Friday, September 18, 2009

పోలేరమ్మ వ్రతము , Poleramma Vrathamu





భాద్రపద బహుళ అమావాస్య నాడు ఈ పండుగ/వ్రతము స్త్రీలు చేస్తారు . ఈ సం.ము 2009 సెప్టెంబర్ 18 న అమావాస్య .

శక్తి ఆరాధనలో సకలశక్తి స్వరూపిణి అయిన దేవిని పరబ్రహ్మము లేదా ఆదిపరాశక్తిగా అర్చిస్తారు. ఇక్కడ త్రిదేవి అనబడే దేవి స్వరూపచిత్రణ చూపబడింది. ఈమె సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తిగా కనిపిస్తుంది.


హిందూ ధర్మంలో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులుగానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులుగానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేయులుగానూ పిలువబడుతారు. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని దేవీ భాగవతం వర్ణన. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.


ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో ఉన్నాయని భావన. ఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువులా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది.

గ్రామదేవతలలో ఒకరు గ్రామశక్తి పోలేరమ్మ. ఈమెను తెలంగాణాలో పోచమ్మగాను , కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పోలేరమ్మగాను జనులు పిలుస్తున్నారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత కనుక ఈమెను పొలిమేరమ్మగాను. పోలేరమ్మగాను పిలుస్తూ, కొలుస్తూ పూజిస్తున్నారు. గ్రామశక్తి పోలేరమ్మ ఆంధ్ర దేశంలో ఇలవేల్పుగాను, కులవేల్పుగాను, గ్రామవేల్పుగాను ఆరాధింపబడుతున్నది. జగతిని జాగృత్వం చేసి, ప్రగతికి మార్గం చూపేదే మహిళ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు, ప్రగతిశీల భావాలు వర్ధిల్లిన కాలం సింధూ నాగరికధ కాలం. ప్రపంచ నాగరికత దేశాలతో పోటీ పడి సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతితోపాటు పట్టణ నాగరికతను విశిష్టంగా కలిగిందే సింధు నాగరికత. ఇది మాతృస్వామిక దేశం. మహిళ అన్న పథానికి ‘ మహిళా భూమి ’ అని చెప్పడం జరిగింది. మహిళ అనే పదము మహి మరియు ఇలా అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. మహీ అంటే స్ర్తీ అని, ఇలా అంటే భూమి అని వెరసి దా ల్యాండ్‌ ఆఫ్‌ ఉమెన్‌ అని స్పురింప చేస్తున్నది.
పోలేరమ్మ కధ :
శ్రీమత్ కైలాస పర్వతం మీద ఈశ్వరుడు , పార్వతి ... ప్రధమ గణములతో కూర్చున్న సమయమున పార్వతి శివునితో ఒక సంగతి అడిగెను .. " మహాత్మా తమరు సమస్త లోకములు పరిపాలించు కర్తలు , ఏకనిదానముతో ఉన్నా వారైనందున తమకు తెలియని అంశములు ఏమియు లేవు . కృత , త్రేతా, స్వపర , కలియుగములో చివరిదైన కలియుగములో స్త్రీలు మిక్కిలి పాపత్ములుగాను , సంతానలేమివరుగాను కాగలరు అని భవిస్య వాని చెప్పుతున్నందున పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరగా .. ఈ పోలేరమ్మ వ్రతము ను చెప్పెనని అందురు."

2 comments:

Nrahamthulla said...

శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ. పోలేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందంటారు.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తి పోలేరమ్మఅంటారు.పోలేరమ్మను తెలంగాణాలో పోచమ్మ అంటారు.భాద్రపద బహుళ అమావాస్య నాడు పోలేరమ్మవ్రతము చేస్తారు.మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు.బహుజన సంస్కృతి పరిరక్షకులు.సమాజంలోని బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవత ల జాతర ల వల్ల సాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు. మేకలు,పొట్టేళ్ళు, కోళ్ళను నరకడం ,పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్లలతో దర్శించుకోవడం జురుగుతుంది
==పోలేరమ్మ గుడులు==
*[[కొండపాటూరు]]
*[[పెనుగంచిప్రోలు]]
*[[మూలగుంటపాడు]]
*[[బ్రహ్మంగారిమఠం]]
*[[వెంకటగిరి]]

Nrahamthulla said...

పోలేరమ్మ జాతర ఆచారంగా మారింది.పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండి ...పోతురాజుకు టెంకాయ కొట్టండి ... పగలక పోతే మానెత్తిన కొట్టండి' అంటు భిక్షాటన చేస్తారు.జాతర సందర్భంగా ప్రతి ఇంటికి వేపాకు తోరణాలు కట్టి అమ్మవారికి ఇష్ట నైవేద్యమైన అంబలిని ప్రసాదంగా పంచి పెడతారు.చిన, పెద్ద,పేద, ధనిక తారతమ్యం లేకుండా మడిభిక్షాలు ఎత్తి అమ్మవారి జ్ఞాపకార్థం జాతరలో వాటిని వెచ్చిస్తారు.అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరులు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు.ఎటువంటి అలంకరణ లేని ప్రతిమను ముందు అమ్మవారి అత్తవారి ఇంటికి తీసుకు వెళతారు. అక్కడ సాంగ్యాలతో అమ్మవారిని అలంకరిస్తారు.అమ్మవారి చెళ్ళెళ్లు గాలిగంగలు.జాతర రోజులలో శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. ఆ రోజు గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అందువలన శుభకార్యాలు చేపడితే అరిష్టం కలుగుతుందని మూఢనమ్మకం .బ్రాహ్మణేతరులే పోలేరమ్మకు అనాదినుంచీ పూజారులు.కాలం గడిచేకొద్దీ బ్రాహ్మణపూజారులు కూడామారి ఈదేవతకు పూజారులు గా వస్తున్నారు.సారాయి తాగి బాధలన్నీమరచి చిందులువేసే భక్తులకు కులాలు గుర్తురావు.అంటరానితనం ఉండదు.సర్వమానవ సమానత్వంఈ జాతరల్లో వెల్లివిరుస్తుంది.అదే పోలేరమ్మ గొప్పతనం.
పోలేరమ్మ చద్ది:
బర్రె పాడి చల్లగా ఉంటే పోలేరమ్మకు పెరుగన్నంతో పెట్టిన చద్ది ని వీధిలోని పిల్లలందరినీ పొద్దున్నే పిలిచి పంచిపెడతారు.భలే సరదాగా ఉంటుంది.దళిత దేవత,క్షుద్ర దేవత,మాంసాహార దేవత అని హేళన చేసినా అన్నికులాల వారికీ అన్నివయసులవారికీ కడుపుకి ఏదో ఒక ఫలహారం దొరికే మంచి సంప్రదాయం.