హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంభంధించినవి. ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు. ఇస్లాం, మరియు క్రైస్తవం, తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు. ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్ మరియు టుబాగో ముఖ్యమైనవి.
- ==============================
No comments:
Post a Comment