భారతావని పుణ్యభూమి. ఎందరో మహాను భావులు జన్మించి, ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన పవిత్రస్థలం. ఆధ్యాత్మికత మన జాతిరకం. భగవ త్తత్వానికి, తలమానికంగా, ఎన్నో వేదాలు, ఉపని షత్తుల వంటి మహోన్నత, అతి పవిత్ర, గ్రంథా లకు పుట్టినిల్లు ఈ పుడమి.
వీటిలో సర్వ ఉపనిషత్తులలో శ్రేష్ఠమైనది, సత్య మైన బ్రహ్మ విద్య, అతి గొప్పదైన యోగశాస్త్రం, త్యాగమును, జ్ఞానమును బోధించునదే భగవద్గీత.
భగవద్గీత సాక్షాత్ భగవంతుడగు శ్రీకృష్ణునిచే స్థిరముగా నాటబడి, వేదవ్యాస మహర్షి చేత పెంచబడిన కల్పతరువు. గీతాశాస్త్రం అతి ముఖ్య మైన శాస్త్రం. అందుకే అనేక సందర్భాలలో స్వామి సుందరచైతన్యానంద ఇలా అంటారు- 'విశ్వఖనిలో నేటి వరకూ లభించిన జ్ఞానమణు లల్లో అమూల్యమైనది భగవద్గీత.
స్వయముగా భగవానుడగు నారాయణునిచే అర్జునునకు బోధించినదియు, సనాతన రుషిపుంగ వుడగు వ్యాస భగవానునిచే మహాభారత మధ్య మున చేర్చబడినదియూ, పదునెనిమిది అధ్యాయా లతో శోభించుచూ, అద్వైతామృతమును వర్షిం చుచూ, భవరోగమును రూపు మాపు నట్టిదే భగవద్గీత.
మానవుని మహనీయునిగా మార్చగల అద్భుతశక్తి గల భగవద్గీతను ఒక పుస్తకం అనే కంటే 'ఒక అపారమైన దేదీప్యమానమైన వెలుగులను కల్గి, విజ్ఞానములనెడి కిరణములను ప్రసరింపచేసే ఒక దివ్యజ్యోతి అనుటయే సబబు. అందుకే గీతకు ఇంత వ్యాప్తి లభించింది.
భగవద్భక్తితో గీతాపఠనం, పాఠనం, విచారణం, శ్రవణం చేయు మానవుని సర్వపాపములు నశించి, జ్ఞానసిద్ధిని పొంది, జీవన్ముక్తిని చేరుకుం టున్నాడు.
అంతేగాక భగవద్గీత ఏ ఒక్క మతానికో సొంత మైన ఆధ్యాత్మిక గ్రంథం కాదు. అన్ని మతస్థులు, భూపాలుర నుండి గోపాలుర వరకూ పండితుల నుండి పామరుల వరకూ, ఉన్నత జాతుల నుండి నిమ్నజాతుల వరకూ, చివరకూ, స్త్రీలైనా, పురుషులైనా, బాలలైనా, వృద్ధులైనా, మనుష్య మాత్రులెవరైనా ఈ మహామృత పానం చేయ వచ్చు. ఇంతటి విశాలార్థం అగాధ భావం, సమ త్వమున్న గ్రంథం అన్యం లేదన్న అతిశయోక్తి కాదు. అందుకే కాబోలు శంకరాచార్యుల నుండి సామాన్యుల వరకూ అందరూ గీతాపఠనం నందు ఆసక్తి కలిగి ఉన్నారు.
- ==========================================
No comments:
Post a Comment