Friday, June 17, 2011

జ్యేష్ట మాసం - విశేషం , Jaesta masam importance

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము - జ్యేష్ట మాసం విశేషం - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--


శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం 'జ్యేష్టమాసం'. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు.

వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అట్లే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలోఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వవలెను.అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.

జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానమాచరించి గంగానదిని పూజించవలెను. అలా వీలు కానివారు ఇంటియందే గంగానదిని స్మరిస్తూ స్నానం ఆచరించవలెను.


మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి.

రంభా వ్రతము.

దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పేరు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించవలెను. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.

వట సావిత్రీ వ్రతం.

జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించవలెను వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రంను పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయవలెను.

జ్యేష్ట శుద్ధ దశమి

దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు.దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.

జ్యేష్ట శుద్ధ పూర్ణిమ.

దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు.ఈ దినం రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ దినం భూదేవిని పూజించడం మంచిది.

(Author: జ్యోతి)

Visit My Website - > Dr.Seshagirirao ->-

No comments: