Monday, October 22, 2012

Superstitions -మూఢనమ్మకాలు

  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము  -మూఢనమ్మకాలు - గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం . --


మన దేశంలో వింతలూ, విడ్డూరాలకు, వాటిని నమ్మి పూజలు చేసేవారికి కొదవేముంది. అక్షరం ముక్కరాని అమాయకుల మొదలు అమెరికా తిరిగివచ్చే ఆధునిక సైంటిస్టు వరకు ప్రతి పుట్టా చెట్టూ, రాయి రప్పాలో భగవంతుడున్నాడని నమ్మే జనం. వస్తే కొండలాగా కలిసి రావచ్చు, పోతే పోయేదేముంది ఒక దండమేగా అనుకుంటూ ఒక నమస్కారం పడేసి పోవటం నిత్యం మనకళ్ల ముందు కనిపించే దృశ్యాలే.ఈ బలహీనతను సొమ్ము చేసుకోవటం నానాటికీ పెరిగిపోతోంది.నమ్మకము అనేది ప్రతివారికీ ఉండవచ్చును ... కాని అది మూఢనమ్మకము కాకూడదు .

ఏ మతం వారైనా దేవుడు సర్వాంతర్యామి అంటారు గానీ అదేమిటో ఒక మతం వారికి ఇతర మతాల దేవుళ్లు దేవతలు కనిపించరు. క్రైస్తవులు ఎక్కువగా ఉన్నదేశాలలో అక్కడివారికి మన బాబాలు, అమ్మవార్లు, వినాయకుడు, విప్రనారాయణులు కనిపించరు, మన దేశంలో ఇతర మతాలవారికి ఏసుక్రీస్తు, మేరిమాత, దేవదూతలు కనిపించరు. ఇస్లామిక్‌ దేశాలలో కూడా ఇలాంటి మహత్యాల ప్రచారానికి కొదవలేదు.

బాబాలు, దేవుళ్లు ఈ మధ్య వెరైటీగా రకరకాలుగా దర్శనమిస్తున్నారు. ఏడుకొండల వాడికోసం ఏడు కొండలు ఎక్కనవసరం లేదు, రాముడి కోసం భద్రాద్రి పోనవసరం లేదు, సింహాద్రి అప్పన్న కోసం సింహాచలము  వెళ్లడం అవసరం లేదు. ప్రతి చోటూ పుణ్యమైనదే, మనం ఉపయోగించే ప్రతి వస్తువులోనూ కనిపించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుగలడందులేడను చింతవలదు అన్నట్లు ఎక్కడ పడితే అక్కడే కనిపించి భక్తులను ఆనందపరుస్తున్నారు.

స్పీడు యుగం కదా సూక్ష్మంలో మోక్షం. అది రొట్టె ముక్కా, అరటితొక్కా, చెట్టు మొదలా, అట్ల పెనమా? ఇస్త్రీ పెట్టా, ఆవుమాతా, కారుడోరా, సగం తిన్న చిప్సా అన్న వివక్ష, విచక్షణ లేదు. పండగలు, జాతరల సమయాలను చూసుకొని ఇలా ఎక్కడ పడితే అక్కడే కనిపించేస్తున్నారు. డిసెంబరు, జనవరి మాసాల్లో పశ్చిమదేశాల్లో ఇలాంటి వింతల గురించి జనం చెప్పుకుంటారు. జిమ్‌ గ్రాసర్  ఆయన భార్య కోనీకి బంగాళాదుంపల్లో ఏసుక్రీస్తు కనిపించాడట. జిమ్‌ స్టీవెన్స్‌ అనే పెద్దమనిషి ఒక వారం రోజులుగా తనకారును బయటకి తీయలేదు. ఒక రోజు చూస్తే కారు డోరు మీద ఏసుక్రీస్తు బొమ్మ కనిపించిందట. ఇలాంటి వాటి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.

ఇలాంటి మహిమలను గతంలో ఇతరులకు చెప్పి వదలి వేశేవారు. ఇటీవలి కాలంలో వాటిని సొమ్ము చేసుకోవటం ఎక్కువైంది. డయానా డైసర్‌ అనే ఆవిడ ఒకరోజు బ్రెడ్‌ను పెనంపై వేయిస్తుండగా ఆకస్మికంగా ఆ రొట్టెముక్కలో 'కన్య మేరి' కనిపించిందట. దాంతో జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని వేలం మార్కెట్‌లో పెట్టిందట. అది 28వేల డాలర్లకు అమ్ముడుపోయింది. ఇది విన్న మరొకరు తమకు కన్య మేరి చేతిలో ఉన్న బాలఏసు బొమ్మ కనిపించిందంటూ తెచ్చి అమ్మితే 10,600 డాలర్లు వచ్చాయట. సెరియో అనే పెద్ద మనిషికి ప్రయాణించేటపుడు రోడ్డు మీద ఒక కాంక్రీట్‌ స్లాబ్‌ ముక్క కనిపించింది. అది ఏసుక్రీస్తు ముఖంలాగా ఉందట. ఇంకేం దాన్ని వేలానికి పెడితే 1,500 డాలర్లకు ఒక అమాయకుడు కొనుగోలు చేశాడట. తాజాగా బంగాళదుంపలో శిలువ వేలం ప్రారంభపాటగా వెయ్యి డాలర్లు నిర్ణయించారు. మరొక బంగాళదుంపను తాము కేవలం రెండు డాలర్లతోనే వేలం ప్రారంభిస్తున్నామని, దానిద్వారా వచ్చిన సొమ్మును చర్చిలో బ్యాండ్‌ వాయించేందుకు వినియోగిస్తామని ప్రకటించారు. మరొకటి మా ఇంటి పెరట్లో జరిగిన అద్భుతం అంటూ ఐదు డాలర్ల ప్రారంభ ధర నిర్ణయించారు. ఇలాంటి వాటిని వేలం వేసేందుకు అమెరికాలో అనేక ఇంటర్నెట్‌ వేలం కేంద్రాలు పని చేస్తున్నాయి.

అమెరికాలో ఇలా ఉంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక ఇంట్లో గోడ ఏడుస్తున్నదట. ఆ గోడనుంచి నూనెవంటిది కారుతున్నదని, అది కన్నీళ్ల మాదిరిగా ఉందని జనం వేలం వెర్రిగా వెళ్లి దాన్ని తీసుకొని ఒంటికి రాసుకొని తమకు ఉన్న జబ్బులన్నీ నయమయ్యాయని ప్రచారం చేస్తున్నారు. అయితే దానిలో ఎయిడ్స్‌ లేదని గమనించాలి. మూడు సంవత్సరాల క్రితం కారుప్రమాదంలో మరణించిన ఆ ఇంటి బాలుడి మహత్యంతో గోడ ఏడుస్తూ నూనె కార్చుతున్నదని ప్రచారం చేస్తున్నారు. తమ కుమారుడు దేవుడు-తమ మధ్య దూతగా నూనె రూపంలో ఉన్నాడని, మహిళలకు వచ్చే క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులు నయం అవుతున్నాయని తల్లిదండ్రులు ప్రచారం చేస్తున్నారు. ఆ నూనె రాసుకున్న వెంటనే తనకు నెల తప్పిందని ఒకామె చెబుతోంది. ఇప్పుడు ఆ ఇంటిని దర్శించేందుకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వేలం వెర్రిగా వస్తున్నారట. పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమనటం అంటే ఇదేనా ?!
  • =============================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: