Wednesday, April 28, 2010

మాఘ పూర్ణిమ , Magha poornima




సంవత్సరానికి నెలలు 12 . నెలకి ఒక పూర్ణిమ . ఇది సర్వ సాధారణం . ఆకాశం లో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు , పూర్ణిమలు మనకి లెక్కల్లోకి వస్తాయి. శాస్త్రీయం గా చందృడు .. భూమి .. సూర్యుడు గమనాల బట్టి పగలు , రాత్రులు , నెలలు , సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే . దీనినే కేలండర్ అంటాము .
తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకి సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి . పూర్ణిమ నాడు తెల్లవారు ఝామున వెళ్లి సముద్రస్నానము చేయడం మంచిది .

పూర్ణిమలలొకెల్ల మాఘమాసం లో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసం లో వచ్చే పూర్ణిమ , వైశాఖ మాసం లో వచ్చే పూర్ణిమ లు ఎంతో ఉత్కృస్ట మైనవి . ఆ పూర్ణిమల లో చేసే దేవతారాధం మరింత శ్రేస్టమయినది . " మహామాఘి , అలభ్యయోగం " అని ఈ మాఘ పూర్ణిమను అంటారు .అంటే ఈ రొజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట .

  • వైశాఖీ కార్తీకీ మాఘీ
  • తిధయోతీవ పూజిత:
  • స్నానదాన విహీనాస్తా
  • ననేయా: పాండునందన .
అని చెప్పబడింది . స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పూర్ణిమలను గడుపకూడదు . ఈ మాఘపూర్ణిమ తోపాటు ఇదే మాసం లో వచ్చే రధసప్తమి , భీష్మఏకాదశి ., మహాశివరాత్రి , ఎంతో విశిస్టమైనవి .
  • ===============================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: