Thursday, November 18, 2010

భగినీ హస్తభోజనం , Bhagini Hasta bhojanamu



"భగినీ హస్త భోజనము" అంటే ... సోదరి చేతి వంటలతో , సోదరి ఇంట భోజనము చేయడం అని అర్ధము . ఇది ఒక సనాతన , కుటుంబ ఆప్యాయతల్ని పెంచే ఆచారము . ఇటు వంటి మంచి ఆచార అలవాట్లు మన హిందూ పండగల్లో ఎన్నో ఉన్నాయి . ఆ సత్సంప్రదాయాలను మన తరువాత తరము వారికి అందించాలి ... అందించడానికే అన్ని పండుగలూ తప్పనిసరిగా ఆచరించాలి , చేయించాలి .

ప్ర్రాచీన భారతదేసములో ఉమ్మడి కుటుంబాలు , బంధుమిత్ర అనుబంధాలు , ఆప్యాయతలు మెండుగా ఉండేవి . పండుగులకు , పబ్బాలకు , ఉత్సవాలకు , గ్రామ వేడుకలకు , ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహ .. బంధుత్వాలను నిలబెట్టుకొంటూ విలువలను పాటించేవారు . అది ఎంతో మంచి సంప్రదాయము . నేటి సమాజము లో ఒంటరి కుటుంబాలు ఎక్కువైపోయాయి ... పొరిగింటివారికి కూడ పిలిచే ఓపిక , టైం లేదని వాపోతుంటారు . మన సంస్కృతిలోని పురాణ కథలు , వ్రతాలు , నోములు లలో ఉన్న ఎన్నొ ఈ బంధుత్వాల విలువలను ప్రచారము చేసే కథలు , చరిత్రలు మన తరువాత తరమువారికి అందించే భాద్యత మన అందరిపైనా ఉన్నది .

తోడబుట్టిన స్త్రీ సంతానాన్ని " భగిని" అంటారు . ఆమె హస్తము తో చేసిన (చేతితో వండిన)భోజనాన్ని చేయడాన్ని భగినీహస్త భోజనము అంటారు . కార్తీక మాసము ప్రవేశించిన 2 వ రోజున ఈ బోజనాలు చేయాలన్నది శాస్త్రము . ఇక్కడ రెండు వేరు వేరు కాలలో చెప్పబడిన కదనాలు ఉన్నాయి. ఒక కాలము లో బలిచక్రవర్తిని , ఇంకోకాలము లో యమధర్మరాజుని వారి వారి చెల్లి , లేదా అక్క (ఇక్కడ అన్నా-చెల్లెలు , అక్కా-తమ్ముడు ... అంటే తమ సోదరుల్ని (సమానమైన ఉదరము అంటే ఒకే తల్లి గర్భము నుండి పుట్టిన వాళ్ళని ) తమ ఇంటికి కనీసము ఏడాదికి ఒకసారైనా వచ్చి తమ చేతి భోజనము తిని వెళ్ళవలసిందిగా కోరారట .  కార్తీక శుద్ద విదియ నాడు వస్తామని ఆ ఇద్దరూ ఒకప్పుడు మాటినిచ్చి అలాగే జీవితాంతము చేశారని పురాణం లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు తమ సోదరి (ల) ఇంటికి వెళ్ళి భోజనము చేసి కానుకలు , వస్త్రాలు పెట్టి -- అక్క ఇంటికెళ్తే ఆమె ఆశీర్వాదాన్ని పొందాలని , చెల్లిలయితే ఆమె ను ఆశీర్వదించి రావాలని ... ఓ నియమము చేసింది శాస్త్రము . ... అదే " భగినీ హస్తభోజనము " 

దీపావళి పండుగ తరువాత వచ్చే విదియ యమద్వితీయ , లేక భ్రాతృద్వితీయ . ఆ రోజు ప్రతి పురుషుడు తమ చెల్లెలు ఇంటనో ... చెల్లెలు లేనట్లైతే చెల్లెలు వరస ఇంటనో , అక్క ఇంటనో భోజనము చేయాలి . ఈ పండుగ నియమ నిభందనాలలో ఇదొకటి . సూర్య భగవానుని సంతానమైన యమున (కూతురు) యమధర్మరాజు కవలపిల్లలు ... చెల్లెలు తన ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా పని భారముతో యముడు వెళ్ళడం కుదరలేదు . . . చివరకు ఒకరోజు అనగా దీపావళి తరువాత విదియ నాడు వెళ్ళి చెల్లెలి ఆతిద్యం స్వీకరించి భోజనం చేసి ... వస్త్రాభరణాలు , కట్న , కానుకలు ఇచ్చాడంటారు . అలా ప్రతిసంవత్సరమూ చేస్తూఉంటాడని నమ్మకము . కార్తీక శుద్ధవిదియనాడు భ్రాతృపూజ అని ఈ ఆచారానిని అంటారు .

జీవితాన్నీ , ఈ జన్మనీ పొందింది అక్కడెక్కడో శరీర -ఇంద్రియ -ప్రాణాలని ఫణము గా పెట్టి  ఉద్యోగము చేస్తూ గడిపేయడానికేనా?.. కాదు . ఒక అన్నా లేదా తమ్ముడూ ఓ సోదరి ఇంటికి వెళ్తే ఆమె ఇంటి పరిస్థితి ఎలాఉందో , మేనళ్ళుడూ ,మేనకోడలూ ఎలా ఉన్నారో, తమ సోదరి పట్ల బావగారు లేదా బావమరిది  ప్రవర్తన ఎలా ఉందో , ఇలా అన్నివిషయాలు ప్రత్యక్షము గా తెలుస్తోంది. మరి అన్న లేదా తమ్ముడే ఎందుకు వెళ్ళాలి అంటే తమని కన్న అమ్మకుడా ఓ సోదరుడుకి సోదరే కాబట్టి .. ఆయన రావలసిన రోజున అమ్మ తన కూతురు సంసారము చూడానికి వెళ్తే ఎలా?  .

ఇంట్లో ఉండే పెద్దన్న తండ్రి తరువాత తండ్రంతటివాడు .అలాగే ఇంట్లో ఉండే తోబుట్టువు అమ్మ తరువాత అమ్మంతటిది . అంటే దీనర్ధము భగినీ హస్తభోజనానికి తల్లిదండ్రులు గతించిన వాళ్ళే వెళ్ళాలని కాదు . అంతేకాదు ఇలా సోదరినుండి తన సంసార పరిస్థితిని గమనించిన సోదరుడు ఆ సంసార పరిస్థితి మొత్తాన్ని తమ తండ్రికి చెప్పలన్నదే దీనిలోని నేపధ్యము . కుటుంబాలు విడిపోకుండా ఉండేందుకు ఇదో సాంప్రదాకమైన పద్దతి.
  • ======================================
Visit My Website - > Dr.Seshagirirao

No comments: