Friday, July 23, 2010

సంతోషిమాత , Santhoshimata


[Santhoshi+mata+Ammavaru+-+Old+Srikakulam.jpg]


శివ పురాణం ప్రకారం వినాయకునికి ఇద్దరు కుమారులు - క్షేమము, లాభము. ఉత్తర భారతంలో వీరిని శూభము, లాభము అని వ్యవహరిస్తారు. 1975లో వెలువడిన హిందీ సినిమా జై సంతోషీ మాలో వినాయకునికి వృద్ధి, సిద్ధి అనే వారితో వివాహం జరిగినట్లు, వారికి సంతోషీ మాత అనే కుమార్తె కలిగినట్లు చూపారు. ఈ విషయం పురాణాలలో లభించడంలేదు కాని సంతోషీమాత కధ దేశంలో బాగా ప్రసిద్ధమైనది. వినాయకుడు లోకప్రియమైన దేవునిగా ఎలా అభివృద్ధి చెందాడో తెలుసుకోవడానికి ఈ కధ ఉపయోగపడుతుందని అనితా రాయ్ తపన్ మరియు లారెన్స్ కోహెన్ అభిప్రాయపడ్డారు.


వినాయకుని వివాహము :

వినాయకుని వివాహమునకు అనేక చరిత్రలున్నాయి. అందులో ఓ కథనం ప్రకారం విఘ్నేశ్వరునకు ' విశ్వరూపుడనే' ప్రజాపతి కుమార్తెలు .. సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు సతీమణులున్నట్లు ప్రతీతి. కనుకనే వినాయకుడు కొలువైన చోట సకల కార్యాలూ సిద్ధిస్తాయని శాస్త్ర కారుల విశ్వాసము.

సిద్ధి, బుద్ధి మహాత్మ్యం చేత జ్ఞానం వికసిస్తుందని, అందుచేత పూజ, వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యముల ప్రారంభానికి ముందు వినాయకుని పూజతోనే మొదలవడం శాస్త్రోక్తం. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు. ఇకపోతే విఘ్నేశ్వరుని వివాహంపై మరికొన్ని గాథలు ఆయన బ్రహ్మచార్య వ్రతాన్ని కైగొన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

సంతోషీమాత జన్మము :
ఒకానొక కాలములో వినాయకుని పిల్లలు చిన్నవయసులో ఉన్నపుడు ... రాఖీ పండుగ సంబరాలు జరుతున్నాయి . ఆడపిల్లందరూ అన్నదమ్ములకు రక్షాబంధం ... రాఖీ ని కడుతూ తోటి పిల్లలతో ఆనందముగా గడుపుతున్నారు . అది చూసిన క్షేమకరుడు , శుభకరుడు ఇద్దరూ తమకు అక్కో , చెల్లిలో కావలని మారాం చేయగా ... ఏమి చేయాలో తోచక విఘ్నేశ్వరుడు నారదమునిని పిలిచి సహాయము కోరగా " మహిమాసంపన్నులకు మీరు చేయలేది ఏమున్నది " అని సంబోధిస్తూ అమ్మలు అయిన పార్వతీదేవిని , లక్ష్మీదేవిని , సరస్వతీమాతను అడుగమని సలహాయిచ్చెను . ముద్దుల కొడుకు గణపతి కోరిక కాదనలేక ముగురమ్మలూ తమ శక్తులతో కూడిన బాలికను వినాయకుని కుమార్తెగా పంపెను . జననీ జనకులకు నమస్కరించి వారి దీవన్లు తీసుకొని , మహర్శి నారధునకు నమస్కారము చేసెను . వినాయక కుటుంబకు సంతోషముగా ఉన్న సమయమున ఆ బాలికకు " సంతోషి మాత " అని నారదుడు నామకరణము చేసారని అంటారు . గనేషుడు కుమార్తెకు తన శక్తులను , విద్యలను ఒసగెను .
  • =======================================
Visit My Website - > Dr.Seshagirirao

1 comment:

చింతా రామ కృష్ణా రావు. said...

ఆర్యా! శేషగిరి రావు డాక్టర్ గారూ! నమస్తే.
అద్భుతమండి మీ బ్లాగు.
మీరు స్వయంగా వైద్యులు కాబట్టి శాస్త్రంలో గల అంతర్గత భావంగా ఉన్న ఆరోగ్యపరంగా వివరిస్తూ చక్కగా చెప్పుతున్న మీకు ధన్యవాదములు.
నేను రిటైర్డ్ తెలుగు లెక్చరర్ ను.విశాఖ పట్టణం జిల్లా. చోడవరం డిగ్రి కాలేజ్ లో పని చేసి రిటైరయ్యాను.మీది శ్రీకాకుళం అన్న సంగతి తెలిసి నాకు మరీ సంతోషం కలిగింది.నేను రాజాంలో జూనియర్ కాలేజ్ లో చాలా తక్కువ మాసాలే పని చేసినా అనూహ్యమైన మంచి గుర్తింపు ; పేరు వచ్చింది. దానికి కారణం ఆనాటి ప్రిన్స్పాల్ మరియు ష్టేఫ్.
http://andhraamrutham.blogspot.com