Friday, November 12, 2010

Cow worship , గోపూజ





పురాణాల ఆధారంగా చూసుకుంటే అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీకనకదుర్గమ్మ త్రిశక్తి స్వూరూపిణి కావడంతో అమ్మవారి అలయం వెలుపల గోపూజ ప్రాముఖ్యత ఎంతో ఉందని పండితుల మాట. సకల దోషాలను హరించే శక్తి ఈ గోపూజకు ఉందని నమ్మకము . గోపూజ జరపటంలో పరమాత్మ సిద్ధాంతం ఏమీ కనిపించదు. అసలు విషయం ఆవు వారికి ఉపయోగపడటమే. ... అసలు గోపూజ అనేది ఒక సామాజిక అవసరాన్ని బట్టి ఒక ఆచారంగా పుట్టిందనిపిస్తుంది. ... గోకులాస్టమి , గోవత్స ద్వాదశి (ఆశ్వయుజ బఖుళ ద్వాదశి నాడు) , కార్తీక మాస పూజలు కార్తీక శుద్ద పాఢ్యమి నుండి బహుళ అమా వాస్య వరకు జరుపుతారు ... వీటిలో భాగం గా గోపూజలు చేస్తారు . అసలు చెప్పాలంటే ఆవును ప్రరిరోజూ పూజింపమని మన పూర్వీకులు మాట .

మనిషి బుద్ధి వంకర. తిన్నగా చెబితే ఏదీ అర్థంకాదు. అర్థమైనా పట్టించుకోడు. అందుకే, దేవుణ్ని ఇరికించారు. పుణ్యాల ఆశపెట్టారు. పాపాల బూచిచూపించారు. అందమైన కథలల్లారు. గోవు . దేవతలు , దేవుళ్ళు .... ఆ కథలోని పాత్రలే! అందుకేనేవో మన పెద్దలు ఏరికోరి గోపూజను ఏర్పాటు చేశారు.

ఇక్కడ గోవు అంటే అన్ని నాటు గోవులు కావు . దేవ దానవ "క్షీర-సాగర మదనము" లో జనించిన కామధేనువు అని అర్ధము . కామధేనువు, కల్పవృక్షం అడిగిందల్లా ఇస్తాయంటారు. ఆ రెండూ దేవేంద్రుడి వశము లో ఉంటాయి. ఇవి వశం చేసుకోవాలంటే, ఇంద్రుణ్ణి జయించాలి. ఇంద్రియలోలులకి మనసనే ఇంద్రుణ్ణి జయించడం అసాధ్యం. కామధేనువును పూజిస్తే దేవ , దానవ , మానవులు ఇంద్రియాలను జయంచి తమ మనస్సును అధీనములో ఉంచుకోగలుగుతారని నమ్మకము . కామధేనువు కాలక్రమేన అందరికీ అందుబాటులో లేనందున అన్నివిధాల అందరికీ ఉపయోగపడే ఆవునే పూజంచమని హిందూ పండిత పామరులు పెట్టిన ఆచారము . ఆవు పాలు తల్లి పిల్లలతో ఇంటిల్లపాది తాగి ఆరోగ్యవంతులవుతారు . పాల దైరీ వలన ఎంతోమంది జీవనోపాది పొందుతున్నారు . ఆవుపేడ పూర్వము వంటచెరకు గా ఉపయోగపడేది . ఆవు పంచకము పూర్వము ఋఉషులు , కొంతమంది ఇప్పటికీ మందుగా వాడుతున్నారు . ఇన్ని ఉపయోగాలున్న ఆవును పదిలము గా కాపాడుకోవడం కోసము హిందూ ధర్మ శాస్త్రము " గోపూజ " అనే ఈ ఆద్యాత్మిక నిబందన ను ప్రబల ప్రచారము చేసి కొనసాగిస్తూ ఉన్నది . పది మందికీ ఉపయోగపడే ఏ పని అయినా మంచిదే కదా .
*****
పూర్వం సాధువులు అధికంగా గోవు (ఆవు)కు పూజలు జరుపుతుండేవారు. వివిధ మఠాల పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి సాధువులందరూ ఇష్టపడి చేసే పూజ గోపూజ. త్రిమూర్తులు, సకల దేవతలు గోవుమాతపైనే కొలువై ఉన్నట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

దేవలోక గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు.

విజ్ఞాన పరంగా చూసినట్లైతే గోవు పంచితం క్రిమి సంహారిగాను (రసాయ పదార్థం) ఉపయోపడుతుంది. అంతేకాకుండా గోవు ఇచ్చే పాలు తల్లితో పాటు శ్రేష్టంగా ఉండటం గమనించవచ్చు. గోవు శాఖాహారిగాను, సాధు జంతువుగా ఉన్నందునే కాకుండా, అది మనకు ఉపయోగకారిగా ఉన్నందునే దాన్ని మన గృహాల్లో పెంచుకుంటున్నాము.

కామోద్రేక్తంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోపూజతో సమానమేనని పండితులు భావిస్తున్నారు.

అలాగే దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది.

మనలో చాలామంది ఆవును పూజిస్తారు కదా. దానిని ‘గోపూజ’ అంటారు. ఈ పూజకి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉం టాయి. ఆవు నుదిటి భాగంలో శివుడు, కొమ్ముల చివరలో మూడుకోట్ల యాభైలక్షల తీర్థాలు వుంటాయి. వాటిపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుంది. నుదుట న శివుడు ఉంటాడు కనుక అక్కడ శివ అష్టోత్త రం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాల తో పూజిస్తే... సాక్ష్యాత్తు కాశీ విశ్వేశ్వరుడ్ని పూజించిన ఫలితం దక్కుతుంది. గోవు నాసిక యందు సుబ్రహ్మణ్యస్వామి వుండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదు. ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉం టారు. వారిని స్వర్గలోక వైద్యులు అంటారు. అందువల్ల ఆవు చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుండి విముక్తి అవుతుందంటారు. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారు. వారిని పూజిస్తే... అజ్ఙానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయి. ఆవు నాలికపై వరుణ దేవుడు వుండటం వల్ల అక్కడ పూజిస్తే... శీఘ్ర సంతతి.

ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవత లుంటారు. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవు, పుణ్యలోకప్రాప్తి. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారు. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయి. ఆవు కంఠంలో ఇంద్రుడిని పూజిస్తే... ఇంద్రియ పాటవాలు, సంతానం కలుగుతుంది. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగు తాయి. ఆవు గిట్టల చివర ‘నాగదేవతలు’ ఉంటారు. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుంది. అంతేకాక భూమిపై నాగుపాముల భయం ఉండదు. ఆవు గిట్ట ల్లో గంధర్వులుంటారు. కనుకత గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తా యి. ఇవేకాకుండా జాతక రీత్యా శని దోషం ఉన్న వారు, గ్రహచారం బాగా లేనివారు, పెళ్లికానివారు గోస్త్రోత్రం చదివితే సత్ఫలితాలు పొందుతారు.

శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం నల్లని ఆవుకు తవుడు, పచ్చగడ్డి సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే... శని బాధలు తగ్గుతాయి. కుజదోషం వల్ల వివాహంలో ఆటంకాలు, ఆలస్యం అయ్యేవారు ప్రతి మంగళవారం ‘కందులు’ నానబెట్టి ఎర్రని ఆవుకు తొమ్మిది వారాలపాటు తినిపిస్తే...

సత్ఫలితాలుంటాయి. అందువల్ల ‘గోమాత’ సకల దేవతా స్వరూపంగా భావిస్తారు.


  • =======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: