Wednesday, August 18, 2010

అశ్వినీ దేవతఅలు , Ashwini devatalu



సూర్య దేవుని భార్య సంజ్ఞాదేవి ఒకసారి తన భర్త వేడి కిరణాలను భరించలేక, అతనికి చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.

అక్కడ ఆమె తండ్రి, దక్షుడు 'భర్తకు చెప్పకుండా ఎందుకు వచ్చావని మందలించి' ఆమెను తిరిగి వెళ్లిపొమ్మన్నాడు.

ఆమె అక్కడి నుంచి బయలుదేరి, ఇంటికి వెళ్లకుండా, భూలోకంలో హిమాలయ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ కురుక్షేత్రంలో గుర్రం రూపంలో ఒంటరిగా సంచరించసాగింది.

చాలాకాలం ఆమె కనిపించకపోవడంతో సూర్యుడు దక్షుని ఇంటికి వెళ్లి అడిగాడు. ఆమెను ఎప్పుడో పంపేశానన్నాడు దక్షుడు. సూర్యుడు లోకాలన్నీ వెతికి, హిమాలయాలలో ఉన్న సంజ్ఞాదేవిని కలుసుకున్నాడు. ఆమె అలుక పోగొట్టేందుకు తాను కూడా అశ్వంగా మారి, కొంతకాలం అక్కడ ఆమెతో కలిసి తిరిగాడు. ఫలితంగా, వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. సత్యాఖ్యుడు, దస్రు అన్నవి వారి పేర్లు. సూర్యుడు, సంజ్ఞాదేవి యథారూపాలను పొంది, ఆ బిడ్డలను ఎత్తి ముద్దాడగానే, వాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వాళ్లనే అశ్వినీ దేవతలంటారు.

వాళ్లు తాము ఆయుర్వేద శాస్త్రంలో ప్రవీణులై దేవతలలో గౌరవస్థానం పొందేలాగ తల్లిదండ్రుల దీవెనలు పొంది, ఓషధీ వనాలను వెతుకుతూ వెళ్లిపోయారు.

సూర్యుడు సంజ్ఞాదేవిని ఓదార్చి తన తీవ్రతను కొంత తగ్గించుకొని భార్యను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్లాడు.

  • ===================================
Visit My Website - > Dr.Seshagiriraoh

No comments: