Monday, February 1, 2010

సమ్మక్క సారమ్మ జాతర , Sammakka Sarakka Jatara

  • 2008 జాతర ఫోటోలు :





సమ్మక్క సారక్క జాతర (Sammakka Sarakka Jatara) అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.


వరంగల్లు జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది . సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిలభారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .

మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా ,చత్తీస్‌గఢ్,జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు .1996 లో ఈ జాతరను రాస్ట్రప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .


ఎవరీ సమ్మక్క-సారమ్మ ?

12 వ శతాభ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాసను'పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క ను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాస పై దండెత్తేడు.ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు 'పగిడిద్దరాజు' కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం ..కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవభావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.


సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారమ్మ ,నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాలనుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితం గా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ చేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయవార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.


ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది, వీరోచితం గా పోరాటం సాగించింది. గిరిజన మహిల యుద్ధనైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమినుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గమధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్క ను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపు కుంటున్నారు.

జాతర విశేషాలు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణెరూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుతీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యదాస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము)నైవేద్యము గా సమర్పించుకుంటారు.
  • ===================================================

Visit My Website - > Dr.Seshagirirao

No comments: