Sunday, February 12, 2012

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు, Worshiping with SilverLights and results




అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--

నమ్మకము ప్రధానము .. నమ్మకము మూఢనమ్మకము కాకూడదు .

-వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.

  • 1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
  • 2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
  • 3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
  • 4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
  • 5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.
  • 6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
  • 7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
  • 8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
  • 9. రాహువు - సంపదలు కలుగుతాయి.
  • 10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.
  • 11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.
  • 12. మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
  • 13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.
  • 14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.
  • 15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.
  • 16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.
  • 17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.
  • 18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.
  • 19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.
  • 20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.



ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు...

  • 1. మేషరాశి - త్రివత్తులు (3)
  • 2. వృషభరాశి - చతుర్‌వత్తులు (4)
  • 3. మిధునరాశి - సప్తవత్తులు (7)
  • 4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)
  • 5. సింహరాశి - పంచమవత్తులు (5)
  • 6. కన్యరాశి - చతుర్‌వత్తులు (4)
  • 7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
  • 8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
  • 9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)
  • 10. మకరరాశి - సప్తమవత్తులు (7)
  • 11. కుంభరాశి - చతుర్‌వత్తులు (4)
  • 12. మీనరాశి - పంచమవత్తులు (5)



జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు...

  • 1. మేష లగ్నం - పంచవత్తులు (5)
  • 2. వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
  • 3. మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
  • 4. కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
  • 5. సింహ లగ్నం - త్రివత్తులు (3)
  • 6. కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
  • 7. తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
  • 8. వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
  • 9. ధనుర్‌ లగ్నం - పంచమవత్తులు (5)
  • 10. మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
  • 11. కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
  • 12. మీన లగ్నం - ద్వివత్తులు (2)



మూలము : సూర్య తెలుగు దినపత్రిక ఆదివారము అనుబంధము
  • =============================
Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments: