Monday, October 22, 2012

హజ్‌ యాత్ర-hajj pilgrimage

  • Makka Mosque image of Hajj pilgrimage from Wikipedia.org



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -హజ్‌ యాత్ర-hajj pilgrimage- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం . --

సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో అల్లా తన దూతలతో నిర్మింపజేసినట్లుగా చెబుతున్న మందిరాన్ని బక్రీద్‌కు ముందు దర్శించుకోవడమే హజ్‌ యాత్ర అంటారు .

ఈ సంవత్సరము ... 23 నుంచి 27 వరకు: ఈ నెల అక్టోబర్  27న బక్రీద్‌ కావడంతో.. 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు హజ్‌ యాత్ర జరుగనుంది . ఈ ఐదు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా మక్కాకు 80 లక్షల మంది వరకు ముస్లింలు హాజరవుతుంటారు. హజ్‌యాత్ర చేసి వచ్చిన వారిని 'హజీ'గా పిలుస్తారు. నలభై నుంచి నలభై ఐదు రోజులు పాటు సాగే ఈ యాత్రలో మక్కా మసీదు ఎదుట చేసే ఒక నమాజు (ప్రార్థన) మిగతా మసీదులలో చేసే లక్ష నమాజులతో సమానంగా ముస్లింలు భావిస్తారు.

తమ జీవిత కాలంలో ఒకసారైనా హజ్‌ యాత్ర చేయాలని కలలు కనని ముస్లిం వ్యక్తి ఉండరు. తగిన ఆర్థిక స్థోమత, ఆరోగ్యం ఉన్న ప్రతి ముస్లిం మక్కా మసీదును దర్శించాలనేది ఇస్లాం బోధకుడు మహమ్మద్‌ ప్రవక్త విధించిన నిబంధన. హజ్‌ యాత్రతో తమ జన్మ ధన్యమైపోయిందన్నది మక్కా వెళ్లి వచ్చిన వారి అంతరాలలో నుంచి ఆనందంగా వచ్చే మాట. అక్టోబరు నెలలో జరిగే హజ్‌ యాత్రకు  వెళ్లే ముస్లింల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. పదేళ్ల క్రితంతో పోలిస్తే హజ్‌ యాత్ర పర్యటనలో ఎదురవుతున్న ఇబ్బందులు చాలా వరకు తగ్గడంతో మక్కా సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

హజ్‌... అంటే సంకల్పించడం షరియత్‌ పరిభాషలో హజ్‌ అంటే సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో అల్లా నివాసాన్ని సందర్శించి, అక్కడ ఉపాసనలు నెరవేర్చుతాననే దృఢసంకల్పంతో వెళ్లి, వచ్చాక వాటిని అమలు చేయడం. ఇస్లాం తాలుకా ఐదు ప్రాథమిక నియమాలలో 'హజ్‌' ఐదోది.
  •  మొదటిది కల్మా.. అల్లాను మనస్ఫూర్తిగా నమ్మడం,
  •  రెండోది నమాజు.. రోజూ ప్రార్థన చేయడం,
  •  మూడోది రోజా.. రంజాన్‌ నెలలో కచ్చితంగా ఉపవాసం చేయడం,
  •  నాలుగోది జకాత్‌.. ప్రతి ముస్లిం తన సంపాదనలో ఏడాదికి రెండున్నర శాతం ,పేదలకు వితరణ చేయడం,
  •  ఐదోది హజ్‌.. జీవితంలో ఒక్కసారైనా మక్కా మసీదును సందర్శించడం.

హాజీల నియమాలు:
  • హజ్‌ యాత్ర చేసి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడరాదు.   
  • ఎదుటి వారిని మోసం చేయకూడదు. 
  • శారీరకంగా, మానసికంగా హింసించడం ఇతరత్రా ఇబ్బందులకు గురిచేయరాదు. 
  • పరస్త్రీ వ్యామోహం, జూదం ఆడటం, మద్య పానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.

ప్రతి ముస్లింకు ఇస్లాం నిర్దేశించిన కర్తవ్యం
హజ్‌ యాత్ర అనేది ప్రతి ముస్లింకు ఇస్లాం నిర్దేశించిన కర్తవ్యం. హజ్‌యాత్రకు వెళ్లేవారు కచ్చితంగా నియామాలతో కూడిన ప్రవర్తనకు కట్టుబడి ఉంటానని నిర్దేశించుకోవాలి. అనంతరం వాటిని అమలు చేయాలి. హజ్‌ యాత్ర మరపురాని మధుర ఘట్టం
హజ్‌ యాత్ర ఆత్మానందం కలిగించే మధుర ఘట్టం. దైవ సన్నిధిలో ప్రార్థనలు చేసే అదృష్టం కొందరికే లభిస్తుంది. మక్కాలో బస చేసి రాళ్లను ఏరి జమ్రాకి వెళ్లి మూడు చోట్ల సైతాన్‌ని రాళ్లతో కొట్టడంతో హజ్‌ పూర్తి అవుతుంది. మక్కాలో 30 రోజులు పాల్గొని పితృదేవతలకు ఉత్తమ గతులు కల్పించాలని ప్రార్థనలు చేస్తారు .మక్కా దర్శనం అరుదైన మహాభాగ్యంగా ముస్లింలు భావిస్తారు.జన్మ ధన్యం అవుతుందని ముస్లిం లు భావిస్తారు .

  • ============================
Visit My Website - Dr.Seshagirirao

No comments: