోట్ల ఈ చుక్కలు పడతాయట.
ఆ నాలుగు చోట్లే ''ప్రయాగ'' అలహాబాద్‌లోని ''హరిద్వార్‌'' (ఉత్తర ప్రదేశ్‌) ''నాసిక్‌'' (మహాష్ట్ర) ''ఉజ్జయిని'' (మధ్యప్రదేశ్‌) అందుకే ఈ నాలుగు చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. ప్రతి
మూడేళ్లకోసారి ఒక్కోచోట రొటేషన్‌ పద్ధతిలో కుంభమేళా జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి పన్నేండేళ్లకోసారి కుంభమేళా జరుగుతున్నది.

Courtesy with ---- కె.రామ్మోహన్‌ రావు, గద్వాల


చరిత్ర,విశిష్టత

 -కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనే ది ఒక రాశి. మేళా అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందు ధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి. వేద కాలం నుంచి కుంభమేళా ఆచరిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృత భాండానికై దేవ-దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు భాండాన్ని తీసుకొని పోతుండగా అలహాబాద్‌, హరిద్వార్‌, ఉజ్జయిని, నాసిక్‌లలో కొన్ని అమృతపు చుక్కలు జారవిడిచారని నమ్ముతారు.
అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా  జరుగుతుంది. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా  జరుగుతుందన్నమాట.

ఆరేళ్లకోసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని.. పన్నెండేళ్లకొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకోసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇక చరిత్రలో క్రీ.శ 629 ప్రాంతంలో హర్షవర్ధనుడి కాలంలో భారత పర్యటన చేసిన చైనా యాత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ రచనల్లో సైతం కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ది సీబీఎస్‌ సండే మార్నింగ్‌ అనే 
ప్రముఖ అమెరికన్‌ షో 18, 2010 హరిద్వార్‌ కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద మత కార్యక్రమంగా అభివర్ణించింది.ఏప్రిల్‌ 28, 2010న బీబీసీ కుంభమేళాను ..గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌ గా ఒక రిపోర్టును వెలువరించింది. దీన్ని బట్టి కుంభమేళ ఎంత ప్రశస్తమైందో తెలుసుకోవచ్చు.

సమయం
సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అహాబాద్‌ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. చివరగా 2010 జనవరి-మార్చిలో హరిద్వార్‌లో పూర్ణకుంభమేళాను నిర్వహించారు.

ఆచార వ్యవహారాలు
-ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాతో పవిత్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితి. వేల పంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ప్రత్యేత. పురాతన సాంప్ర దాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు వొళ్లంతా విబూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులనే సాధువులు దిగంబరులై కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ అత్యధికంగా నాసిక్‌ కుంభమేళాలో 7.5కోట్ల మంది పాల్గొన్నారు.

ఏ రోజుల్లో ప్రశస్తమంటే
కుంభమేళాలో కొన్ని రోజులను అత్యంత పవిత్రమెనవిగా భావిస్తారు. ఈ ఏడాది జనవరి 14 (మకర సంక్రాంతి), 27 (పౌర్ణమి), ఫిబ్రవరి 6 (ఏకాదశి), 10 (అమవాస్య), 15 (వసంత పంచమి), 17 (రథ సప్తమి), 18 (భీష్మాష్టమి), 25 (మాఘ పౌర్ణమి) దినాలలో ఎక్కువ మంది భక్తులు కుంభమేళాకు స్నానాలు చేయటానికి వస్తారని భావిస్తున్నారు.

రివేణి సంగమంలో ఆధ్యాత్మిక సంరంభం మహా కుంభమేళా -

అహాబాద్‌ : మహాకుంభమేళా..ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ధార్మిక మహోత్సవానికి రంగం సిద్ధమైంది. యావత్‌ హిందువులు అత్యంత పవిత్రమైన తీర్థంగా భావించే అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో దాదాపు పది కోట్ల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరాలను ఉత్తరాదిన కుంభమేళా అంటారు.

అలా 12 పర్యాయాలు వచ్చే కుంభమేళాను ’మహా కుంభ మేళా’గా పిలుస్తారు. ఇప్పుడు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరుగనుంది. ఈ నెల 14 నుంచి 56 రోజులపాటు జరిగే కుంభమేళా కోసం ఉత్తర్రపదేశ్‌ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఏర్పాట్లు ప్రారంభించింది. గత కుంభమేళా కన్నా ఈ సంవత్సరం 10 శాతం ఎక్కువ మంది భక్త జనం పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేడు మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 1.1 కోట్ల మంది భక్తులు త్రివేణి పుణ్య తీర్థంలో స్నానమాచరించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసేందుకు అటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. భారీ ఎత్తున భక్తులు, ఆధ్యాత్మిక గురువులు హాజవుతున్నందున వీరం దరికీ భద్రత ఏర్పాట్లు ఒకింత కష్టమే అయినప్పటికీ అటు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం విస్తృతమైన కార్యచరణతో ముందుకు వెళ్తుంది.

ఉగ్రవాద దాడులు జరుగుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో దాదాపు 7000 మంది కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దిగనున్నారు. అలాగే పలు కంపెనీల రాపిడ్‌ యాక్షన్‌
దళాలు, కేంద్ర విపత్తు నివారణ సంస్థ సిబ్బం దిని కుంభమేళా భద్రతా ఏర్పాట్లకు వినియోగించనున్నారు. -అలహాబాద్‌ ఐజీ అలోక్‌నాథ్‌ను శాంతి భద్రతల ఏర్పాట్లకై నోడల్‌ అధికారిగా నియమించారు. 2001లో కుంభమేళా జరిగినప్రాంతం దాదాపు 2,802 ఎకరాలు ఉంటే.. ఈసారి అది 4,932 ఎకరాలకు పెరిగింది. స్నానఘట్టాల వద్ద అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. కుంభనగరిలో 600 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఇప్పటికే పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు.


Hezards of kumbhamela, కుంభమేళా వలన కాలుష్యం.

మనదేశంలోని  నదులకు  పుష్కరాలు నిర్వహించడం అనాదిగా ఉన్న సంప్రదాయం. మనదేశంలోని  నదులకు  పుష్కరాలు నిర్వహించడం అనాదిగా ఉన్న సంప్రదాయం. సూర్యుడు, బృహస్పతి గ్రహ స్థానాల ఆధారంగా ఒక్కో ఏడాది  ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి.  బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నందుకు ఈసారి గంగానదికి పుష్కరం.  ఉత్తరాదిన ఈ వేడుకను కుంభమేళాగా పిలుస్తారు. కుంభమేళా సందడితో అలహాబాద్‌లో వాతావరణం మారిపోయింది. సంక్రాంతి నుంచి 56రోజులపాటు అంటే మార్చి 10 వరకూ మహా కుంభమేళాను నిర్వహిస్తున్నారు..వంద మాఘస్నానాలు.. వేయి కార్తీక స్నానాలు.. కోటి నర్మదా స్నానాలు చేసినంత ఫలం ఒక్క కుంభమేళాలో ఒక్కసారి స్నానం చేస్తే వస్తుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద పేర్కొన్నారు. వంద వాజపేయ యాగాలు.. వెయ్యి అశ్వమేథాలు.. లక్ష భూ ప్రదక్షిణలతో సరిసమానమైన ఫలం ఈ స్నానం వల్ల కలుగుతుందని కూడా ఆయన చెప్పారు. ప్రపంచంలోనే కుంభమేళా అతిపెద్ద ఉత్సవమన్నారు. సాధువులు, సంతులు, యోగులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ కుంభమేళాకు లక్షల సంఖ్యలో వస్తారన్నారు. ప్రతి పన్నెండేళ్ళకోసారి జరిగే కుంభమేళాలో భక్తులకు ప్రయాగలోని తన ఆశ్రమంలో భోజన సదుపాయాల్ని కల్పించడంతో పాటు వారికి కుంభమేళా విశిష్టతను తెలపడం స్వామిజీకి సంప్రదాయంగా వస్తోంది.

అందువల్ల పవిత్ర గంగా నది జలాలను సాగుకు వినియోగించడం, కాలుష్యాలను వదలడం, జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించడం వంటి ...వాటివలన కుంభమేళాలో తమదైన ప్రత్యేకత చాటుకుంటున్న వారు మాత్రం నాగసాధువులే. జడలు కట్టిన జుట్టు, ఎముకలు కొరికే చలి ఉన్నా ... శరీరంపై విబూతి  తప్ప నూలిపోగు కూడా లేకపోవడం, త్రిశూలాన్ని పట్టుకుని తిరగడం వారి విశిష్టత. ఏది దొరికితే అది తినడం, మృత్యువంటే భయపడకపోవడం, దిగంబర నృత్యాలు చేయడం వారికే చెల్లు. హిమాలయాల్లో ఎక్కువగా గడిపే వీరు ఎక్కడ కుంభమేళా జరిగితే ... అందరికన్నా ముందే ప్రత్యక్షమవుతారు. మేళా పూర్తయ్యే వరకూ ఉండి వెనుదిరుగుతారు. పొగాకు పీలుస్తూ దర్శనమిచ్చే ఈ నాగసాధువులు 24 గంటలపాటు శీర్షాసనంలోనే ఉండగలరు.

నిర్మలంగా ప్రవహించే నీటికి బదులుగా పట్టణాల, నగరాల మురికినీరు, విషపూరిత పారిశ్రామిక వ్యర్థాలు గంగ ప్రవాహమార్గంలో ముందుకు సాగిపోతున్నాయి. నీరు ఉన్న చోట అది తాగడానికి పనికిరాని విధంగా కలుషితమైపోయి ఉంటోంది; స్నానానికి నిరుపయోగంగా ఉంటోంది. దాదాపు 300 కోట్ల లీటర్ల మురికినీరు గంగలోకి పారుతోంది. ఈ చేదు నిజాన్ని చెప్పింది సాక్షాత్తు మన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. నదిలో పారుతున్నదేమిటి? మురికినీరే సుమా!
  •                                     -----------------------------
 మురికినీటిలో పవిత్ర స్నానమా? యాత్రికులు గంగ కాలుష్యాన్ని పట్టించుకోకపోవచ్చు; గంగలో ఒకసారి మునిగి తేలితే చాలు. అంతే వారికి కావల్సింది. కానీ, ఇలా ఎంతకాలం? గంగమ్మ రోగగ్రస్థమయింది. ఆ మహానది మన అస్వస్థ నాగరికతకు చిహ్నంగా ఉంది. బ్రహ్మపుత్రా ఝరిని తన గళంలో విన్పించే అసోం మహాగాయకుడు భూపేన్ హజారికా (గత ఏడాది కీర్తిశేషులయ్యారు) గంగానది కాలుష్యంపై ఒక నిరసన పాట పాడారు.

ప్రజలు తమ మనస్సులో ఇంకించుకున్న ఆ పాట ఆ నదీ పరీవాహక ప్రాంత వాసుల పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, కడగండ్లను వివరిస్తుంది. రాజకీయాలలో అవినీతి, సమాజంలో నైతిక విలువల పతనం గురించి బాధపడుతూ ఆ పాట ఇలా ప్రశ్నిస్తుంది: 'విస్తార్ హై అపార్, ప్రజా దోనో పార్, కరే హాహాకార్, నిశ్శబ్ద్ సదా/ ఓ గంగా తుమ్, ఒహో గంగా బేటీ హో క్యోఁ' (నీ ప్రవాహానికి ఆవలి, ఈవలి తీరాన నివశిస్తున్న వారు బాధతో అరుస్తున్నారు. అయినా ఓ గంగా, ఎటువంటి నిరసన తెలుపకుండా మౌనంగా ఎందుకు ప్రవహిస్తున్నావ్?) భూపేన్ ఇప్పుడు సజీవుడుగా ఉండి గంగపై పాడే కొత్త పాట గంగమ్మ హాహాకారాలను అభివర్ణించి వుండేదని నేను భావిస్తున్నాను. గంగా మాత దుస్థితి పట్టించుకోకుండా భారతీయులు ఎందు కు అంత మౌనంగా ఉండిపోయారని భూపేన్ తప్పక ప్రశ్నించేవారు.

గంగానదికి వ్యతిరేకంగా జరుగుతోన్న దురాగతాలను నివారించడానికి ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ అన్నారు. మాటలు సరే, చర్యలు ఏవి? ఇప్పుడు ఆచరణ కదా ముఖ్యం. నిజంగా అటువంటి జాతీయ కమిషన్ ఏర్పాటు చేసే యోచనే ఉంటే గంగానదిపై నిర్మాణంలో ఉన్న, నిర్మించడానికి ప్రతిపాదించిన ఆనకట్టలన్నిటిపైన పునరాలోచన చేయాలి. ఆ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. ఉత్తరాఖండ్ విద్యుత్తు అవసరాలను దేశంలోని మిగతా రాష్ట్రాలు తీర్చే విధంగా చర్యలు చేపట్టాలి. ఇందుకు అవసరమైతే తగు నష్ట పరిహారం చెల్లించాలి.

ఏటా 20వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ సౌర శక్తి కార్యక్రమం అమలును యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలి. విద్యుచ్ఛక్తి చోరీని అరికట్టాలి. సరఫరా, పంపిణీలలో జరుగుతున్న వృధాను నివారించాలి. ఇలా చేయడం ద్వారా కనీసం 20వేల మెగావాట్ల విద్యుత్తును ఆదా చేసుకోవచ్చు (ఇది, ఉత్తరాఖండ్‌లో నిర్మిస్తున్న వివిధ విద్యుదుత్పాదన ప్రాజెక్టుల మొత్తం విద్యుదుత్పాదన లక్ష్యం. నిజానికి ఉత్తరాఖండ్ అవసరాలకు 4000 మెగావాట్ల విద్యుత్తు సరిపోతుంది). అలాగే సాగునీటిని వృథా చేయడాన్ని కూడా నివారించాలి.

గంగా పరీవాహక ప్రాం తంలోని నీటి వనరులలో కేవలం పదో వంతు నీటివనరులు మాత్రమే ఉన్న ఇజ్రాయెల్ మనకంటే పదిరెట్లు ఎక్కువగా ఆహార ధాన్యాల దిగుబడిని సాధిస్తోంది. నీటిని పొదుపుగా వాడుకోవడానికి అవసరమైన అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉండడం, కొత్త సాగు పద్ధతులను అనుసరించడం వల్లే ఇది సాధ్యమవుతోంది. మరో ముఖ్యమైన చర్యను కూడా తక్షణమే చేపట్టాలి. పంచాయత్‌లు, పురపాలకసంఘాలు, పరిశ్రమలు మురికినీటిని, వ్యర్థ పదార్థాలను నదిలోకి వదలడాన్ని నిషేధిస్తూ కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకురావాలి.

ఈ చట్టానికి ఆయా సంస్థలు కట్టుబడి ఉండేందుకు అవసరమైన ప్రోత్సాహకా లివ్వాలి. ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధించాలి. వేదాల కాలంలో వలే కాకపోయినా మన జాతీయోద్యమ కాలంలో ఉన్న విధంగానైనా గంగానదిని మళ్ళీ మనం ఒక స్వచ్ఛవాహినిగా చేసుకోవాలి. గంగనే కాదు, దేశంలోని అన్ని నదులు నిర్మలంగా, స్వేచ్ఛగా, అన్ని ఋతువులలోనూ ప్రవహించే విధంగా మనం సంకల్పం వహించాలి. మన సహజవనరులను వివేక వంతంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోని పక్షంలో మన జాతీయ ధర్మం, చిరంతన నాగరికత కాలంలోకి జారిపోవడం ఖాయం.

Courtesy with - సుధీంద్ర కులకర్ణి


  • ========================
Visit My Website - > Dr.Seshagirirao ->

No comments: