ప్రార్ధన ---
ఒక అద్భుత శక్తి ,
విశ్వాసానికి సంకేతం ,
ఒక శరణాగతి ,
ఒక జీవన దృక్పధం .
దేవుడు ఉన్నాడని కొందరు , దేవుడు లేడని కొందరు ... ఇది ఎవ్వరికీ తెలియని విషయము . ఉన్నాడని నమ్మవచ్చు ... లేడని నమ్మవచ్చు . నమ్మకమనేది రెంటిలోను ఉన్నది .. దేవుడు నమ్మిన దానిలోను , నమ్మని దానిలోనూ ఉన్నాడు . నమ్మకమంటే మనకు తెలియనిదాని గురించి ఊహించుకోవడం . నమ్మకమనే దేవుడు జీవికి , జీవగమనానికి ఆదారము . ప్రతి జీవి రేపు ఉందనే నమ్మకం తోనే ఈ వేళ బ్రతుకుతున్నది . రేపు సుఖం గాను , విజయవంతం గాను , ఒడిదుడుకు లేకుండా సజావుగాను , సక్రమము గాను జరగాలని మనసు లో నమ్మకాన్ని పెంచుకోవడం ... ఆ మార్గము లో పయనించడం ... ఆ ప్రయాణానికి అవసమయ్యే శక్తి యే ఈ ప్రార్ధన . ప్రార్ధన మార్గాలు ఎన్నో ... మనిషి మనిషి కీ.. మనసు మనసు కీ ఒక్కొక్కటి . మాటలతో ప్ర్రార్ధన , పాటలతో ప్ర్రార్ధన , చేతలతో ప్రార్ధన , మౌనము తో ప్రార్ధన ఇలా ఎన్నోవిధాలు గా ప్రార్ధనా మార్గాన్ని ఎంచుకుంటున్నాయి , ఈ జీవులు .
మనిషి లోని ఈ నమ్మకం ఎంతో శక్తివంతమైనది .. ఈ నమ్మకము ఎన్నడు మూడనమ్మకము కాకూడదు . ప్రతి వస్తువులోను జీవం ఉంటుంది . ప్రతి జీవిలోను శక్తి ఉంటుంది . ఆ శక్తి అనంతమైనది , అనిర్వచనీయమైనది , అభేద్యమైనది .. ఆ శక్తి నే నమ్ము ... అదే దేవుడు, దెయ్యము , దైవము , దేవత , , మిత్రువు , శత్రువు .
జీవికి జీవే దైవము .. జీవికి జీవే దెయ్యము ,
జీవికి జీవే మిత్రువు .. జీవికి జీవే శత్రువు ,
ఆ శక్తి ... అన్ని వేళల , అన్ని చోట్ల , అన్ని జీవుల లోనూ ఉంది .
ఇందుగలదు అందులేదని సందేహము వలదు , ఎందెందు వెదకిచూసునా అందందే గలదు శక్తి .. విశ్వాసము ఉంటే .
ప్రార్ధన అంటే ...
భగవంతుడి పై విశ్వాసము ,
కస్ఠకాలము లో ఒక ఓదార్పు ,
సాయానికి మారుపేరు ,
మాటలు లేని హృదయము ,
స్వర్గ నరకాల కు ఓ మాధ్యమం ,
క్లిష్ట సమయాల్లో ఓ దృఢత్వం ,
ఓ అద్భుతమైన హీలింగ్ ,
జీవరాసుల మధ్య ఒక అనుసంధానము .
ఏ భాష నందైనా ,ఏ జాతి నందైనా , ఏ మతము నందైనా , ఏ దేశమందైనా , ఏ లోకమందైనా .. ప్ర్రార్ధన ఒక్కటే .. అది ఓ అద్భుతమైన హీలింగ్ .
- సంకల్పము : డా . వందన శేషగిరిరావు - శ్రీకాకుళం .
- ======================================
No comments:
Post a Comment