Tuesday, November 30, 2010

క్షీరాబ్ధి ద్వాదశి , kshiraabdhi Dwaadashi,చిలుకు ద్వాదశి

ఆషాడ మాసం లో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరం లో శయనించిన విష్నుభగవానుడు ... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడని , అలా నిద్రనుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ఏకాదశి గాను ఆ మరుచటి రోజు క్షీరాబ్ధి ద్వాదశి గాను భక్తులు పండుగను జరుపుకుంటారు .

[Vishnu+&+Laxmi.jpg]
చరిత్ర కథలు :
  • కృతయుగం లో దేవతలు , రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే " క్షీరాబ్ధి ద్వాదశి " అని పిలుస్తారు .
  • అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక " చిలుక ద్వాదశి" అని ,
  • అమృతం కోసం సాగరాన్ని మధించారు గనుక "మధన ద్వాదశి" అని వాడుకలో ఉంది .
  • క్షీరసాగర మధనము లో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . లక్ష్మీ కల్యాణము జరుపుతారు .
  • శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతం గా బ్రహ్మ , ఇంద్రాది దేవతల తో కలసి బృందావనానికి వెళ్ళారు అంటారు ... అందుకే ఈ రోజుని " బృందావని ద్వాదశి" అని కుడా అంటారు .
  • బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము)జరిగి బృంద తులసి చెట్టు గాను , విష్ణువు సాలగ్రామం (శిలగా)గా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక " బృంద ద్వాదశి " అంటారు .
  • దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీకృష్ణునికీ కార్తీక ద్వాదశినాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కల్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళినాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంటినిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు.
  • చాతుర్మాస్యవ్రతం ఆచరించిన సాధకులు కార్తీకశుద్ధ ద్వాదశిరోజు వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

పూర్తి వివరాలకోసం -> కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతం
  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: