Friday, June 17, 2011

రంభా వ్రతం, Rambha Vratamuఅన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -రంభా వ్రతం (Rambha Vratamu) - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--  • జ్యేష్ట మాసము - జ్యేష్ట శుద్ధ తదియ
జ్యేష్ట శుద్ధ తదియ రోజున రంభా వ్రతం , రాజ్య వ్రతం, త్రివిక్రమ తృతీయా వ్రతము అను వ్రతములు ఆచరిస్తారు. ఇందులో రంభా వ్రతము కొంత వరకు ఆచరణలో వున్నది. తపో నిష్టలో వున్న శివుడు వుపచారించడానికి హిమవంతుడు తన కూతురు పార్వతిని అప్పగించాడు. పార్వతి యందు శివునికి ప్రేమ కలగడానికి ఆ సమయములో మన్మధుడు తన బాణాలను ప్రయోగించాడు. శివునికి చిత్తం చెదిరింది. అందుకు శివునికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరచి కొగానే మన్మధుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడ నుండి వెళ్లి పోయాడు.

పార్వతి చిన్న బుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి ఎదురుగా వచ్చి ఆమెను గుచ్చి కౌగిలించుకుంది. పార్వతి బావురుమంది. తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకు వెళ్ళింది. ఇంతలో అక్కడికి సప్తమహర్షులు వచారు. . వారికి హిమవంతుడు తనకూతురు సంగతి చెప్పాడు. అప్పుడు ఆ మునులలో భ్రుగువు ఆమెను ఒక వ్రతం ఉంది నీవు ఆ వ్రతం చేస్తే శివుడు నీకు భర్త అవుతాడు. అని పలికారు.

అప్పుడు పార్వతి ఆ మహర్షులను ఆ వ్రతమును ఎప్పుడు, ఎలా చేయాలి అని అడిగింది. దానికి ఆ మునివర్యులు ఈ విధంగా చెప్పారు. బిడ్డా! ఈ వ్రతాన్ని పెద్దలు "రంభా వ్రతము" అంటారు. రంభ అనగా అరటి చెట్టు. ఆ వ్రతాన్ని జ్యేష్ట శుద్ధ తదియ నాడు చేయాలి. ఆనాడు ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచ వాళ్ళేనా ముగ్గులు పెట్టాలి. రంభ కు అధిష్టాన దేవతా సావిత్రి కనుక అరటి చెట్టు క్రింద సావిత్రి దేవిని పూజించాలి.

అంతట పార్వతి మహాషయా! అరటి చెట్టుకు సావిత్రి దేవి అధిష్టాన దేవతా ఎలా అయ్యింది. అని అడిగింది. దానికి సమాధానముగా భ్రుగువు ఇలా అన్నాడు. బిడ్డా! సావిత్రి, గాయిత్రి అని బ్రహ్మ దేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రి దేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్ళడం మానివేసింది. గాయిత్రి ఆమెకు చాలా దూరము చెప్పి చూసింది. సావిత్రి తన మంకు పట్టును వదలలేదు. బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలిపో మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని అతడు సావిత్రిని శపించాడు.

అప్పుడు సావిత్రికి పశ్చాత్తాపం కలిగింది. బ్రహ్మ కాళ్ళ మీద పడి మన్నించ మని ప్రాధేయ పడింది. కాని బ్రహ్మకు దయరాలేదు. గత్యంతరము లేక సావిత్రి భూలోకానికి వచ్చి అరటి చెట్టయి పుట్టింది. అరటి చెట్టుగా ఆమె బ్రహ్మగురించి అయిదు సంవత్సరములు తపస్సు చేసింది. అప్పటికి బ్రహ్మ కు మనస్సు కరిగింది. జేష్టశుద్ద తదియనాడు అతడు సావిత్రికి ప్రత్యక్షమయ్యాడు. "నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు అరటిచెట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు ఈడేరుతాయి. ఇక నీవు నాతొ సత్య లోకానికి రావచ్చు" అంటూ బ్రహ్మ ఆమెను తీసుకొని పోయాడు. సావిత్రికి శాపమోక్షమైన దినము కాబట్టి జ్యేష్ట శుద్ధ తదియ ఒక పర్వదినమైనది.

అప్పుడు పార్వతి "స్వామీ! అయితే ఈ వ్రతం సాంగం చేసే నియమాలు దయచేసి తెలియ జేయండి. అని కోరింది. అందు మీద భ్రుగు మహర్షి బిడ్డా! ముగ్గులు పెట్టి అరటిచెట్టు కింద మంటపం వేయవలెను. దానిని సరస పదార్ధ సంపన్నం చేయాలి. అరటి చెట్ల నీడను పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్త్రోత్రం చేయవలెను. రాత్రి జాగరణము చేయాలి. మరునాటి నుంచి పద్మాసనస్త అయి పగలు సావిత్రి స్త్రోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్ల క్రిందనే విశ్రమిస్తూ వుండాలి. ఇలా నెలరోజులు చేసి ఆ మీద సరస సంపన్నమైన ఆ మంటపమును పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఈ వరకు లోపాముద్ర చేసి భర్తను పొందింది. అని చెప్పాడు.

పార్వతి ఆవిధముగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దేక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్ళాడాడు. ఇది రంభా వ్రత గాద.


  • ===========================

Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments: