Sunday, August 22, 2010

శని త్రయోదశి , Shani Triyodashi


  • [shani+on+black+crow.jpg]


చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. అధి దేవత - మన్మధుడు. నెలకు రెండు త్రయోదశి లుంటాయి . సంత్సరానికి 12 త్రయోదశి లు . అధిక మాసము ఉన్న సంవత్సరాన్నికి 14 త్రయోదశి లు ఉంటాయి. ఇందులో కొన్ని త్రయోదశి లకు హిందువులలో విశిస్టమైన ప్రాధాన్యత ఉంది .

ప్రతి మానవుడు, ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. శనికి ఇష్టమైన రోజు శనివారం, అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు.

శనిత్రయోదశి : ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు.

ధన త్రయోదశి-- ఆశ్వీయుజ బహుళ త్రయోదశి -ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు
ప్రదోషం.
నేడు (శుక్రవారం) ప్రదోషం. పరమేశ్వరునికి ప్రీతికరమైన ఈ రోజున ప్రదోష కాలంలో లక్ష్మీపూజ చేయడం ఐశ్వర్యప్రదమని పండితులు అంటున్నారు. శుక్రవారం పూట వచ్చే ప్రదోషానికి మహిమ ఎక్కువని, ఈ రోజున ముత్తైదువులు, కన్యలు దీపాలను వెలిగించి, లక్ష్మీనారాయణ స్మరణ చేయాలి.

అంతేగాకుండా ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం.

అందుచేత శుక్రవారం వచ్చే ప్రదోష కాలంలో శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండి పరమేశ్వరుని దర్శించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.


click here for full details :-> శని త్రయోదశి , Shani Triyodashi
  • ==================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: