Thursday, April 15, 2010

పార్వతి , Parvathi




పార్వతి త్రిశకులులలో మూడవ శక్తి . . . పరమేశ్వరుని భార్య. యుగమనునది యోగము నుండి ఉద్భవించినది . ఈ జగత్తులో పారవతి పరమేశ్వరులు కలిసే ఉనంటారు . ఈ సృస్టి యావత్తూ పార్వతీ పరమేశ్వరులు కలిసి పాడే యుగళగీతమే .
పార్వతీ దేవి మేనకా దేవి - హిమవంతులకు చైత్రమాసం .. శుక్ల పక్షము నవమినాదు ఆరుద్రా నక్షత్రం లో జన్మించారు . మూడు కన్నులతో, నాలుగు బుజాలతో పుట్టిన జగదీశ్వరిని చూసి ఆ తల్లి మురిసిపోయింది. ''అమ్మా! మేము సామాన్యులం. నీవు దివ్య శక్తి సమన్వితురాలవు. ఈ తేజస్సును, ఈ రూపాన్ని మేము భరించలేము. నీవు కూడ మా మాదిరిగ సామాన్య రూపాన్ని ధరించి, మా కానందం కలిగించు తల్లీ!'', అని ప్రార్థించింది. తల్లి పలికిన పలుకులు విని, ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ, సామాన్య శిశువు యొక్క రూపాన్ని పొందింది. ఆ శిశువు పర్వతరాజపుత్రిక కనుక పార్వతి అని, హిమవంతుని కుమార్తె కనుక, హైమవతి అని , గిరి కన్యకగా గిరిజ అని అనేక విధాల పేర్లతో వ్యవహరింపబడుతూ దినదిన ప్రవర్థమాన కాజొచ్చింది.

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని భార్య . భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

పూర్తి వివరాలకు : వికిపెడియా - > పార్వతి
  • ===========================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: